సూపర్‌స్టార్ల ఆఫర్లు డోంట్ కేర్.. అంటే సుందరానికి చిత్రంలో నాని కోసం నటించలేదు.. నజ్రియా నాజిం (ఇంటర్వ్యూ)

విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్, ఆయన భార్య నజ్రియా నాజిం ఇద్దరు ఒకేసారి తెలుగు సినిమా రంగంలో అడుగు పెట్టారు. పుష్ప ద్వారా ఫహద్, అంటే సుందరానికి చిత్రంతో నజ్రియా తెలుగు సినిమాల్లో నటించేందుకు అంగీకరించారు. అయితే అలా జరగడం యాదచ్చికం. మైత్రీ మూవీస్ అలా ప్లానింగ్ చేసింది. మొదట నేను తెలుగు సినిమా ఒప్పుకొన్నాను. ఆ తర్వాత ఫహద్ పుష్ప ప్రాజెక్టులోకి వచ్చారు అంటూ నజ్రియా ఓ ప్రశ్నకు సమాధానం చెప్పింది. జూన్ 10 తేదీన రిలీజ్ అవుతున్న అంటే సుందరానికి సినిమా ప్రమోషన్‌లో భాగంగా నజ్రియా నాజిం మీడియాతో మాట్లాడుతూ..

స్క్రిప్టును మాత్రమే నమ్ముతాను అంటూ

స్క్రిప్టును మాత్రమే నమ్ముతాను అంటూ

రాజా రాణి మూవీ తర్వాత మూవీ తర్వాత తెలుగు సినిమాల్లో నటించడానికి చాలా ఏళ్లు పట్టింది. అయితే అది ప్లాన్ ప్రకారం జరిగింది కాదు. ఏ భాషలోనైనా నటించడానికి నాకు ఇష్టమే. కానీ నాకు స్క్రిప్ట్‌ను మాత్రమే నమ్ముతాను. ఈ గ్యాప్‌లో చాలా సినిమా స్క్రిప్టులు విన్నాను. అయితే వివేక్ ఆత్రేయ చెప్పిన కథ విన్న వెంటనే నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఎక్కువ సేపు ఆలోచించకుండా నేను వెంటనే ఒప్పుకొన్నాను అని నజ్రియా నాజిం అన్నారు.

నా కమ్ బ్యాక్ మూవీ అంటే..

నా కమ్ బ్యాక్ మూవీ అంటే..

అంటే సుందరానికి మూవీ నాకు పర్‌ఫెక్ట్ కమ్ బ్యాక్ మూవీ అని నమ్ముతున్నాను. చాలా మంది చాలా స్క్రిప్టులు చెప్పి నటించమని ఆఫర్లు ఇచ్చారు. కానీ నేను ఎవరి ఆఫర్ ఒప్పుకోలేదు. అంటే సుందరానికి సినిమా స్క్రిప్టు నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకొన్నాను. నేను సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకొంటున్నాను. ఇక ముందు నేను ఇలాంటి గ్యాప్ రాకుండా జాగ్రత్త పడాలని అనుకొంటున్నాను అని నజ్రియా తెలిపారు.

సూపర్ స్టార్స్ ఆఫర్లు ఇచ్చినా నటించలేదు

సూపర్ స్టార్స్ ఆఫర్లు ఇచ్చినా నటించలేదు

చాలా మంది సూపర్ స్టార్స్, డైరెక్టర్లు ఆఫర్లు ఇచ్చినా నటించలేదు. అంటే సుందరానికి స్క్రిప్టు నచ్చే సినిమా చేశాను. కథ నచ్చితే సూపర్ స్టారా? కొత్త డైరెక్టరా అనే విషయాన్ని పట్టించుకోను. నేను నటించిన చాలా చిత్రాలకు కొత్త దర్శకులే ఉన్నారు. దర్శకుల విజన్, కమిట్‌మెంట్ నచ్చితే సినిమా చేస్తాను. ఈ సినిమా చేసే ముందు నేచురల్ స్టార్ నాని ఉన్నారని ఒప్పుకోలేదు. లీలా థాంప్సన్, సుందర్ పాత్రలను ఇష్టపడే సినిమా ఒప్పుకొన్నాను అని నజ్రియా చెప్పారు.

అంటే సుందరానికి సెట్లో..

అంటే సుందరానికి సెట్లో..

అంటే సుందరానికి సెట్లో నానితో పనిచేయడం ఫన్‌గా అనిపించింది. నేను ఫస్ట్ తెలుగు మూవీ చేస్తున్నాననే ఫీలింగ్ రాలేదు. సెట్లో అందరూ చాలా కోఆపరేట్ చేశారు. చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. నాని తాను చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. సెట్లో అతడి డెడికేషన్ నాకు చాలా నచ్చింది అని నజ్రియా చెప్పారు.

నాకు స్టార్ హీరోయిన్ కావాలనే కోరిక లేదు

నాకు స్టార్ హీరోయిన్ కావాలనే కోరిక లేదు

నాకు స్టార్ హీరోయిన్ కావాలనే కోరిక లేదు. నేను మంచి సినిమాల్లో భాగం కావాలని కోరుకొంటాను. అందుకే వరుసగా సినిమాలు చేయలేదు. పెళ్లి తర్వాత ట్రావెలింగ్ చేశాను. ఇంటి బాధ్యతలు చూసుకొన్నాను. నేను గ్యాప్ తీసుకోవడంపై నీవు స్క్రిప్టులు వినవా? అని ఫహద్ ఫాజిల్ అడిగేవారు. అలా నా కెరీర్‌లో నాలుగేళ్లు గ్యాప్ వచ్చింది అని నజ్రియా అన్నారు.

మంచి స్క్రిప్ట్ వస్తే ఫహద్‌తో కలిసి

మంచి స్క్రిప్ట్ వస్తే ఫహద్‌తో కలిసి

మంచి స్క్రిప్ట్ వస్తే.. ఫహద్ ఫాజిల్, నేను కలిసి నటించడానికి అభ్యంతరం లేదు. అయితే మేమిద్దరం ఇప్పుడు భార్య భర్తలం. మళ్లీ తెరపైన కూడా అలా నటిస్తే ప్రేక్షకులకు థ్రిల్ ఏముంటుంది. ఏదైనా డిఫరెంట్ స్క్రిప్ట్ ఉంటే నటించడానికి సిద్దం. విలన్ పాత్రల్లో కూడా నటించాడానికి నేను సిద్దమే అని నజ్రియా చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X