twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్‌ను ఎన్నడూ వాడుకోలేదు.. త్రివిక్రమ్ అందుకే రాలేదు.. నితిన్

    By Rajababu
    |

    టాలీవుడ్‌లో యువతరం హీరోల్లో నితిన్ ఒకరు. 16 ఏళ్ల క్రితం తేజ దర్శకత్వంలో జయం సినిమాతో ఆరంభమైన నితిన్ కెరీర్ అనేక ఒడిదుడుకులకు లోనైంది. అయినా ఫ్లాప్‌లను ఎదుర్కొని నిలబడ్డారు. ఇష్క్ సినిమాతో ప్రారంభమైన ఆయన సక్సెస్ యాత్ర.. గుండె జారి గల్లంతయ్యింది.

    Recommended Video

    Nitin Emotional Speech About Pawan Kalyan & Trivikram

    హార్ట్ ఎటాక్ చిత్రాలతో కొనసాగుతున్నది. సక్సెస్, ఫ్లాప్‌లతోపాటు దూసుకెళ్తున్న నితిన్ బర్త్ డే మార్చి 30. ఆయన నటించిన ఛల్ మోహన రంగ సినిమా ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో నితిన్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. నితిన్ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

     టాలీవుడ్‌లో 16 ఏళ్లు

    టాలీవుడ్‌లో 16 ఏళ్లు

    సినీ పరిశ్రమకు వచ్చి 16 ఏళ్లు అయిపోయింది. ఫిబ్రవరి 22, 2002 రోజున నా తొలి సినిమా ముహుర్తం షాట్ జరిగింది. 16 ఏళ్లలో దాదాపు 25 సినిమాలు చేశాను. వాస్తవానికి అ ఆ సినిమా తర్వాత ఛల్ మోహనరంగ సినిమా చేయాల్సింది. అ ఆ, లై సినిమా తర్వాత మళ్లీ రొమాంటిక్ కామెడీ చేయడంలో ఎలాంటి ప్లాన్ లేదు. త్రివిక్రమ్ చెప్పిన లైన్ తీసుకొని చైతన్య దాదాపు ఎనిమిది నెలలు పనిచేసి పూర్తిస్థాయి స్క్రిప్టు రూపొందించారు. త్రివిక్రమ్ సూచన మేరకు చైతన్య డైరెక్షన్ చేశాడు.

     త్రివిక్రమ్ ఎందుకు రాలేదంటే..

    త్రివిక్రమ్ ఎందుకు రాలేదంటే..

    ఛల్ మోహన రంగ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరుకాకపోవడం వెనుక మరోరకమైన కారణాలు లేవు. త్రివిక్రమ్ ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల హాజరుకాలేదు. నేను పలుమార్లు రమ్మని అడిగాను. కానీ జ్వరం కారణంగా ప్రీరిలీజ్‌కు హాజరుకాలేదు.

    ఛల్ మోహన రంగ చిత్రం గురించి

    ఛల్ మోహన రంగ చిత్రం గురించి

    ఛల్ మోహన్ రంగ చిత్రమంతా తొలిభాగం అమెరికాలో జరుగుతుంది. రెండో భాగంలో కథ ఊటి, కూర్గ్‌ ప్రాంతాల్లో సాగుతుంది. ఇందులో నా పాత్ర చాలా ఫన్నీగా ఉంటుంది. గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలో నేను కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్ చేశాను. ప్రస్తుతం ఈ సినిమాలోని నా పాత్ర ఆ సినిమాకు మించి ఉంటుంది. చివరి 30 నిమిషాలు సినిమా అద్భుతంగా ఉంటుంది. ఎమోషనల్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండే సినిమా ఇది.

    పెద్దపులి పాటకు మంచి రెస్పాన్స్

    పెద్దపులి పాటకు మంచి రెస్పాన్స్

    ఛల్ మోహనరంగ చిత్రంలో హీరో అమెరికాకు వెళ్లాలని మూడుసార్లు ప్రయత్నిస్తారు. రెండుసార్లు వీసా రిజెక్ట్ అవుతుంది. మూడోసారి వీసా అప్రూవ్ అవుతుంది. ఆ సమయంలో పెద్దపులి పాట వస్తుంది. ఆడియో ఆల్బమ్‌లో ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పాట పెట్టాలన్న ఐడియా డైరెక్టర్‌ది.

     ఛల్ మోహనరంగ సినిమాలో

    ఛల్ మోహనరంగ సినిమాలో

    మోహనరంగా అనేది సినిమాలో నా పాత్ర పేరు. జాబ్ కోసం హీరో అమెరికాకు వెళ్తాడు. డబ్బు సంపాదించి జీవితంలో సెటిల్ కావాలనుకొంటాడు. కొన్ని కారణాల వల్ల హీరో మళ్లీ వెనక్కు తిరిగివస్తాడు. అలా ఎందుకు తిరిగి వచ్చాడనేది సినిమా కథ.

