నాన్న.. నిన్ను చంపేస్తాను.. నాగబాబుకు నిహారిక స్వీట్ వార్నింగ్!
మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన నిహారిక కొణిదెల విభిన్నమైన పాత్రలతో అలరిస్తున్నారు. తాజాగా ఆమె నటించిన హ్యాపీ వెడ్డింగ్ చిత్రం విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో మీడియాతో నిహారిక మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యక్తిగత, ప్రొఫెషనల్ సినిమా విశేషాలను వెల్లడించారు. సైరాలో తన పాత్ర గురించి కూడా క్లుప్తంగా వివరించారు.

హ్యాపీ వెడ్డింగ్ ఫ్యామిలీ మూవీ
హ్యాపీ వెడ్డింగ్ చిత్రంలో నా పాత్ర పేరు అక్షర. చాలా సాదాసీదా అమ్మాయి. సినిమా ఆరంభమే ఎంగేజ్‌మెంట్‌తో ప్రారంభమవుతుంది. పెళ్లి వరకు జరిగే కార్యక్రమాల్లో సంఘటనలు చోటుచేసుకొంటాయి. మా చిత్రంలో విలన్ లేడు. నెగిటివ్ కార్యెక్టర్ లేదు. నా క్యారెక్టర్ వల్లనే సినిమా మలుపు తిరుగుతుంది. సమస్యలు కూడా నాతోనే వస్తాయి.

హీరో ఎవరన్నది చూడను
ఇప్పటి వరకు నేను ఓకే చేసిన సినిమాల్లో హీరో ఎవరన్నది నేను పెద్దగా పట్టించుకోను. కథ, నా పాత్ర ఏంటనే విషయంపై దృష్టిపెడుతాను. నేను ఎక్కువ కాలం సినిమాలు చేయను. నా కుటుంబ పరిస్థితుల కారణంగా ఓ ఐదారు సంవత్సరాలు మాత్రమే ఉంటాను.

కర్తవ్యం లాంటి సినిమాలు
కర్తవ్యం లాంటి సినిమాలు చేయాలని ఉంది. ఇటీవల పరుచూరి గారితో చర్చ జరిగింది. మీరు అలాంటి కథ రాస్తే నేను నటించడానికి నేను రెడీ అని చెప్పాను. ఒకవేళ పరుచూరి గారి రాస్తే అలాంటి చిత్రంలో నటించడానికి నేను సిద్దమే.

నాన్నకు సీరియస్‌గా వార్నింగ్
హ్యాపీ వెడ్డింగ్ చిత్రంలో మురళీ శర్మది చాలా కీలకమైన పాత్ర. ఆయనతో నటించేటప్పుడు మా నాన్న గుర్తొచ్చే వారు. వెంటనే నాన్నకు ఫోన్ చేసి.. నాన్న నిన్ను చంపేస్తాను. ప్రతీ సీన్‌లో నువ్వే గుర్తొస్తున్నావు అని చెప్పాను. ఈ చిత్రంలో పాత్రలు ప్రేక్షకులకు చాలా కనెక్ట్ అవుతాయి.

చిరంజీవితో నటించాలన్నదే
చిరంజీవితో సైరా చిత్రంలో నటిస్తున్నాను. డాడీ (చిరంజీవి)తో నటించాలన్నది, ఆయనతో ఒక్క సీన్‌లో నైనా కనిపించాలన్నది నా కోరిక. ఖైదీ నంబర్ 150లో అవకాశం ఇవ్వమని చరణ్ అడిగాను. కానీ అందులో సరైన పాత్ర లేకపోవడం వల్ల కుదర్లేదు. ఈసారి సైరాలో కుదిరింది. నా వికీ పేజీలో సైరా ఉంటే జీవితం ధన్యమైనట్టే అని చెప్పారు.


Click it and Unblock the Notifications











