DJ Tillu రాధిక పాత్రతో అలాంటి భయం వెంటాడింది..రూల్స్ రంజన్‌‌లో నా రోల్ అలా..హీరోయిన్ నేహా శెట్టి ఇంటర్వ్యూ

వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ హీరో కిరణ్ అబ్బవరం, డీజే టిల్లు సినిమాతో గ్లామర్ హీరోయిన్‌గా మారిన నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కుమారుడు రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 6వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నేహా శెట్టి మాట్లాడుతూ..

Star Heroine Neha Sshetty Interview about Radhika Character In DJ Tillu and Kiran Abbavarams Rules Ranjan movie

డీజే టిల్లు తర్వాత: డీజే టిల్లు సినిమా తర్వాత అనుకొన్న స్థాయికి చేరుకొన్నారా? అంటే ఇంకా లేదు. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. మీరు టాప్ హీరోయిన్ అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మెహబూబా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. ఆడిషన్ ఇచ్చి చాలా కష్టపడ్డాను. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆడకపోవడంతో నిరాశ పడ్డాను. ఆ తర్వాత న్యూయార్క్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌కు వెళ్లి యాక్టింగ్ కోర్సు చేశాను.

Neha Shetty DJ tillu

నా కెరీర్‌లో బిగ్ టర్న్ అలా: న్యూయార్క్‌లో యాక్టింగ్ పూర్తి చేసిన తర్వాత డీజే టిల్లు సినిమాలో రాధిక క్యారెక్టర్ వచ్చింది. చాలా ట్రిక్కీ క్యారెక్టర్. ఏదైనా అటు ఇటు అయితే.. నా కెరీర్ గందరగోళంలో పడుతుందనే భయం ఉండేది. కానీ డీజే టిల్లు సినిమా దర్శకుడు, హీరో చేసిన ఎఫర్ట్స్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. డీజే టిల్లు సినిమా తర్వాత నా కెరీర్ బిగ్ టర్న్ తీసుకొన్నది అని నేహా శెట్టి తెలిపింది.

Star Heroine Neha Sshetty Interview about Radhika Character In DJ Tillu and Kiran Abbavarams Rules Ranjan movie

రాధిక పాత్ర గురించి: డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రతో పోలిస్తే.. రూల్స్ రంజన్ సినిమాలోని సనా క్యారెక్టర్ చాలా డిఫరెంట్. వెరీ అవుట్ గోయింగ్.. డీజే టిల్లు సినిమాలో అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా తప్పా? ఒప్పా అని చూసే బోల్డ్ క్యారెక్టర్. స్వార్ధం ఉన్న అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. కానీ రూల్స్ రంజన్‌లో తిరుపతికి చెందిన సాధారణ యువతి పాత్రలో నటిస్తున్నాను అని నేహా శెట్టి చెప్పింది.

Star Heroine Neha Sshetty Interview about Radhika Character In DJ Tillu and Kiran Abbavarams Rules Ranjan movie

రూల్స్ రంజన్ సినిమాలో: రూల్స్ రంజన్ సినిమాలో సనా పాత్రలో కమర్షియల్ వ్యాల్యూస్‌తోపాటు గ్లామర్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్. తిరుపతి నుంచి బయటకు వచ్చి ఏదో సాధించాలని, అడ్వంచర్ చేయాలనే తపన ఉన్న క్యారెక్టర్. క్యూట్, బబ్లీ క్యారెక్టర్. సాన క్యారెక్టర్ మిమ్మల్ని ఆకట్టుకొంటున్నది అని నేహా శెట్టి చెప్పారు. రూల్స్ రంజన్ లాంటి అబ్బాయిలు నాకు తారసపడలేదు. కానీ అలాంటి లక్షణాలు మాత్రం మా దర్శకుడిలో ఉన్నాయి అని నేహా శెట్టి చెప్పారు.

Star Heroine Neha Sshetty Interview about Radhika Character In DJ Tillu and Kiran Abbavarams Rules Ranjan movie

అమ్రిష్ కంపోజ్ చేసిన పాట: మ్యూజిక్ డైరెక్టర్ అమ్రీష్ తన స్పీచ్‌తో ట్రెండింగ్‌లో నిలిచారు. ఆయన చాలా ఎనర్జిటిక్ అండ్ జోవియల్ పర్సన్. అమ్రీష్‌ను వ్యక్తిగతంగా కలువలేదు. ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కలిశాను. ఆయన మ్యూజిక్‌ను నేను ఫ్యాన్ అయ్యాను. నా కెరీర్‌లో బిగ్ హిట్ సాంగ్ ఇచ్చారు. అందుకు నేను రుణపడి ఉంటాను. సమ్మోహనుడా పాట నాకు మంచి పేరు తెచ్చింది. అన్ని పాటలు నాకు నచ్చాయి.మ్యూజిక్ డైరెక్టర్ అమ్రీష్ నన్ను చాలా పొగిడాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. నాకు ఫ్యాన్ బాయ్ మూమెంట్ కలిగింది అని నేహా శెట్టి తెలిపింది.

Star Heroine Neha Sshetty Interview about Radhika Character In DJ Tillu and Kiran Abbavarams Rules Ranjan movie

సమ్మోహనుడా పాట గురించి: రూల్స్ రంజన్ సినిమాలో నాకు ఛాలెంజ్ అనిపించినది సమ్మోహనుడా పాట. ఆ సినిమాలో పూలు, నీళ్లు, రకరకాల ప్యాటర్న్‌లో డ్యాన్స్ చేశాను. అది నాకు ఛాలెంజ్ కాదు కానీ.. మీరు అడిగారని నేను చెప్పాను. ఆ పాటలో నేను చాలా ఎంజాయ్ చేస్తూ నటించాను అని నేహా శెట్టి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X