ఆ సీన్ అతడు సినిమాకు స్ఫూర్తే.. ఆయనకు స్వచ్ఛమైన అభిమానిని.. నితిన్ కామెంట్స్
యంగ్ హీరో నితిన్ భీష్మగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఫిబ్రవరి 21న ఈ మూవీ విడుదల కానుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది చిత్రయూనిట్. భీష్మ ప్రమోషన్లలో భాగంగా నితిన్ మీడియాతో ముచ్చటిస్తూ.. అనేక విషయాలను వెల్లడించాడు.

అతడు సినిమాలోనిదే..
భీష్మ ట్రైలర్ పరిశీలిస్తే.. అతడు సినిమాలో ఉన్నట్లుగా పోలంలో ఓ ఫైట్ ఉంటుంది. అదే విషయాన్ని నితిన్ వద్ద ప్రస్తావిస్తే.. కరక్టేనని చెప్పుకొచ్చాడు. 'అతడు'లోని పొలం ఫైట్ ను దృష్టిలో ఉంచుకొనే దాన్ని తీశామని పేర్కొన్నాడు. అది ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెప్పాడు.
Recommended Video


సంగీత దర్శకుడి విషయంలో..
భీష్మకు సంగీత దర్శకుడి విషయంలో మొదటగా వేరే వారిని అనుకున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై నితిన్ స్పందిస్తూ.. అది నిజమేనని చెప్పాడు. అంతా 'ఛలో' టీమే అయిపోతోందని, మహతినైనా మార్చమని వెంకీకి చెప్పానన్నాడు. మహతితో తనకు బాగా సింకవుతుందనీ, అతడితోనే మ్యూజిక్ చేయిద్దామనీ వెంకీ అనడంతో సరేనని ఒప్పుకున్నట్లు తెలిపాడు. వాటే బ్యూటీ, సరాసరి గుండెల్లో , సింగిల్స్ యాంథెంఇలా మంచి మ్యూజిక్ ఇచ్చాడని అన్నాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా బాగా ఇచ్చాడని, నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడని చెప్పుకొచ్చాడు.

డ్యాన్స్‌లు ప్రత్యేకంగా..
తాను చివరగా 'గుండెజారి గల్లంతయ్యిందే'లో ఎక్కువ డాన్స్ చేశానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి కానీ ఎక్కువ డాన్స్ చెయ్యలేదని తెలిపాడు. ఈ సినిమాకు ముందే అనుకొని డాన్స్ చేసామని.. తెరమీద తన డాన్స్ చూసినవాళ్లు కచ్చితంగా ఇష్టపడతారని నమ్మకంగా చెప్పాడు.

ఆయనకు స్వచ్చమైన అభిమానిని..
ప్రతి సినిమాలో పవన్ కల్యాణ్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది.. ప్రమోషన్ కోసమేనా? అంటూ ప్రశ్నిస్తే.. జయం నుంచి నా ప్రతి సినిమాలో ఆయన ప్రస్తావన ఉందని చెప్పుకొచ్చాడు. ఆయన పాటో, ట్యూనో, పోస్టరో, డైలాగో.. ఉంటూనే వస్తుందని తెలిపాడు. 'ఇష్క్'తో సక్సెస్ వచ్చాక దాని గురించి మాట్లాడుతూ ఉన్నారని అన్నాడు. అది ఆయనపై తనకున్న ప్రేమ అని.. తాను ఆయనకు స్వచ్ఛమైన అభిమానినని చెప్పుకొచ్చాడు. మీరు ఎంత దాని గురించి రాసినా దాన్ని పెడుతూనే ఉన్నానని... అది నా లవ్. అంతేనంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు.


Click it and Unblock the Notifications











