Nidhhi Agerwal మిని స్కర్ట్‌లో అదరగొట్టిన అందాల నిధి.. పసుపు పచ్చ డ్రెస్‌లో గ్లామర్ ట్రీట్

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి అగర్వాల్ తన కెరీర్ గ్రాఫ్ పెంచుకొన్నారు. ప్రస్తుతం యువ హీరోలతోపాటు సీనియర్ హీరోలతో జతకడుతూ క్రేజ్‌ను సంపాదించుకొన్నారు. తాజాగా తెలుగు సినిమాకు పరిచయం అవుతున్న గల్లా అశోక్‌తో కలిసి హీరో చిత్రంలో నటించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగకు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరో సినిమా గురించి మాట్లాడేందుకు మీడియాతో కలిశారు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్లీ డాక్టర్ పాత్ర

ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్లీ డాక్టర్ పాత్ర

హీరో సినిమా కోసం ఆడిషన్స్ రావాలని దర్శకుడు శ్రీరాం ఆదిత్య కాల్ చేశారు. అంతకుముందే ఈ సినిమా స్క్రిప్టు బాగుందనే విషయం గురించి విన్నాను. స్టోరి కొంత ఆఫ్ బీట్ ఉన్నప్పటికీ.. సాంగ్స్ చాలా కమర్షియల్‌గా ఉంటాయి. పెద్ద హీరోలతో నటించినప్పటికీ.. స్టోరి బాగుండటంతో ఒప్పుకొన్నాను. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరితో నటించాలనేది నా నిర్ణయం. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈ సినిమాలో నేను డాక్టర్ పాత్రను పోషించాను. నా క్యారెక్టర్ పేరు సుబ్బు. నాకు తండ్రిగా జగపతిబాబు నటించాడు. ఈ చిత్రంలోని ఫ్యామిలీ డ్రామా అందర్నీ ఆకట్టుకొంటుంది అని నిధి అగర్వాల్ తెలిపారు.

గల్లా అశోక్ టాలెంట్ గురించి

గల్లా అశోక్ టాలెంట్ గురించి

హీరో చిత్రం ద్వారా అశోక్ గల్లా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. మా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. సినిమా చూసిన తర్వాత ఎలా ఉందో ప్రేక్షకుల చెప్పాలి. ప్రేక్షకుల తీర్పు కోసం వేచి చూస్తున్నాం. అశోక్ కొత్తవాడైనప్పటికి.. బాగా ప్రిపేర్ అయి వచ్చారు. అతడికి కంఫర్ట్ ఉండేలా నా వైపు నుంచి సహకారం అందించాను. ఎందుకంటే కొత్తగా కెమెరా ముందుకు వచ్చిన పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు అని నిధి అగర్వాల్ అన్నారు.

గ్యాప్ అందుకే వచ్చిందంటూ..

గ్యాప్ అందుకే వచ్చిందంటూ..

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత టాలీవుడ్‌లో గ్యాప్ వచ్చింది. అందుకు కారణం అందరికి తెలుసు. కోవిడ్ వల్ల నేను ఏమీ చేయలేకపోయాను. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు చేశాను. అవి రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అందుకే చాలా గ్యాప్ వచ్చింది. నాకు ప్రొఫెషనల్‌గా ఎలాంటి పరిమితులు లేవు. అశోక్‌తో సినిమా చేసిన తర్వాత పవన్ కల్యాణ్‌తో సినిమా చేయడానికి అంగీకరించాను అని నిధి అగర్వాల్ చెప్పారు.

హీరో కథ డిఫరెంట్‌గా

హీరో కథ డిఫరెంట్‌గా

దర్శకుడు శ్రీరాం ఆదిత్య కథ చెప్పినప్పుడు డిఫరెంట్‌గా ఉంటుందని భావించాను. సినిమాలో డార్క్ కామెడీ ఉంటుంది. సాంగ్స్ కమర్షియల్‌గా ఉంటాయి. కథలో విలన్లు, పగ ప్రతీకారాలు ఉండవు. ప్రతీ ఒక్కరు ఎంజాయ్ చేసే సినిమాగా, ఫ్యామిలీ మొత్తం చూసే విధంగా ఎమోషనల్‌గా ఉంటుంది. రెండు ఫ్యామిలీ మధ్య ఒక చిన్న ట్విస్టు బాగుంటుంది. షూటింగు సమయంలో నేను బాగా ఎంజాయ్ చేశాను అని నిధి అగర్వాల్ తెలిపారు.

భవిష్యత్ ప్లాన్స్ వేసుకోను..

భవిష్యత్ ప్లాన్స్ వేసుకోను..

నాకు భవిష్యత్‌లో నా కెరీర్ ఎలా ఉండాలనే విషయం గురించి ప్లాన్ చేసుకోలేదు. ప్రతీ రోజు నేను షూటింగ్‌కు వెళ్లాలి. సెట్లో ఉండి నటించాలి. నా చేసిన పాత్రలకు నాకు మంచి పేరు తేవాలని ఆలోచిస్తానే తప్ప.. ఫ్యూచర్ ప్లాన్స్ తక్కువే. భవిష్యత్‌లో నేను బిజినెస్‌లోకి ఎంట్రీ కావాలని అనుకొంటున్నాను. ఇప్పటికే నా ఫ్యామిలీ బిజినెస్‌లో ఉంది కాబట్టి. ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను. అలాగే సామాజిక, స్వచ్ఛంద సేవలో ఉండాలని అనుకొంటున్నాను.

గ్లామర్ హీరోయిన్ ట్యాగ్ రావడం

గ్లామర్ హీరోయిన్ ట్యాగ్ రావడం

నా కమర్షియల్, గ్లామర్ హీరోయిన్ అనే ట్యాగ్ లవ్ అంటే హేట్ రిలేషన్ లా ఉంటుంది. గ్లామర్ హీరోయిన్ అనే ట్యాగ్‌ ఇవ్వడాన్ని ఎంజాయ్ చేస్తాను. అది ఒక క్రెడిట్‌గా భావిస్తాను. రెడ్ సినిమా డైరెక్టర్ రూపొందించే ఓ తమిళ సినిమా చేస్తున్నాను. అందులో నేను మేకప్ లేకుండా కనిపిస్తాను. ఫెర్పార్మెన్స్‌కు స్కోప్ ఉండే పాత్రలో నటిస్తున్నాను. తెలుగులో కూడా నాకు అలాంటి పాత్రను ఇచ్చే డైరెక్టర్ కోసం వేచి చూస్తున్నాను అని నిధి అగర్వాల్ చెప్పారు.

హాట్ హాట్‌గా మిని స్కర్ట్‌లో నిధి అందాలు

హాట్ హాట్‌గా మిని స్కర్ట్‌లో నిధి అందాలు

ఇక హీరో సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన నిధి అగర్వాల్ హాట్ హాట్‌గా కనిపించారు. పసుపు పచ్చ రంగులోని మిని స్కర్ట్‌ను ధరించి అందాలను ఆరబోశారు. మిని స్కర్ట్‌లో క్లీవేజ్ షోతో అదరగొట్టారు. ప్రస్తుతం నిధి అగర్వాల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇస్మార్ట్ బ్యూటి అందాల నిధి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X