twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను ఆటైపు కాదు, విజయ్ దేవరకొండ అందుకే అలా, నాన్నకోసం ప్రచారం చేస్తా: నిహారిక

    |

    నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో న‌టించిన ' సూర్యకాంతం' మార్చి 29 న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. నిర్వాణ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వరుణ్ తేజ్ సమర్పణలో రిలీజ్ కాబోతోంది. ప్రణీత్

    సినిమా ప్రమోషన్లో భాగంగా నిహారిక మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తమ ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వాటికి నిహారిక ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

    నేను ఆ టైపు కాదు...

    నేను ఆ టైపు కాదు...

    సినిమా రంగంలో జయాపజయాలు అనేవి సర్వసాధారణం. ఆడితే ఎగిరిగంతేయడం, ఆడ‌క‌పోతే బాధపడే టైపు నేను కాదు. నా పాత్రకు నేను న్యాయం చేశానా? లేదా? అనేదే నాకు ముఖ్యం. నేను ఏది చేసినా మ‌న‌స్పూర్తిగా, పర్ఫెక్టుగా చేస్తానని.. నిహారిక తెలిపారు.

    సురేఖ మమ్మీ బాధపడేది, చిరంజీవి డాడీ కష్టాన్ని చూస్తూ పెరిగాను

    సురేఖ మమ్మీ బాధపడేది, చిరంజీవి డాడీ కష్టాన్ని చూస్తూ పెరిగాను

    నేను ఏ సినిమా చేసినా నా మ‌న‌సులో చిరంజీవి డాడీ ఉంటారు. డూపులు కూడా లేకుండా ఆయ‌న ఫైట్లు చేసి ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు సురేఖా మ‌మ్మీ ప‌డ్డ బాధ ఎలా ఉండేదో నాకు తెలుసు. అయినా కొన్ని సినిమాలు ఆడ‌లేదు. సినిమా పరాజయాలకు ఎన్నో కారణాలు ఉంటాయని నిహారిక స్పష్టం చేశారు.

    నిర్మాణ రంగం మీద ఆసక్తి ఉంది

    నిర్మాణ రంగం మీద ఆసక్తి ఉంది

    సినిమా నిర్మాణ రంగం మీద ఆసక్తి ఉంది. మా నాన్న‌, అర‌వింద్ మామయ్య నిర్మాతలు కావడం, వారిని చూస్తూ పెరగడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ స్థాపించి డిజిటల్ ప్లాట్‌ఫాం కోసం కొన్ని వెబ్ సిరీస్ నిర్మిస్తున్నాను. సినిమాలు నిర్మిస్తానా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేను... అని నిహారిక తెలిపారు.

    30 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోవా అంటూ అమ్మ తిట్టింది

    30 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోవా అంటూ అమ్మ తిట్టింది

    ఇటీవల ఇంటర్వ్యూల్లో నా పెళ్లి ఎప్పుడు అంటే 30 ఏళ్ల లోపు చేసుకుంటాను అని చెప్పాను. ఈ మాట మా అమ్మకు తెలిసి 30 ఏళ్ల వరకు చేసుకోవా అంటూ తిట్టింది. ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించడం లేదు. సినిమాల మీదే ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.

    విజయ్ దేవరకొండ అందుకే అలా అన్నారు

    విజయ్ దేవరకొండ అందుకే అలా అన్నారు

    నాకు, విజయ్ దేవరకొండకు పెళ్లి అంటూ రూమర్స్ రావడంతో వాటికి చెక్ పెట్టడానికి.... ఇటీవల ‘సూర్యకాంతం' ఫంక్షన్లో నాకు అన్నలాగా వచ్చినట్లు ప్రకటించారు... అని ఓ ప్రశ్నకు నిహారిక సమాధానం ఇచ్చారు.

    నాన్న కోసం ప్రచారం చేస్తాను

    నాన్న కోసం ప్రచారం చేస్తాను

    జనసేన పార్టీ తరుపున మీ నాన్నగారి కోసం ప్రచారం చేస్తారా? అనే ప్రశ్నకు నిహారిక స్పందిస్తూ... నా సినిమా విడుద‌ల‌య్యాక త‌ప్ప‌కుండా వెళ్లి ప్ర‌చారం చేస్తా. ప్రచారానికి వెళ్లే ముందు బాగా ప్రిపేర్ అవుతానని తెలిపారు.

    మా వాళ్లను తిడుతుంటే తట్టుకోలేను

    మా వాళ్లను తిడుతుంటే తట్టుకోలేను

    ఎన్నికల ప్రచారంలో మా వాళ్లను తిడుతున్న విషయం నాదృష్టికి వచ్చింది. ఆ వీడియోలు నేను చూడను. ప్రజా క్షేత్రంలో ఉన్నపుడు ఇవన్నీ సర్వసాధారణమే. నా మనస్తత్వం ఎలాంటిదంటే నన్ను ఎవరైనా ఏమైనా అంటే పెద్దగా పట్టించుకోను, కానీ మా వాళ్లను అంటే కోపం వస్తుందని నిహారిక తెలిపారు.

    English summary
    "I will campaign for my dad after Suryakantham release." Niharika Konidela said in recent interview.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X