విలన్ పాత్రలకు రెడీ.. అవసరమైతే రెమ్యునరేషన్ తగ్గించుకొంటా.. నివేదా థామస్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న V మూవీకి ఇంద్రగంటి మోహన్ దర్శకత్వం వహించారు. నానితోపాటు సుధీర్ బాబు, పోసాని మురళీ కృష్ణ, నివేదా థామస్, అదితి రావు హైదరీ తదితరులు నటించారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో థియేటర్లు ఓపెన్ అయ్యే సూచనలు కనిపించకపోవడంతో పలు సినిమాలను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. V చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకొన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ నివేదా థామస్ మీడియాతో జూమ్ ద్వారా మాట్లాడారు.

నాని కెరీర్‌లోనే ది బెస్ట్
సాధారణంగా సినిమా రిలీజ్ అవుతుంటే హీరోలు, హీరోయిన్ల గురించి మాట్లాడుకొంటారు. కానీ V సినిమాకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఈ చిత్రంలోని క్యారెక్టర్ల గురించి మాట్లాడుకోవడం గొప్ప రిలీఫ్. ఈ సినిమాలో నాని తన ఇమేజ్‌కు భిన్నంగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించారు. నానీ కెరీర్‌లోనే ది బెస్ట్ అవుతుందని అనుకొంటున్నాు. తప్పకుండా మా కెరీర్‌లో ఈ సినిమా మంచి చిత్రం అవుతుంది అని నివేదా థామస్ అన్నారు.

అదితి రావు హైదరీతో నాకు
నేను నటించే ఏ చిత్రంలోనైనా అందరూ బాగా నటించాలి. అందరికీ పేరు రావాలని కోరుకొంటారు. అదే విధంగా అదితి రావు హైదరీ అద్భుతమైన నటి. ఈ చిత్రంలో మా ఇద్దరి మధ్య సన్నివేశాలు ఉన్నాయా? లేవా అనే విషయాలు తెరపైన చూడాల్సిందే. అదితి రావు, నానీ, సుధీర్ బాబు అందరి పాత్రలు హైలెట్ అవుతాయి. ఫెర్ఫార్మెన్స్‌కు అవకాశం ఉన్న పాత్రలు తెరపైన కనిపిస్తాయి అని నివేదా థామస్ తెలిపారు.

నెగిటివ్ షేడ్స్‌లో నటించాలని ఉంది.
నాని నెగిటివ్ షేడ్స్‌లో కనిపిస్తారనే అందరికి తెలిసిందే. నాని తన పాత్రలో అద్భుతంగా ఉన్నారనేది వాస్తవం. సినిమా రిలీజ్ తర్వాత నాని ఏంటో మరోసారి తెలుస్తుంది. నాకు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు నటించాలని ఉంది. మంచి పాత్రలు వస్తే తప్పుకుండా చేస్తాను. స్టార్‌గా కంటే నటిగా అందరికి గుర్తుండిపోవాలనుకొంటాను. నటిగా హీరోయిన్ పాత్రలే కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించాలన్నది నా ఉద్దేశం అని నివేదా థామస్ పేర్కొన్నారు.
Recommended Video

అవసరమైతే పారితోషికం తగ్గించుకొంటాను
కరోనా పరిస్థితులు అందరి జీవితాలను ప్రభావితం చేస్తున్నది. సినిమా పరిశ్రమనే కాకుండా అన్ని రంగాలను సమస్యల్లోకి నెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో నేను నా వంతుగా ఇండస్ట్రీకి, నిర్మాతలకు సహాయ పడేందుకు సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే నా రెమ్యునరేషన్ తగ్గించుకొంటాను. నిర్మాతలకు, పరిశ్రమకు అండగా నిలువడానికి నాకు ఎలాంటి సమస్యలు లేవు అని నివేదా థామస్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











