twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంట్లోకి రావొద్దన్న అమ్మ.. అలా ఎప్పుడు కాలేదు.. సగం రెమ్యూనరేషనే.. నిఖిల్ కామెంట్స్

    |

    హ్యాపీ డేస్ చిత్రంతో అందరికీ దగ్గరైన హీరో నిఖిల్. ఆపై కొన్ని సినిమాలు చేసినా మళ్లీ ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి వరుస విజయాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. నిఖిల్ ఓ సినిమా చేస్తున్నాడంటే.. ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్నాడనే నమ్మకాన్ని కలిగించాడు. అయితే మధ్యలో కేశవ, కిరాక్ పార్టీ చిత్రాలతో నిరాశ పరిచాడు. పలు మార్లు వాయిదా పడుతూ వస్తోన్న అర్జున్ సురవరం ఎట్టకేలకు రేపు (నవంబర్ 29) విడుదల కాబోతోన్న సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు.

    ఇదే చివరి రీమక్..

    ఇదే చివరి రీమక్..

    తన కెరీర్‌లో అర్జున్ సురవరం అనేదే చివరి రీమేక్ అని చెప్పేశాడు. ఇక తాను రీమేక్స్ చేయబోనని స్పష్టం చేశాడు. తన వద్దకు చాలా రీమేక్స్ వస్తున్నాయని, అయితే చేయనని చెబుతున్నట్లు పేర్కొన్నాడు. ఈ సినిమాలోని పాయింట్ నచ్చడంతో ఇక్కడి వారికి చెప్పాలనే ఉద్దేశ్యంతో రీమేక్ చేశానని తెలిపాడు. అయితే ఫ్రాంచైజీలా సీక్వెల్స్ చేస్తానని ఇప్పుడు కార్తికేయ-2 చేస్తున్నానని తెలిపాడు.

    అలా ఎప్పుడు కాలేదు..

    అలా ఎప్పుడు కాలేదు..

    కెరీర్‌లో ఇప్పటి వరకు 17 సినిమాలు చేశానని, అయితే ఏ సినిమాకు ఇలా కాలేదని, వాయిదాలు పడుతూ వస్తూనే ఉందని తెలిపాడు. ఇలా జరగడంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని తన భాదను వివరించాడు. మే 1న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఇప్పటికీ విడుదల అవుతోందని, అసలు ఈ చిత్రం విడుదల అవుతుందా? అని ఎన్నో సార్లు భయపడ్డానని అన్నాడు.

    అలా రానాతో మిస్..

    అలా రానాతో మిస్..

    రానాతో ఓ సినిమా చేసే అవకాశాన్ని మిస్ అయ్యానని అన్నాడు. హీథీ మేరీ సాథీ చిత్రం చేయమని అడిగాడని అయితే డేట్స్ కుదరకపోవడంతో చేయలేకపోయానని అన్నాడు. తనకు జంతువులంటే ఎంతో ఇష్టమని, ఆ మూవీ చేయాలనుకున్నాను కానీ మిస్ అయ్యానని చెప్పుకొచ్చాడు.

    సగం రెమ్యూనరేషన్..

    సగం రెమ్యూనరేషన్..

    పలుమార్లు వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రానికి తనకు చేతనైన సహాయాన్ని చేశానని అన్నారు. రెమ్యూనరేషన్‌లో సగమే తీసుకున్నానని, అసలు అడగడమే వదిలేశానని అన్నాడు. సినిమా హిట్ అయిన నిర్మాతకు లాభాలు వస్తే తీసుకుంటానని తెలిపాడు.

    ఇంట్లోకి రావొద్దన్న అమ్మ..

    ఇంట్లోకి రావొద్దన్న అమ్మ..

    కుటుంబంతో కలిసి చిత్రాలే చేయమని అమ్మ చెప్పిందని, అలా చేయకపోతే ఇంట్లోకి రావొద్దని అంది అంటూ.. ఈ చిత్రం ఫ్యామిలీతో కూర్చొని చూసే చిత్రమేనని చెప్పుకొచ్చాడు. ఒక స్టూడెంట్ లైఫ్ స్పాయిల్ అయితే అతని అమ్మ, నాన్న కుటుంబం కూడా బాధ పడుతుందని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉంటుందని, అందరూ కలిసి చూసే చిత్రమని అన్నాడు.

    మూడు చిత్రాలతో బిజీ..

    మూడు చిత్రాలతో బిజీ..

    కార్తికేయ-2 షూటింగ్ డిసెంబర్ 20 నుంచి స్టార్ట్ అవుతుందని పేర్కొన్నాడు. నవంబర్ లోనే స్టార్ట్ అవ్వాలని అయితే అర్జున్ సురవరం ప్రమోషన్స్ కోసం వాటిని కొంచెం ముందుకు జరిపామని తెలిపాడు. కార్తికేయ-2తో పాటు మిగతా 2 సినిమాలు కూడా లైన్లో ఉన్నాయని, శ్వాస చిత్రం ఆగిపోయిందని, ఆ నిర్మాతతో మరో చిత్రం చేస్తున్నానని, గీతా ఆర్ట్స్‌లో మరో సినిమా చేస్తున్నానని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకొచ్చాడు.

    English summary
    Nikhil Siddharth Interaction With Media About ARjun Suravaram. Nikhil Siddharths Arjun Suravaram Movie Going To relesae On 29th November. Lavanya Tripati Acts As Female Lead And T Santhosh directing Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X