మంచి చిత్రాలు చేయడా? ఆ సినిమా కలెక్షన్లను కొట్టడా?.. నాని షాకింగ్ కామెంట్

ఎంసీఏ సినిమాతో కమర్షియల్‌గా, జెర్సీ చిత్రంతో ఎమోషనల్ యాక్టర్‌గా ఆకట్టుకొన్న నేచురల్ స్టార్ నాని తాజాగా గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. చిరంజీవి కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచిన సినిమా టైటిల్‌ను పెట్టుకోవడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ రూపొందించిన ఈ చిత్రంలో సీనియర్ నటులు లక్ష్మీ, శరణ్యలు కీలక పాత్రలన పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో నాని మీడియాతో ముచ్చటించారు. నాని చెప్పిన మాటలు ఇవే..

విక్రమ్ కే కుమార్‌తో కలిసి

విక్రమ్ కే కుమార్‌తో కలిసి

దర్శకుడు విక్రమ్ కుమార్‌తో కలిసి పనిచేద్దామని అనుకొన్నాం. రకరకాల సబ్జెక్టులపై చర్చించాం. పూర్తిస్థాయిలో అవగాహన కుదరలేదు. కానీ జెర్సీ ప్రారంభానికి ముందు విక్రమ్ కుమార్ కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. వెంటనే ఒప్పేసుకొన్నాన. ఇక జెర్సీ కోసం క్రికెట్ ప్రాక్టిస్ చేస్తున్నప్పుడు వచ్చి సినిమా టైటిల్ గ్యాంగ్ లీడర్ అని చెప్పాడు. నాకు కూడా ఎక్సైటింగ్‌గా ఉండటంతో హ్యాపీగా ఫీలయ్యాను. ఈ చిత్రంలో నేనే గ్యాంగ్ లీడర్ అని నాని చెప్పారు.

నా సినిమా కాదు..

నా సినిమా కాదు..

టైటిల్ నానిస్ గ్యాంగ్ లీడర్ అని పెట్టడంతో నాని సినిమా అనే ఫీలింగ్ వస్తుంది. దర్శకుడు విక్రమ్ కుమార్ తక్కువ చేసినట్టు కనిపిస్తున్నది. అయితే పక్కాగా ఇది విక్రమ్ కుమార్ సినిమానే. అందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో నా చిత్రాలకు నాని అనే ట్యాగ్ తగిలించాం. గ్యాంగ్ లీడర్‌కే కొత్తకాదు. అలాగే ఈ సినిమాలో పెన్సిల్ పార్థసారథి అనే రచయితగా కనిపించబోతున్నాను అని నాని అన్నారు.

జెర్సీ విషయంలో హ్యాపీ

జెర్సీ విషయంలో హ్యాపీ

జెర్సీ సినిమా సక్సెస్, కలెక్షన్ల విషయంలో నేను హ్యాపీ. క్రికెటర్ రోల్ ప్లే చేసి.. ఎమోషనల్, విషాదకరమైన ముగింపు ఇచ్చి ప్రేక్షకులను మెప్పించాం. చాలా విషయాల్లో తెలుగు సినిమా సంప్రదాయలను బ్రేక్ చేశాం. అలా మెప్పించి రూ.30 కోట్లు వసూలు చేసే సినిమా చేశాం. అంతకంటే ఆ సినిమా ఇచ్చిన ఫలితం కొత్త అనుభూతిని ఇచ్చింది అని నాని పేర్కొన్నారు.

మీరే రకరకాలుగా అంటారేంటీ?

మీరే రకరకాలుగా అంటారేంటీ?

జెర్సీ సినిమాకు ముందు ఎంసీఏ రిలీజ్ అయినప్పుడు నాని ఇక మంచి సినిమాలు చేయడా? ఇక జెర్సీ సినిమా రిలీజ్ తర్వాత ఎంసీఏ కలెక్షన్లను కొట్టలేదేంటి అని రాశారు. ఇలా రెండు రకాల వార్తలు రాస్తే నేను ఏది పాటించాలి. అసభ్యం, అశ్లీలత లేకుండా జెర్సీ లాంటి సినిమాను తీసి.. 30 కోట్లు సంపాదించాం. ఆ సినిమా అన్ని భాషల్లో రీమేక్ అవుతున్నది. అంతకంటే ఏం కావాలి అని నాని అన్నారు.

జెర్సీతో 400 శాతం లాభం

జెర్సీతో 400 శాతం లాభం

జెర్సీ సినిమాను మేము లాభాలను రాబట్టడానికి చేసిన సినిమా కాదు. ఆ సినిమాను చైనాలో కూడా రిలీజ్ చేయబోతున్నాం. మేము పెట్టిన డబ్బుకు 400 శాతం లాభం వచ్చింది. అలాంటి సినిమా విషయంలో ఇంకా అసంతృప్తి ఏముంటుంది. జెర్సీ సినిమాకు అన్ని రకాలుగా మంచి రెస్పాన్స్ వచ్చింది అని నాని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X