‘జయం’ తరువాత అలా జరిగింది ఈ సినిమాకే.. ‘చెక్’పై నితిన్ కామెంట్స్
ప్రస్తుతం నితిన్ తన చెక్ సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డాడు. ఈ శుక్రవారం విడుదల కాబోతోన్న మూవీ గురించి చిత్రయూనిట్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే బిజీలో ఉన్నారు. తాజాగా నితిన్ మీడియాతో సినిమా విశేషాల గురించి చెప్పుకొచ్చాడు. అందులో భాగంగా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు. పెళ్లి తరువాత జీవితం ఎలా ఉందన్న విషయం, వ్యక్తిగత విషయాలను కూడా చెప్పుకొచ్చాడు.

రిస్క్ లాంటిదేమీ కాదు..
చెక్ సినిమా రిస్క్ అనుకుంటున్నారా? అని నితిన్‌ను అడిగితే.. రెండేళ్ల క్రితం అయితే రిస్క్ ఏమో! ఇప్పుడు ఆడియన్స్ డిఫరెంట్ సినిమాలు, ఓటీటీలో కొత్త కంటెంట్ చూస్తున్నారు. 'నాంది', 'ఉప్పెన' ఆడాయి. ఇటువంటి సినిమాలకు ఫ్యాన్స్ ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు.

ఆడితే లక్..
పెళ్లి తర్వాత విడుదలవుతున్న సినిమా ఇదే. మీరెంత ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. వైఫ్ ఎంత ఎగ్జైటెడ్‌గా ఉన్నారంటూ మీడియా అడిగితే.. నాకు ఎగ్జైట్‌మెంట్ ఏమీ లేదు. సినిమా ఆడితే లక్ అంటారు. ఆడకపోతే ఆమె బ్యాడ్‌లక్ అంటారు. అందుకని, తనకు కొంచెం టెన్షన్ ఉందంటూ నితిన్ తెలిపాడు.

ఎక్కువ టేక్స్..
సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ వీక్ ఎక్కువ టేక్స్ తీసుకున్నారంట కదా అని నితిన్‌ను ప్రశ్నించారు. దానికి నితిన్ సమాధానంగా.. యేలేటిగారి స్టయిల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ వేరు. అర్థం చేసుకోవడానికి ఓ వారం పట్టింది. అప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకున్నా. తర్వాత ఈజీగా చేశానంటూ అసలు విషయం తెలిపాడు.

జయం తరువాత..
'జయం' తర్వాత అన్ని ఎక్కువ టేక్స్ తీసుకున్నది ఈ సినిమాకే. ఐటెమ్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్, కామెడీ ఎపిసోడ్స్ వంటివి ఏమీ ఉండదు. సినిమా అంతా కంటెంట్ ఉంటుంది. లాక్‌డౌన్‌లో ప్రజలందరూ ఓటీటీల్లో డిఫరెంట్ సినిమాలు చూశారు. వాళ్ళు కూడా డిఫరెంట్ సినిమాలు కోరుకుంటున్నారు. తప్పకుండా ఈ సినిమా జనాలకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఐడియా ఉంది. క్లైమాక్స్ చూస్తే మీకూ అర్థమవుతుందంటూ నితిన్ చెప్పుకొచ్చాడు.

పర్సనల్ లైఫ్..
సినిమాల గురించి ఇంట్లో మాట్లాడను.. మా మధ్య సినిమా, స్టోరీ డిస్కషన్లు ఉండవు. అది వేరే జీవితం, ఇది వేరే జీవితమంటూ నితిన్ చెప్పుకొచ్చాడు. అయితే పెళ్లి తరువాత తన జీవితంలో పెద్ద తేడా ఏమీ లేదని చెప్పుకొచ్చాడు. పెళ్లికి ముందు షాలిని ఇంటికి వచ్చి వెళ్తుండేది. పెళ్లి తర్వాత ఎప్పట్నుంచో తను ఇంట్లో ఉన్న ఫీలింగ్. ఇంట్లో మెంబర్‌లా ఉంది తప్ప నాకు కొత్తగా ఏమీ లేదంటూ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











