ఫ్రస్టేషన్‌లో హీరో నిఖిల్.. మరోసారి పెళ్లి వాయిదా.. నిరాశలోకి యువ హీరో

కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా పెళ్లి కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. పరిస్థితులను నివారించలేని కారణంగా కొన్ని పెళ్లిళ్లు నిరాడంబరంగా జరిగిపోతున్నాయి. అయితే పెళ్లి చేసుకొందామనుకొన్న టాలీవుడ్‌ యువ హీరోల ఆశలపై కరోనా నీళ్లు జల్లుతూనే ఉంది. తాజాగా మరోసారి హీరో నిఖిల్ నిరాశకు లోనయ్యారు. లాక్‌డౌన్ పొడిగించడంతో ఆయన పెళ్లి మరోసారి వాయిదా పడింది. ఈ క్రమంలో నిఖిల్ మాట్లాడుతూ..

ప్రియురాలితో పెళ్లి నిర్ణయం

ప్రియురాలితో పెళ్లి నిర్ణయం

యంగ్ హీరో నిఖిల్ కొద్దికాలంగా డాక్టర్ పల్లవి వర్మతో ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల అంగీకారం తెలుపడంతో ఫిబ్రవరి 3వ తేదీన ఘనంగా పెళ్లి నిశ్చితార్థం జిరిగింది. ఆ తర్వాత మే 14 తేదీన పెళ్లికి ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. అయితే అంతా సవ్యంగా జరుగుతుందని భావిస్తున్న సమయంలో కరోనావైరస్ ప్రమాదం ముంచుకొచ్చింది. దాంతో ఏప్రిల్ 16న జరుగాల్సిన పెళ్లి వాయిదా పడింది.

తొలుత ఏప్రిల్ 16వ తేదీన

తొలుత ఏప్రిల్ 16వ తేదీన

కరోనా ముప్పు నేపథ్యంలో ఏప్రిల్ 16 తేదీన జరిగే పెళ్లిని వాయిదా వేయాలని అనుకొన్నాం. ఎందుకంటే మా పెళ్లికి నెల రోజుల ముందే లాక్‌డౌన్ ప్రకటించారు. దాంతో పరిస్థితులు చక్కబడ్డ తర్వాత పెళ్లి కార్యక్రమం పెట్టుకొందామని ఇరు కుటుంబాలు భావించాయి. అలా మంచి రోజులు, సానుకూల పరిస్థితి కోసం వేచి చూశాం అని నిఖిల్ తెలిపారు.

ఆ తర్వాత మే 14వ తేదీన

ఆ తర్వాత మే 14వ తేదీన

కరోనా లాక్‌డౌన్ సడలింపు వార్తల నేపథ్యంలో మళ్లీ పెళ్లి తేదిని మే 14న నిర్ణయించాం. అయితే మళ్లీ మే 17 తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఇలా నా పెళ్లి వాయిదాల మీద వాయిదా పడటం చాలా ఫ్రస్టేషన్‌గా మారింది. ఈ వ్యవహారం చాలా చికాకు అనిపిస్తున్నది అంటూ నిఖిల్ నిరాశకు లోనయ్యారు.

పెళ్లి ముహుర్తాలు పెట్టుకోం

పెళ్లి ముహుర్తాలు పెట్టుకోం

ఇక పెళ్లి ముహుర్తాలు పెట్టుకోకుడదని అనుకొన్నాం. ఎందుకంటే కుటుంబ సభ్యులంతా నిరాశకు గురవుతున్నారు. ఇంట్లో శుభకార్య అనే మూడ్ రోజు రోజుకు పోతున్నది. ఇది నాకు చాలా కష్టంగా ఉంది. ఈ లాక్‌డౌన్ కారణంగా నేను నేనుగా ఉండలేకపోతున్నాను. కానీ మరోపక్క ఇలాంటి పరిస్థితులను ఎదురిస్తున్న ప్రజలను చూస్తుంటే నా సమస్య పెద్దది కాదనిపిస్తున్నది అని నిఖిల్ తెలిపారు.

Recommended Video

Nikhil Siddharth About His Honeymoon
కరోనాపై విజయం తర్వాతే

కరోనాపై విజయం తర్వాతే

పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన, మధురమైన ఘట్టం. ఆ ఫీలింగ్ కోసం ఎదురుచూస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం అంత మంచిది కాదనే భావనతో సరిపెట్టుకొంటున్నాను. బయట నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమస్యను అర్ధం చేసుకొంటున్నాను. కరోనాపై విజయం సాధించిన తర్వాతనే నా పెళ్లిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకొంటాను అని నిఖిల్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X