Kalki 2898 AD: కల్కిగా నాని.. నేచురల్ స్టార్ అదిరిపోయే క్లారిటీ

భారతీయ సినిమా పరిశ్రమలో కల్కి 2898 చిత్రం సంచలన విజయం సాధించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. అశ్వినీదత్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా రిలీజై అన్ని భాషల్లోను బ్లాక్‌బస్టర్ విజయం అందుకొన్నది. అయితే కల్కి సినిమాలో కల్కి పాత్ర ఎవరు వేస్తున్నారనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. ఆ విషయంపై నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ..

కల్కి 2898 AD మూవీలో అర్జునుడుగా ప్రభాస్, అశ్వత్తామగా అమితాబ్ బచ్చన్ నటించాను. దీపిక పదుకోన్ ఓ కీలక పాత్రలో కనిపించారు. అయితే దీపిక గర్బవతిగా ఉండి.. ఆమె ఓ బిడ్డకు జన్మనిస్తారు. అతడే కల్కి అవతారం అనే పాయింట్ సీనీ, మీడియా వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే ఈ పాత్ర కోసం ఎన్టీఆర్, పవన్ కల్యాణ్‌ను సంప్రదించారని.. కానీ వారు అందుకు సుముఖంగా లేరని విషయం మీడియాలో వినిపించింది.

Natural Star Nani clarity on Kalki Role in Kalki 2898 AD at Saripoda Shanivaram promotional event

అయితే కల్కి పాత్ర కోసం నేచురల్ స్టార్ నానిని సంప్రదించారు. ఆ విషయంపై డిస్కషన్స్ జరుగుతున్నాయి అనే వార్త మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అయితే తాజాగా నాని నటించిన సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్స్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ వార్తపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

కల్కి సినిమాలో కల్కి క్యారెక్టర్ గురించి నాతో సంప్రదించారనే గాసిప్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఎవరు చెబుతారో కూడా తెలియదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే.. మీడియా దానిని ఫాలో అవతున్నారు. ఓ సోషల్ మీడియా హ్యాండిల్‌లో అవతార్ సినిమా టెక్నికల్ టీమ్ నానిని అప్రోచ్ అయ్యారంట అని పెడితే.. దానిని మీడియా ఛానెల్స్ కాపీ చేసి పోస్టు చేస్తున్నారు. గతంలో మీడియా ఛానెల్స్‌ ఫేక్ అని చెప్పేవారు. కానీ సోషల్ మీడియా ప్రభావం వల్ల మీడియా కూడా ఆ ట్రాప్‌లో పడిపోయారు అని నాని అన్నారు.

Natural Star Nani clarity on Kalki Role in Kalki 2898 AD at Saripoda Shanivaram promotional event

సోషల్ మీడియా విస్తృతి పెరిగి పోవడం వల్ల ఎక్కడి నుంచి వార్త పుడతుందో.. ఎవరి నుంచి వస్తుందో.. అలాంటి వార్తలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియదు. అయితే కల్కి విషయంలో మా మధ్య అలాంటి విషయం డిస్కషన్‌కు రాలేదు. ఆ విషయంలో మాకు ఎలాంటి సమాచారం లేదు అని నాని అన్నారు.

మీడియాలో వచ్చే గాసిప్స్‌కు సమాధానం ఇస్తూ పోతే ప్రతీ దానికి జవాబు ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఏదైనా గాసిప్ వస్తే ఆన్సర్ ఇవ్వకపోతే అది నిజమే అనే విషయం మీడియాలో ప్రభావితం అవుతుంది. కాబట్టి ప్రస్తుత జనరేషన్‌లో సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్‌ను అంతగా పట్టించుకోవద్దని అనుకొన్నాం. వాటికి సమాధానం ఇస్తూ పోతే.. ఎన్నిసార్లు ఇచ్చిన సమయం సరిపోదు అని నాని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X