Nawazuddin Siddiqui కేసీఆర్ బయోపిక్ ఎందుకు ఆగిపోయిందంటే? నవాజుద్దీన్ సిద్దిఖీ క్లారిటీ!
విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో 75వ చిత్రంగా దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్‌లో ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి తన సొంత బ్యానర్ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న చిత్రం సైంధవ్. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రలో నటిస్తూ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇక ఈ సినిమా జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఫిల్మ్‌బీట్‌తో నవాజుద్దీన్ సిద్దిఖీ మాట్లాడుతూ..
సైంధవ్ సినిమాకు ముందు నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. రజనీకాంత్‌తో పేట మూవీలో నటించిన తర్వాత చాలా మంది నాకు కథలు చెప్పారు. కానీ స్క్రిప్టులు నచ్చకపోవడంతో నేను చేయలేదు. శైలేష్ కొలను చెప్పిన కథ నన్ను ఎక్సైట్ చేసింది. నా క్యారెక్టర్ చాలా డెప్త్‌తో ఉంటుంది. అలాగే నేను అభిమానించే నటుడు వెంకటేష్ సినిమా కావడంతో ఈ ఆఫర్‌ను కాదనలేకపోయాను అని నవాజుద్దీన్ సిద్దిఖీ చెప్పారు.

నాకు స్క్రిప్టు నచ్చితే అది విలన్ పాత్రనా? హీరో పాత్రనా? అనేది చూడను. నేను చేసే పాత్ర ఆసక్తికరంగా ఉందా? అనేది చూస్తాను. కొన్నిసార్లు పాజిటివ్ రోల్స్ కంటే నెగిటివ్ రోల్స్ బాగా పేరు, పాపులారిటిని తెచ్చిపెడుతాయి. ధర్శకుడు శైలేష్ కొలను నా కోసం మంచి పాత్రను డిజైన్ చేశారు. ఫెర్ఫార్మెన్స్ స్కోప్ క్యారెక్టర్ అని నవాజుద్దీన్ సిద్దిఖీ అన్నారు.

తొలిసారి తెలుగు సినిమాలో నటించాను. భాష కొన్నిసార్లు ప్రాబ్లెం అయింది. కానీ నేను క్షణ్ణంగా డైలాగ్స్ నేర్చుకొని నటించాను. నా పాత్రకు వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పడం ఇష్టం లేకపోవడంతో నేనే డబ్బింగ్ చెప్పాను. భాషను, భావాన్ని అర్ధం చేసుకొని చెప్పాను. ఈ పాత్ర పరంగా నేను హైదరాబాదీ హిందీ, తెలుగు కూడా మాట్లాడుతాను అని నవాజుద్దీన్ సిద్దిఖీ చెప్పారు.
కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ బయోపిక్‌లో నటించమని అడిగిన విషయం నిజమే. గొప్ప స్పూర్తిని ఇచ్చే నాయకుడు కేసీఆర్. ఆయన జీవిత కథ ఆధారంగా రూపొందించే సినిమా గురించి అడిగినప్పుడు నేను ఒకే చెప్పాను. కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఆ కారణాలు నాకు తెలియదు. కానీ ఎప్పుడైనా ఆ ప్రాజెక్ట్‌లో నటించడానికి సిద్దంగా ఉన్నాను అని నవాజుద్దీన్ సిద్దిఖీ అన్నారు.

ఏదైనా బయోపిక్‌లో నటించాలని ఎదురు చూస్తున్నాను. ఓషో జీవితం ఆధారంగా రూపొందించే సినిమాలో నటించాలని కోరుకొంటున్నాను. ఓషో బయోపిక్ చేయాలని ఎవరైనా అనుకొంటే నేను నటించడానికి సిద్దంగా ఉన్నాను. ప్రస్తుతం అదే డ్రీమ్ రోల్ అని నవాజుద్దీన్ సిద్దిఖి చెప్పారు.


Click it and Unblock the Notifications