    నిర్మాతగా పవన్ కల్యాణ్

    నిర్మాతగా పవన్ కల్యాణ్

    ఛల్ మోహనరంగ సినిమాకు పవన్ కల్యాణ్ నిర్మాతగా మారడం చాలా గమ్మత్తుగా జరిగిపోయింది. ఈ సినిమా ప్రారంభించడానికి ముందు పవన్ కల్యాణ్‌ను త్రివిక్రమ్, నేను కలిశాం. ఈ సినిమా గురించి చెప్పగానే ఈ ప్రాజెక్ట్‌లో నేను నిర్మాతగా ఎందుకు ఉండకూడదు అని అన్నారు. వెంటనే ఓ నిర్మాతగా పవన్ కల్యాణ్ మారడం జరిగింది.

     పవన్ ఫ్లేవర్

    పవన్ ఫ్లేవర్

    పవన్ కల్యాణ్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రను పోషించలేదు. సినిమాకు నిర్మాతగా మారడమంటే అది నాకు గొప్ప. అలాంటిది ఇంకా రోల్ చేయాలని నేను అనుకొంటే అది అత్యాశ అవుతుంది. కానీ సినిమాలో అంతర్లీనంగా పవన్ కల్యాణ్ ఫ్లేవర్ ఉంటుంది.

    ముందు పవన్ అభిమానిని

    ముందు పవన్ అభిమానిని

    పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌లో చాలా మంది నాకు కనెక్ట్ కావడం నిజంగా అదృష్టం. ఆయనకు నేను మొదటి నుంచి అభిమానిని. ఆ తర్వాతే హీరో అయ్యాను. అలా పవన్‌తో నా అనుబంధం కొనసాగుతున్నది. అదే విధంగా పవన్ ఫ్యాన్స్ కూడా నాపై ఆదరణ చూపుతున్నారు. సాధారణంగానే పవన్ అందరు హీరోల ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటాడు. హెల్ప్ చేస్తుంటాడు.

    పవన్‌ను వాడుకోలేదు

    పవన్‌ను వాడుకోలేదు

    పవన్ కల్యాణ్ యాక్టర్‌గా అభిమానిస్తాను. రాజకీయపరంగా మంచి ఉద్దేశంతో ఆయన జనసేన పార్టీ పెట్టారు. రాజకీయాల్లో మంచి మార్పు తెస్తారు. ప్రజలకు మేలు చేస్తారనే నమ్మకం ఉంది. ఒకవేళ పవన్ కల్యాణ్ పిలిస్తే ఆయన తరఫున ప్రచారం చేస్తాను. పవన్ కల్యాణ్‌ను నేను వాడుకొంటున్నానని అనడం తప్పు. నేనెప్పుడు పవన్‌ను వాడుకోలేదు అని నితిన్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

    కృష్ణ చైతన్య నాకు ఫ్రెండ్

    కృష్ణ చైతన్య నాకు ఫ్రెండ్

    ఇష్క్ సినిమా నుంచి నాకు కృష్ణ చైతన్య మంచి ఫ్రెండ్. రౌడీఫెల్లో సినిమా రిలీజ్ తర్వాత నాకు కాల్ చేసి టాక్ ఏమిటి అని అడిగాడు. అప్పుడు సినిమా బాగాలేదు. కానీ డైరెక్టర్‌గా నీకు మంచి పేరు వచ్చింది అని నేను చెప్పాను. సినిమా బాగాలేదని బాధపడకు. మంచి కథ చేసుకో.. సినిమా చేద్దామని అన్నాను. మధ్యలో కొన్ని కథలపై చర్చలు జరిపాం. వర్కవుట్ కాలేదు. ఛల్ మోహనరంగ కథ ఇద్దరికీ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయింది.

    అజ్ఞాతవాసి ఫ్లాప్‌తో

    అజ్ఞాతవాసి ఫ్లాప్‌తో

    నేను అరాధించే వ్యక్తి, నా గురువు కలిసి రూపొందించిన అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ కావడంతో మనస్తాపం చెందాను. ఆ రోజంతా షాక్‌లోనే ఉండిపోయాను. ఫుల్ బాటిల్ మందు తాగినంత మత్తులో ఉండిపోయాను. పవన్ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో రోజంతా ఇంట్లోనే ఉండిపోయాను. హైప్ ఎక్కువగా ఉండటం మూలాంగా సినిమా రీచ్ కాలేకపోయింది.

    English summary
    Nithiin is an Indian film actor known for his works predominantly in Telugu cinema. Nithin made his film debut with Jayam in the year 2002 for which he received the Filmfare Award for Best Male Debut – South.In 2009, he made his Bollywood debut with RGV's Agyaat. He is celebrating his birthday on March 30 and His latest movie Chal Mohana Ranga is set to release on April 5th. In this occassion, Nithiin speaks to Telugu.filmibeat.com exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X