Ante Sundaraniki జూలై 1న ఓటీటీలో విడుదల.. అసలు రిలీజ్ డేట్‌పై నాని క్లారిటి!
దేశవ్యాప్తంగా దక్షిణాది సినిమాలకు బ్రహ్మండంగా ప్రేక్షకదారణ పొందడం చాలా ఆనందంగా ఉంది. దాంతో ఉత్తరాది సినిమాలు తక్కువ అని చెప్పను. సినిమా పరిశ్రమకు ఇప్పుడు స్వర్ణయుగం లాంటింది. సినిమా బాగా ఆడుతుందంటే.. దానంతంట అదే దేశవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతుంది. దాంతో సినిమా పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయని దాని అర్ధం అని నాని అన్నారు. జూన్ 10వ తేదీన రిలీజ్ అవుతున్న అంటే సుందరానికి సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలకు క్లారిటీ ఇస్తూ..

నిడివి సినిమాకు సమస్య కాదు..
అంటే సుందరానికి సినిమా నిడివి సుమారు మూడు గంటలు. అయితే సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు లెంగ్త్ ఎక్కువైందని అనిపించదు. ఒకవేళ గంటన్నర సినిమా ఎక్కువైందంటే.. ఆ సినిమాకు లెంగ్త్ ప్రాబ్లెం. ఒకవేళ మూడు గంటలు చూసిన తర్వాత కూడా ఇంకా కొంచెం ఉంటే బాగుంటుందనిపిస్తే.. నిడివి ఎక్కువ ఉందనే అభిప్రాయంగా పరిగణించకూడదు. అంటే సుందరానికి సినిమా మూడు గంటలు చూసినా అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ కలుగుతుంది అని నాని చెప్పారు.

కరోనా భయాలు లేవు.. అంటూ
ప్రస్తుతం కరోనా భయాలు ఎవరిలోను లేవు. కరోనా వచ్చిందా? జలుబు చేసిందిలే అనుకోవడం.. మూడు రోజుల తర్వాత మామూలుగా మారడం జరిగిపోతున్నది. అమెరికాలో కోవిడ్ సిట్యూయేషన్ ఉంది. కానీ అంతగా భయం లేదు. మాస్కులు కూడా ఎవరు వేసుకోవడం లేదు అని నాని చెప్పారు.

ప్యాన్ ఇండియా ప్రేక్షకుల చేతుల్లోనే..
ప్యాన్ ఇండియా సినిమా విషయంలో చాలా సార్లు చెప్పాను. ప్యాన్ ఇండియా సినిమా అనేది ప్రేక్షకుల నిర్ణయించాలి. మంచి కథ ఉంటే.. ఆటోమెటిక్‌గా ప్యాన్ ఇండియా అవుతుంది. పుష్ప సినిమా ఇతర ప్రాంతాలకు సంబంధం లేని కథ. అయినా ఉత్తరాదిలో ఆ సినిమాను బ్రహ్మండంగా ఆదరించారు. నేను చేసే సినిమాల కథ, కంటెంట్ బాగుంటే.. అది ప్యాన్ ఇండియా సినిమా అవుతుంది అని నాని చెప్పారు.

విజయ్, మహేష్ మూవీలో పాత్ర గురించి
తమిళ సూపర్‌స్టార్ విజయ్, వంశీ పైడిపల్లి సినిమాలో గెస్ట్ రోల్ వేస్తున్నానని, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు సినిమాలో నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. నాకు రకరకాల వార్తలను నా వద్దకు వస్తున్నాయి. దాంతో నా పరిస్థితి ఎలా మారిందంటే.. నా సొంత సినిమా గురించి ప్రకటించినా అది గాసిప్, రూమర్‌గా మారే ప్రమాదం కనిపిస్తున్నది. ఇలాంటి వార్తలు ఎక్కడ పుడుతున్నాయో అర్ధం కావడం లేదు. అలాగే ప్రశాంత్ నీల్ సినిమాలో నటిస్తున్నాననే వార్త కూడా నా వద్దకు వచ్చింది అని నాని అన్నారు.

అంటే సుందరానికి ఓటీటీ రిలీజ్ గురించి
అంటే సుందరానికి సినిమా ఓటీటీ రిలీజ్ గురించి వచ్చిన రూమర్లపై నాని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా జూలై 1వ తేదీన అంటే రిలీజ్ తర్వాత మూడు వారాలకు థియేటర్‌లోకి వస్తుందని సోషల్ మీడియాలో, మీడియాలో వార్తలు రాస్తున్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. అయితే అంటే సుందరానికి చిత్రం ఓటీటీ రిలీజ్ గురించి, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గురించి వాస్తవాలు వాటంతట అవే త్వరలో తెలుస్తాయి అని నాని చెప్పారు.


Click it and Unblock the Notifications











