మా తల్లిదండ్రులు పుణ్యం చేసుకొన్నారేమో.. ఆ విషయంలో శ్రీదేవి గుర్తుకు వస్తుంది.. నేహా శెట్టి
డీజే టిల్లు చిత్రంలో రాధిక పాత్రతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న హీరోయిన్ నేహా శెట్టి వరుస విజయాలతో రాణిస్తున్నారు. డీజే టిల్లు, బెదురులంక సినిమాల తర్వాత ఆమె నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్. కిరణ్ అబ్బవరంతో కలిసి నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 6వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌లో భాగంగా నేహా శెట్టి ఫిల్మ్ బీట్‌తో మాట్లాడుతూ..
బెదురు లంక సినిమా తర్వాత రూల్స్ రంజన్ వస్తుండటంతో చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. డీజే టిల్లు తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. రాధిక క్యారెక్టర్‌కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఆ సినిమా తర్వాత ఇంకా సినిమా రాలేదని కంగారు పడిపోయాను. డీజే టిల్లు 2 సినిమాలో నేను లేకపోవడంతో ఫ్యాన్స్ నీవు లేవని అడగడంతో నాపై మరింత బాధ్యత పడింది. అయితే డీజే టిల్లు, బెదురులంక తర్వాత రూల్స్ రంజన్ వస్తుండటంతో హ్యాట్రిక్ వస్తుందా? లేదా? అనే టెన్షన్‌లో ఉన్నాను అని నేహా శెట్టి చెప్పింది

డీజే టిల్లు సినిమాలోని రాధిక క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎవరైనా అమ్మాయి స్వార్ధంతో కనిపిస్తే.. రాధిక అని ముద్ర వేస్తున్నారు. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్‌లో నేను కనిపించడం గొప్ప అదృష్టంగా భావిస్తాను. ఆ పాత్రకు అలాంటి పేరు రావడం మా అమ్మానాన్నలు చేసుకొన్న పుణ్యం. దేవుడి దీవెనలు కూడా ఉన్నాయని అనుకొంటాను. రాధిక పాత్రను నేను ఎప్పుడూ మరిచిపోను. రాధిక పాత్ర తర్వాత నేను నేహా అని కూడా మరిచిపోయాను అని నేహా శెట్టి చెప్పింది
వాన పాటల విషయానికి వస్తే, నాకు అలనాటి తార దివంగత శ్రీదేవి గుర్తుకు వస్తారు. నేను ఆమెకి పెద్ద అభిమానిని. చాలా చిన్న వయస్సులో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆమె, ఎలాంటి హద్దులు లేకుండా ఉన్నత స్థాయికి చేరారు. అలాంటి నటిగా పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. నా మొదటి పాటలో రెయిన్ సీక్వెన్స్ ఉండడం, ఆ పాటకి ఈ స్థాయి స్పందన లభిస్తుండటం చాలా ఆనందంగా ఉంది అని తెలిపింది.

నటుడిగా కిరణ్ అబ్బవరం చాలా కూల్. అతను సెట్స్‌లో వినయంగా, కామ్ గా ఉంటాడు. నేను మాత్రం పూర్తి వ్యతిరేకం. కెమెరా ముందు ఫ్రీగా ఉండాలని సెట్స్ లో సరదాగా మాట్లాడిస్తాను. దర్శకుడు, ఇతర నటీనటులతో కూడా అలాగే చేస్తాను. ఇక వెన్నెల కిషోర్ గారు సెట్స్ లో ఉండటం చాలా సరదాగా ఉంటుంది అని నేహా శెట్టి చెప్పింది.
నాపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ గురించి పట్టించుకొను. ప్రతీ ఒక్కరికి ఓ మైండ్ సెట్ ఉంటుంది. ప్రతీ ఒక్కరికి ఓ అభిప్రాయం ఉంటుంది. ప్రతీ ఒక్కరిని నేను పట్టించుకోలేను. ప్రతీ ఒక్కరి అభిప్రాయలను పరిగణనలోకి తీసుకోలేను. నాపై ట్రోల్ చేస్తున్న వారికి సమాధానం ఇవ్వలేను. అంతేకాకుండా వారి వారి అభిప్రాయలను నేను గౌరవిస్తాను అని నేహా శెట్టి చెప్పింది.

మా నిర్మాతలు దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి,రింకు కుక్రెజ హైదరాబాద్‌కు చెందిన వారే. కానీ వారు ఉత్తరాది నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఈ సినిమాలోని పాటల హిట్ అయిన తర్వాత చాలా ఎక్సైట్ అవుతున్నారు. ఆర్టిస్టులకు, టెక్నిషియన్స్‌కు చాలా స్వేచ్ఛను ఇస్తారు. షూటింగులో పెద్దగా జోక్యం చేసుకొన్నట్టు కనిపించదు. వాళ్లు పక్కా ప్రొఫెషనలిజంతో కనిపించారు అని నేహా శెట్టి తెలిపింది.


Click it and Unblock the Notifications











