త్రివిక్రమ్ తర్వాత విశ్వక్ సేన్‌కు ఆ రేంజ్.. మాస్ కా దాస్‌కు రేటింగ్ ఎంతంటే.. నివేదా పేతురాజ్
యువ విశ్వక్ సేన్ నటించి, దర్శకత్వం వహించి.. నిర్మాతగా నిర్మించిన తొలి పాన్ ఇండియా చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ చిత్రంలో విశ్వక్ సేన్‌కు జంటగా నివేదా పేతురాజ్ నటించింది. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ట్రెండింగ్ అవుతున్నాయి. టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ నెల 22న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న నేపథ్యంలో హీరోయిన్ నివేదా పేతురాజ్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

ధమ్మీకి అలా ఒకే చెప్పా
పాగల్ సినిమా చేస్తుండగానే... విశ్వక్ సేన్ మూవీ ఓరి దేవుడా సినిమాలో మిథిలా రోల్‌లో నటించమని ఆఫర్ ఇచ్చారు. అయితే నేను వారి ఆఫర్‌ను నేను అంగీకరించలేదు. ఆ తర్వాత మరో ప్రాజెక్టు కోసం ఆఫర్ ఇచ్చారు. అయినా నో చెప్పాను. ధమ్మీ సినిమా కోసం మరో హీరోయిన్‌ను చూస్తున్నారు. నాకు కూడా ఆఫర్ ఇచ్చారు. ప్రసన్న కుమార్ చెప్పిన కథ విన్న తర్వాత వెంటనే ధమ్మీకి ఓకే చెప్పాను అని నివేదా పేతురాజ్ తెలిపారు.

క్లైమాక్స్ మార్చితే భయపడ్డా
ప్రసన్న కుమార్ చెప్పిన కథలో క్లైమాక్స్ మార్చామని విశ్వక్ సేన్ చెప్పారు. క్లైమాక్స్‌లో నా రోల్ మార్చామని చెప్పగానే భయపడ్డాను. అయితే ఆ తర్వాత విశ్వక్ సేన్‌ను అడిగితే.. పూర్తిగా నా పాత్ర గురించిన వివరాలు వెల్లడించారు. దాంతో నాకు భయం పోయింది. క్లైమాక్స్ మార్చిన తర్వాత నా పాత్రకు పూర్తి న్యాయం జరిగిందనిపించింది. అంతేకాకుండా నా పాత్రకు మరింత బలం చేకూరింది అని నివేదా పేతురాజ్ చెప్పారు.

డ్యాన్స్ చేస్తే మంచి క్రేజ్
దాస్ కా ధమ్మీ సినిమాలో నేనెప్పుడే లేని విధంగా మాస్ పాటలకు స్టెప్పులేశాను. నేను చేసిన డ్యాన్సులకు మంచి రెస్సాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో కామెంట్స్ చూసినప్పడు చాలా హ్యాపీగా ఉంది. గతంలో ప్రభుదేవాతో సినిమా చేసినప్పుడు.. తమిళంలో ఎందుకు చేస్తున్నావు.. తెలుగులో వెళ్లి మంచి సినిమాలు చేయి.. గ్లామర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకో. మంచి రెమ్యునరేషన్ అందుకో.. ఆ తర్వాత వచ్చి ఇక్కడ సినిమాలు చేయి అని ప్రభుదేవా చెప్పారు. గ్లామర్ హీరోయిన్‌గా స్టెప్పులేయడం చూసి నా మదర్ కూడా సంతోషంగా ఫీలయ్యింది. పడిపోయానే పిల్ల, ఇతర పాటలకు మంచి రెస్సాన్స్ వస్తున్నది.

ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తా
నాకు హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు, గ్లామర్ పాత్రలు చూస్తూ బ్యాలెన్స్ చేయాలని ఉంది. హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తే చాలా ఎమోషనల్ అయిపోతాం. గ్లామర్ హీరోయిన్ పాత్రలైతే.. చాలా ఉల్లాసంగా ఉంటుంది. దర్శక, నిర్మాతలు కూడా బాగా చూసుకొంటారు.

విశ్వక్ సేన్ ది గ్రేట్
హీరో ప్రొడ్యూస్ చేయడం సరే.. కానీ డైరెక్ట్ చేయడం కష్టం. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా విశ్వక్ సేన్ మూడు బాధ్యతలను నిర్వర్తించడం చూసి నాకు భయమేసింది. ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకొంటూ.. సినిమా సీన్లు ఎలా వస్తుందని చూసుకోవాలి. పైగా సీన్లలో నటించాల్సి ఉంటుంది. యాక్టర్ల బాగోగులు చూసుకోవాలి. ఇన్ని బాధ్యతలను చాలా ఎనర్జిటిక్‌గా విశ్వక్ సేన్ పనిచేశాడు అని నివేదా పేతురాజ్ చెప్పారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ రేంజ్ ఎనర్జీ
అలా వైకుంఠపురంలో సెట్లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత అంత ఎనర్జీగా డైరెక్ట్ చేసిన వారిలో విశ్వక్ సేన్ ఒకరు. చాలా ఎనర్జీతో సినిమాను డైరెక్ట్ చేశారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా 10 మార్కులకు 10 మార్కులు వేస్తాను.


Click it and Unblock the Notifications











