కేసీఆర్ బయోపిక్‌పై నవాజుద్దీన్ సిద్ధికీ క్లారిటీ.. పోరాట యోధుడి పాత్రలో..

విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఏ పాత్రలోనైనా ఒదిగిపోతాడు. ఏ పాత్ర వేసినా అందులో జీవిస్తాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం మాంటో. అద్భుతమైన, పేరొందిన రచయితగా పేరున్న సాదత్ హసన్ మాంటో జీవితం ఆధారంగా రూపొందుతున్న మాంటో చిత్రంలో టైటిల్ పాత్రను పోషించాడు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో తెలుగు ఫిల్మీబీట్‌తో మాటాడారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విషయాలు ఇవే..

 విప్లవాత్మక రచయిత

విప్లవాత్మక రచయిత

మాంటో గొప్ప రచయితనే కాదు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై అప్పట్లోనే విప్లవాత్మక స్వరాన్ని వినిపించారు. ధైర్యానికి, స్వేచ్చకు ప్రతీకలుగా నిలిచారు. అలాంటి వ్యక్తి కథలు చదువుతూ పెరిగాను. ఆ పాత్రలో నటించే అవకాశం రావడంతో కాదనలేకపోయాను.

 మాంటోకు న్యాయం చేశా

మాంటోకు న్యాయం చేశా

మాంటో సినిమాను చేయాలని నందితాదాస్ ఈ పాత్రను ఆఫర్ చేసినప్పుడు సంతోషంగా ఫీలయ్యాను. మాంటోగా పాత్రలో ఒదిగిపోయి న్యాయం చేస్తానని చెప్పాను. మిగితా విషయాలు మీరే చూసుకొండి అని చెప్పాను. ముందుగా అనుకొన్న ప్రకారమే సినిమాను అద్భుతంగా నందిత తెరకెక్కించారు.

రజనీ అద్భుతమైన వ్యక్తి

రజనీ అద్భుతమైన వ్యక్తి

సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్‌లో వస్తున్న పెట్ట చిత్రంలో తొలిసారి దక్షిణాది చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నాను. రజనీకాంత్ అద్బుతమైన నటుడనేది నేను కొత్తగా చెప్పేది కాదు. ఆయన స్టార్ హీరో అయినప్పటికీ ఆయన సామాన్యుడిగా ఒదిగి ఉండటం గొప్ప విషయం. రజనీకాంత్ పక్కన నటించే అవకాశం రావడం అదృష్టంగానే భావిస్తాను.

 తెలుగులో ఆఫర్ వస్తే

తెలుగులో ఆఫర్ వస్తే

నాకు భాష, ప్రాంతం అనే భేదాభిప్రాయాలు లేవు. తెలుగులో కూడా నేను నటించడానికి సిద్ధం. మంచి పాత్ర, సినిమా వస్తే ఎప్పుడూ రెడీగా ఉంటాను. తెలుగులో నటించాలనే కోరిక కూడా ఉంది.

కేసీఆర్ బయోపిక్‌పై

కేసీఆర్ బయోపిక్‌పై

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బయోపిక్‌లో నటిస్తున్నాననే విషయంపై నాకు క్లారిటీ లేదు. ఎవరూ నన్ను సంప్రదించలేదు. కానీ వార్తలు మాత్రం నా దృష్టికి వచ్చాయి. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే తప్పకుండా కేసీఆర్ పాత్రలో నటిస్తాను. ఓ ప్రాంత ప్రజల ఆక్షాంక్ష కోసం పోరాటం చేసిన యోధుడి పాత్రలో నటించే అవకాశం వస్తే కాదను అని నవాజుద్దీన్ సిద్దిఖీ అన్నారు.

నందితాదాస్ దర్శకురాలిగా

నందితాదాస్ దర్శకురాలిగా

నటి, రచయిత, నిర్మాత, దర్వకురాలు నందితా దాస్ ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 21న విడుదల అవుతున్నది. ఈ సినిమాను రూపొందించడం ఓ సవాల్‌తో కూడుకొన్నది అని దర్శకురాలు నందితాదాస్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X