twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ అనుభవం లేదు.. కానీ ఎగిరి గంతేశాను.. సొసైటీపై అ! సినిమా ప్రభావం.. నిత్య మీనన్

    By Rajababu
    |

    Recommended Video

    నిత్య మీనన్ కొత్త ప్రయోగం

    దక్షిణాదిలో విలక్షణమైన నటి ఎవరంటే నిత్యమీనన్ అని ఠక్కున చెబుతారు. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో ఆకట్టుకొంటున్నారు. రాశి కంటే వాసి అని నమ్మే నిత్యామీనన్ కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే కనిపిస్తారు. ఆమె నటించే పాత్రల్లో ఆమె మార్కు కనిపిస్తుంది. ప్రత్యేకమైన నటనా ప్రతిభ ఉన్న నిత్యమీనన్ తాజాగా అ! అనే చిత్రంలో స్వలింగ సంపర్కురాలిగా కనిపించింది. ఆ పాత్ర ప్రభావం సమాజంపై ఉంటుందని ఆమె స్పష్టం చేసింది. అ! సినిమా సక్సెస్ వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో నిత్యమీనన్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడింది.. ఆ వివరాలు మీకోసం..

     కథ చెప్పగానే ఎక్సైట్

    కథ చెప్పగానే ఎక్సైట్

    అ! చిత్రం కథ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. సాధారణంగా చాలా కథలు వింటాం. కానీ ఇలాంటి స్టోరి వినడం చాలా రేర్. ఎప్పడూ రొటీన్ పాత్రలు చేస్తుంటాం. ఒక పాత్ర చేస్తే అలాంటి పాత్రలు వస్తుంటాయి. అ! చిత్రంలోని క్రిష్ లాంటి పాత్రను దర్శకుడు చాలా కొత్తగా మలిచాడు. అదే విషయం నన్ను చాలా ఆకట్టుకొన్నది.

     నాని చెప్పిన విషయం నిజమే

    నాని చెప్పిన విషయం నిజమే

    కథ చెప్పగానే నేను ఎగిరి గంతేస్తాను అని దర్శకుడు ప్రశాంత్‌తో నాని చెప్పిన విషయం వాస్తవమే. నాకు క్రేజీ క్యారెక్టర్లు చేయడమంటే చెప్పలేనంత ఇష్టం. ఒకేరకమైన పాత్రలు చేయడం ద్వారా బోర్ కొడుతుంది. అందుకే క్రిష్ పాత్రను ఒప్పుకొన్నాను.

     నాని కోసం చేయలేదు

    నాని కోసం చేయలేదు

    అ! చిత్రాన్ని హీరో నాని కోసం చేయలేదు. కథ నచ్చే చేశాను. అందరం ప్రశాంత్ కోసమే చేశాం. ప్రశాంత్ రెండోసారి కలిసినప్పుడు నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారని ప్రశాంత్ చెప్పారు. ముందుగా రాధ క్యారెక్టర్, ఆ తర్వాత క్రిష్ పాత్ర గురించి చెప్పారు. అయితే నేనే క్రిష్ పాత్రను ఎంచుకొన్నాను. ఈ పాత్ర కోసం ఎలాంటి వర్కవుట్ చేయలేదు.

     స్వలింగ సంపర్కురాలిగా

    స్వలింగ సంపర్కురాలిగా

    స్వలింగ సంపర్కురాలు (లెస్బియన్) పాత్రలో కనిపించడం కెరీర్‌ కు ఇబ్బంది అనిపించలేదు. క్రిష్ పాత్రను చేసేటప్పుడు నేను ఆలోచించలేదు. ప్రస్తుతం ఆలోచించడం లేదు. నటిగా అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకోలేదు. నటిగా నాకు ఛాలెంజ్ ఉన్న పాత్ర అనిపించింది. అందుకే చేశాను.

     చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాను..

    చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాను..

    క్రిష్ పాత్ర చేసే ముందు కొంచెం కన్‌ఫ్యూజ్ అయిన మాట వాస్తవం. మనం చేసే సినిమాల్లో ముందే ప్రిపేర్ అయ్యేంత స్కోప్ ఉండదు. క్రిష్ క్యారెక్టర్ చేయడానికి ముందు నాకు అలాంటి అనుభవం లేదు. షూట్‌కు ముందు ఎలా చేస్తానో అని ఆందోళన పడ్డాను. కానీ కెమెరా ముందుకు వెళితే దానంతట అదే వస్తుందని అనుకొన్నాను.

    నా పాత్ర సమాజంపై

    నా పాత్ర సమాజంపై

    క్రిష్ అనే లెస్బియన్ పాత్ర సమాజంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నేను ఒక పాత్రను ఒప్పుకునేటప్పుడు దాని గురించి నేను బాగా ఆలోచిస్తాను. నా పాత్ర సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే ముందుగా ఆలోచిస్తాను. సమాజాన్ని ఓ మంచి మార్గం వైపు నడిపించాల్సిన బాధ్యత నటిగా నాపై ఉంది. ఇలాంటి పాత్రలు చేయడం ద్వారా సమాజంపై కొంత ప్రభావం ఉంటుంది.

     టాలీవుడ్‌పై అ! ప్రభావం

    టాలీవుడ్‌పై అ! ప్రభావం

    అ! చిత్రం టాలీవుడ్‌పై భారీగా ప్రభావం చూపుతుంది. ఈ చిత్రం తర్వాత కొత్త తరహా చిత్రాలు రావడానికి అవకాశం ఉంటుందని అనుకొంటున్నాను. ఎందుకంటే అందరికి నచ్చే సినిమాలు చేయడమనేది, ఒకే రకమైన సినిమాలు చేయడం అనేది బోరింగ్ ఉంటుంది. టాలీవుడ్ పరిశ్రమ పరిధి చాలా విస్తృతమైంది. దానిని తగినట్టుగా సినిమాలు రావాల్సిన అవసరం ఉంది.

    నచ్చితేనే

    నచ్చితేనే

    స్క్రిప్టు నచ్చితేనే సినిమాలు చేస్తాను. నా కెరీర్‌లో దాదాపు 200 కథలు విని ఉంటాను. కానీ నేను చేసింది 10కి మించి ఉండవు. నాకు ఏదో ఒక పాయింట్ నచ్చాలి. అప్పుడే నేను సినిమాకు ఓకే చెబుతాను. నచ్చకపోతే నేను అప్పుడే నో చెబుతాను. స్క్రిప్టు నచ్చితే దానిని మరింత బాగా చేయడానికి నేను అందులో మార్పులు చేర్పులకు ప్రయత్నిస్తాను. డైలాగ్స్ కూడా రాస్తాను.

    ప్రతిష్టాత్మకంగా

    ప్రతిష్టాత్మకంగా

    ప్రస్తుతం నేను చేస్తున్న ప్రాజెక్ట్ ప్రాణ. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రచనా సహకారం అందించాను. ఆ చిత్రం కన్నడ, మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో చేస్తున్నాం. నాలుగు భాషల గురించి నాకే బాగా తెలుసు. అందుకే స్క్రిప్టులో ఇన్‌వాల్వ్ అవుతాను. సాధారణంగా నేను ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తుంటాను. కొన్ని ఫినిష్ అవుతాయి. కొన్ని మధ్యలోనే ఆగిపోతాయి

    English summary
    Nithya menen is versatile actor in the south. She has done different movies in recent past. Recently she did a character as Lesbian in Awe! movie. This movie produced her co star Nani. This movie getting good applause from one sector of Audience. In this occassion, Nithya menen spoke to Telugu Filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X