For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లాక్‌డౌన్‌లో అలాంటి పనులు చేశా.. అదే మొదటిసారి అంటూ నిధి అగర్వాల్

  |

  లాక్‌డౌన్‌లో అందరి మాదిరిగానే గత నాలుగు నెలలుగా బ్యూటీ నిధి అగర్వాల్ ఇంటికే పరిమితమైంది. లాక్‌డౌన్ సమయంలో లైఫ్ స్టయిల్‌ను తెలియజేస్తూ.. నా ఫ్యామిలీతో కలిసి బెంగళూరులోనే ఉంటున్నాను. గృహ నిర్బంధంలో పాటించిన నిబంధనలు, ఫ్యామిలీతో కలిసి చేసిన సరదాలు, వ్యక్తిగత అనుభవాలను నిధి మీడియాకు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలనే సలహానిస్తూ... గత 100 రోజుల విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు మీకోసం..

  వ్యాక్సిన్ వస్తేనే కాలు బయటపెడుతా

  వ్యాక్సిన్ వస్తేనే కాలు బయటపెడుతా

  లాక్‌డౌన్ సమయంలో బయట కాలు పెట్టలేదు.. ఇక ముందు కూడా పెట్టను. వ్యాక్సిన్ వచ్చేంత వరకు నేను బయటకు రాను. లాక్‌డౌన్‌లో కేవలం నా పెంపుడు కుక్కలను తిప్పేందుకే బయటకు వచ్చాను. అప్పుడు కూడా మాస్క్, గ్లౌవ్స్, ముఖానికి షీల్డ్, శానిటైజర్‌తో బయటకు వచ్చేదానిని. మళ్లీ ఇంట్లోకి వెళ్లినప్పుడు వెంటనే బట్టలు మార్చుకొని స్నానం చేసేదానిని. నా పెంపుడు కుక్కలకు కూడా శానిటైజ్ చేసే దానిని అంటూ నిధి అగర్వాల్ చెప్పారు. గత నాలుగు నెలల్లో లాక్‌డౌన్‌లో చేసిన పనులను మీడియాకు తెలియజేస్తూ..

   ఇన్ని రోజులు ఇంట్లో ఉండటం

  ఇన్ని రోజులు ఇంట్లో ఉండటం

  నా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి నాకు తెలిసి ఒకట్రెండ్ రోజుల కంటే ఎక్కువగా ఇంట్లో ఉండలేదు. కానీ లాక్‌డౌన్ పుణ్యమా అని మూడు నెలలుగా ఫ్యామిలీతోనే ఉండే అవకాశం దక్కింది. నేను, నా సోదరి తన్వీ, పేరెంట్స్, నా పెంపుడు కుక్కులతో హౌస్‌ఫుల్ అయిపోయింది. ఇంట్లో వంటలు, ఇతర పనులు అంతా కలిసే చేస్తాం. గత మూడు నెలలుగ హ్యాపీగా గడిచిపోయింది అని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.

  ఫ్యాషన్, డిజైనర్ డ్రెస్సెస్ గురించి

  ఫ్యాషన్, డిజైనర్ డ్రెస్సెస్ గురించి

  ఇక ఫ్యాషన్, డిజైనర్ బట్టలు అనే విషయాన్ని లాక్‌డౌన్‌లో పూర్తిగా మరిచిపోయాను. నా జీవితంలో ఎప్పడూ లేని విధంగా ఇన్ని రోజులు కేవలం పైజామాలు వేసుకోవడం ఇదే మొదటిసారి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడం, పార్టీలకు దూరంగా ఉండటం మూలాన దుస్తులు కొనడం జరగలేదు అని నిధి చెప్పారు.

  హెల్త్ టిప్స్ చెబుతూ..

  హెల్త్ టిప్స్ చెబుతూ..

  కరోనా పరిస్థితుల కారణంగా ఆరోగ్యంపై చాలా జాగ్రత్త తీసుకొన్నాను. బట్టలు, ఆహారం విషయంలో ఎక్కువ కేర్ తీసుకొన్నారు. ముంబై నుంచి కూడా ఎక్కువగా దుస్తులు తీసుకురాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో జీన్స్ వేసుకోవడం కూడా మంచిది కాదనిపించింది. బయట ఫుడ్ పూర్తిగా మానేశాను. కేవలం ఇంట్లో వండిన ఆహారమే తీసుకొన్నాను అని నిధి అగర్వాల్ అన్నారు.

  ఆన్‌లైన్‌లో యాక్టింగ్ కోర్సులతో

  ఆన్‌లైన్‌లో యాక్టింగ్ కోర్సులతో

  గత మూడునెలల కాలంలో నా వద్ద చాలా సమయం ఉండటంతో సద్వినియోగం చేసుకోవాలని అనుకొన్నాను. దాంతో నా యాక్టింగ్స్‌ స్కిల్స్‌కు పదనుపెట్టాను. ఆన్‌లైన్‌లో కొన్ని కోర్సుల్లో చేరి యాక్టింగ్, డ్యాన్స్ నేర్చుకొన్నాను. కొన్ని టెక్నికల్ విషయాలు కూడా నేర్చకొన్నాను. ఆన్‌లైన్ కోర్సుల ద్వారా చాలా విషయాలు తెలుసుకొన్నాను అని నిధి అగర్వాల్ తెలిపారు.

  Nidhi Agarwal Purchased Grand New Porsche Macan
  నిధి అగర్వాల్ కెరీర్ గురించి

  నిధి అగర్వాల్ కెరీర్ గురించి

  ఇక నిధి అగర్వాల్ కెరీర్ విషయానికి వస్తే.. మున్నా మైఖేల్ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్యతో సవ్యసాచి చిత్రంలో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం భూమి అనే తమిళ చిత్రంలోపాటు యువ హీరో అశోక్ గల్లా సినిమాలోనూ, జేమ్స్ అనే కన్నడ చిత్రంలోను నటిస్తున్నారు.

  English summary
  Actress Nidhhi Agerwal spent quality life with her family and pets in lockdown. She revealed her life style during the corona crisis. Nidhhi said I spent four months in Banglore only. I learned acting, Dancing courses online.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X