30 లక్షల ఉద్యోగాన్ని వదిలేసి..రైటర్స్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్.. కుమారి శ్రీమతి రచయితల ఇంటర్వ్యూ
ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్‌పై స్వప్న దత్, ప్రియాదత్ నిర్మించిన వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి. ఈ వెబ్ సిరీస్ ద్వారా ముగ్గురు రచయితలు జయంత్ తాడినాడ, ఉదయ్ ఆగమర్షన్, కౌశిక్ సుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. జయంత్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఐఐటీ బాంబేలో ఎంటెక్ పూర్తి చేశారు. 1 వెర్ష్ అనే కంపెనీకి వ్యవస్థాపకుడిగా, సీటీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. 1 వెర్స్ కంపెనీకి వైస్ ప్రసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. కౌశిక్ విషయానికి వస్తే.. బీటెక్, ఎంబీఏ పూర్తి చేశారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో బిజినెస్ అనలిస్టుగా వర్క్ చేస్తున్నారు. అలాగే మ్యూజిక్ కంపోజర్‌గా ప్రయత్నాలు చేస్తూనే రచయితగా రాణిస్తున్నారు. ఇక కుమారి శ్రీమతి వెబ్ సిరీస్‌కు ఈ ముగ్గురు రచయితలు రాసిన మాటలకు మంచి స్పందన, ప్రశంసలు లభించాయి. ఓటీటీలో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో జయంత్, ఉదయ్, కౌశిక్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
లక్షలు సంపాదిస్తున్నా.. సంతృప్తి లేదు..:ఐఐటీలో చదివి 10 ఏళ్లు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ.. ఏటా 30 లక్షల రూపాయలకుపైగా సంపాదిస్తున్పప్పటికీ మాకు జీవితంలో సంతృప్తి లేదు. సినిమా పరిశ్రమలో ఏదో సాధించాలనే పట్టుదల రోజు రోజుకు పెరిగిందే కానీ తగ్గలేదు. ఏదైనా నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకోవాలంటే 30 నుంచి 40 ఏళ్లలోపే తీసుకోవాలి. 60 ఏళ్ల వయసులో ఇలాంటి నిర్ణయం తీసుకోలేం అని కౌశిక్, ఉదయ్, జయంత్ అన్నారు.

ఆయన స్పూర్తి వల్లే రచయితలుగా:రచయితలుగా మారడానికి ప్రధాన కారణం స్వర్గీయ జంధ్యాల. ఆయన నుంచి స్పూర్తి పొంది రచయితలుగా మారాం. కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ చూస్తే జంధ్యాల సినిమా చూసినట్టు ఉందని కొందరు చెప్పడంతో మాకు చాలా ఆనందం వేసింది. లోకల్ మీడియా, నేషనల్ మీడియా నుంచి రివ్యూలు మాపై మాకు నమ్మకం మరింత కుదిరింది. శ్రీమతి క్యారెక్టర్ మేము అనుకొన్నట్టే అందరికి నచ్చింది అని తెలిపారు.

మా మధ్య అలాంటి అభిప్రాయ భేదాలు:రచయితలు ఇద్దరు ఉంటే రకరకాల అభిప్రాయ బేధాలు ఉంటాయి. మేము ముగ్గురం కలిసి ఎలా పనిచేస్తామనే విషయంపై అందరికి ఆసక్తి కలిగిస్తుంది. ముగ్గురు రచయితలు కలిసి పనిచేయడం కొత్తే కానీ.. గతంలో కూడా ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ సినిమాలకు ఎక్కువ మంది రచయితలు పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే రైటింగ్ సమయంలో మా మధ్య గదిలో కొట్టుకొనేంతగా డిస్కషన్, అభిప్రాయ బేధాలు ఉంటాయి.కానీ ఒక్కసారి బయటకు వెళ్లిన తర్వాత ముగ్గురం ఒక్క మాట మీదే ఉండటం మా సక్సెస్‌కు ఒక కారణం. స్వప్న దత్ కూడా మా యూనిటిని చూసి ఆశ్చర్యపోయిన సందర్బాలు ఉన్నాయి అని అన్నారు.

స్వప్నదత్ ఫుల్ ప్రీడమ్:ఒక గదిలో ముగ్గురిని కన్విన్స్ చేయలేకుంటే.. బయట వందమందిని ఎలా కన్విన్స్ చేస్తామనే విషయం గురించి మాకు తెలుసు. మేము ముగ్గురం కన్విన్స్ అయితే ప్రేక్షకులకు కూడా కన్విన్స్ అవుతారనే నమ్మకం మాకు ఉంటుంది. కుమారి శ్రీమతి వెబ్ సిరీస్‌కు డైలాగ్స్ రాసే సమయంలో అవసరాల శ్రీనివాస్, స్వప్న దత్ మాకు ఫ్రీడమ్ ఇచ్చారు. అవసరాలతోపాటు మీలో ముగ్గురు ఒప్పుకొంటే ఒక పాయింట్‌ను సీరియస్‌గా ఆలోచించాలి అని స్వప్న దత్ చెప్పే వారు. మాకు రైటింగ్‌కు ఆమె బాగా రెస్పెక్ట్ ఇచ్చారు. మేము రాసిన విషయాలకు ఫీడ్ బ్యాక్ ఇచ్చేది అని చెప్పారు.

కుమారి శ్రీమతి ఎమోషనల్‌గా ఉందంటే? :కుమారి శ్రీమతి ఓ టిపికల్ ప్రాజెక్టు. దర్శకుడికి తెలుగు రాదు. అవసరాల శ్రీనివాస్‌కు చాలా అనుభవం ఉంది. స్వప్న దత్ పెద్ద ప్రాజెక్టులు డీల్ చేసిన అనుభవం ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య మేము రాసిన వర్క్‌ను వారు ఒకే చేశారు. అప్పుడే మాకు మాపై మరింత నమ్మకం, క్లారిటీ వచ్చింది. అవసరాల మాకు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈ ప్రాజెక్ట్ బాగా వచ్చింది. స్క్రిప్టులో మార్పులు, స్క్రీన్ ప్లేలో మార్పులు చేసిన విధానం వల్లే గ్రిప్పింగ్‌గా, ఎమోషనల్‌గా ఈ వెబ్ సిరీస్ కనిపించింది అని జయంత్, కౌశిక్, ఉదయ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











