twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే ఆరుగురి హీరోయిన్లతో లిప్‌లాక్స్ చేయించా.. ఆ సమస్యతో పది రోజులు నిద్రపోకుండా..

    |

    తెలుగులో 'భలే భలే మగాడివోయ్', 'నేను లోకల్', 'మహానుభావుడు', 'శైలజారెడ్డి అల్లుడు'తో సినిమాటోగ్రాఫ‌ర్‌గా నిజార్ షఫీ పేరు తెచ్చుకున్నారు. ఆయన 'సెవెన్'తో దర్శకుడిగా మారుతున్నారు. హవీష్ కథానాయకుడిగా కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ లో రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లు. ఈ సినిమా ప్రీమియర్ షోలు బుధవారం ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా నిజార్ షఫీతో మీడియాతో మాట్లాడుతూ..

    సెవెన్‌కు డైరెక్టర్‌గా అవకాశంపై

    సెవెన్‌కు డైరెక్టర్‌గా అవకాశంపై

    సెవెన్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశంపై నిజార్ మాట్లాడుతూ.. హీరో హవీష్ ఒకరోజు ఫోన్ చేశారు. 'మంచి లైన్ విన్నాను. డైరెక్షన్ చేస్తారా?' అని అడిగారు. నాకు స్టోరీ లైన్ నచ్చింది. రమేష్ వర్మగారితో కలిసి డెవలప్ చేశాం. మంచి స్టోరీ లైన్, ఈ సినిమా మిస్ చేసుకోవద్దని ఓకే చెప్పేశా. దర్శకుడిగా మారాలనే ఆలోచన నాలో ఉంది. అయితే, ఇంత త్వరగా దర్శకుణ్ణి అవుదామని అనుకోలేదు. మంచి స్టోరీ నా దగ్గరకు వచ్చింది. ఎందుకు మిస్ చేసుకోవాలని ఓకే చెప్పేశా. సినిమాటోగ్రఫీ ప‌రంగానూ మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది. నైట్ ఎఫెక్ట్స్, థ్రిల్స్ ఉంటాయి. ప్రేక్షకులకు ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్.

    సెవెన్ కథ ఏమిటంటే

    సెవెన్ కథ ఏమిటంటే

    ఒక రొమాంటిక్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. రెహమాన్ గారు ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు. ఆయన దగ్గరకు ఒక కేసు వస్తుంది. కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురు వ్యక్తులు కీలకంగా ఉంటారు. హీరో కార్తీక్, ఆరుగురు హీరోయిన్లు. రెహమాన్ దృష్టిలో ఏడుగురు. అదే 'సెవెన్'. కార్తీక్ గా హవీష్ ఎలా నటించాడు?చాలా బాగా చేశాడు. ఇప్పటివరకు తను ఇటువంటి సినిమా చేయలేదు. 'సెవెన్'లో కొత్తగా కనిపిస్తాడు.

    హీరోయిన్లతో లిప్ లాక్స్ ఐడియా నాదే

    హీరోయిన్లతో లిప్ లాక్స్ ఐడియా నాదే

    లిప్ లాక్స్ ఐడియా నాదే. కథలో భాగంగా ఉంటాయి. ప్రేమకథలో లిప్ కిస్సులు కూడా భాగమే. నటుడిగా ముద్దు సన్నివేశాలు చేయడానికి హవీష్ కొంచెం అలోచించి ఉండొచ్చు. కానీ, దర్శకుడిగా సెట్‌లో నాకు కావలసిన సన్నివేశాలు చేయించుకున్నాను. రొమాన్స్, థ్రిల్ సీన్స్... సినిమాలో రెండూ ఉంటాయి.

    ఆరుగురు హాట్ హీరోయిన్లతో

    ఆరుగురు హాట్ హీరోయిన్లతో

    ఆరుగురు హీరోయిన్లతో పనిచేయడం హ్యాపీగా ఉంది. సినిమాను ఆరు రీళ్ళుగా విభజిస్తే... రీలుకు ఒక హీరోయిన్ చొప్పున వస్తారు. ప్రతి ఒక్కరికీ కథలో ప్రాముఖ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరి కథ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. అందరూ తమ తమ పాత్రల్లో బాగా చేశారు. పాటలకు మంచి పేరొచ్చింది. హవీష్ కూడా సంగీతం గురించి చాలా చెప్పారు!
    సినిమాలో మూడు పాటలు ఉన్నాయి. మూడూ హిట్టయ్యాయి. థ్రిల్లర్ సినిమాలకు పాటలతో పాటు నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. చైతన్ భరద్వాజ్ మంచి నేపథ్య సంగీతం అందించారు.

    సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ అయితే

    సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ అయితే

    దర్శకుడు రమేష్ వర్మనే కథ చెప్పారు. తర్వాత టీమ్ అంతా కలిసి డెవలప్ చేశాం. సెట్‌కి వెళ్ళిన త‌ర్వాత‌ నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆయన జోక్యం చేసుకోలేదు.సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ అయితే అనుకున్నది అనుకున్నట్టుగా 95 శాతం వరకూ తీయవచ్చు. సినిమాటోగ్రఫీ మాత్రమే చేసిన సినిమాలకు కూడా దర్శకులతో హెల్తీ డిస్కషన్ ఉండేది. షాట్స్ గురించి డిస్కస్ చేసేవాళ్ళం.

    ఆ సమస్యతో నిద్రపోకుండా పనిచేశాను

    ఆ సమస్యతో నిద్రపోకుండా పనిచేశాను

    సెవెన్ సినిమా సందర్భంగా సమస్యలు పెద్దగా ఏమీ ఎదురు కాలేదు. ఆపరేటివ్ కెమెరామేన్ ఒకరిని పెట్టుకున్నాను. కాకపోతే... పది రోజులు ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే... 'శైలజారెడ్డి అల్లుడు', 'సెవెన్' షెడ్యూల్స్ క్లాష్ అయ్యాయి. పగలు 'శైలజారెడ్డి అల్లుడు', రాత్రి 'సెవెన్' షూటింగ్ చేసేవాణ్ణి. ఒక సినిమాకు నేను సినిమాటోగ్రాఫర్. మరో సినిమాకు నేను డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్. 'సెవెన్' షెడ్యూల్ వాయిదా వేద్దామంటే ఆర్టిస్టుల డేట్స్ తో ఇబ్బంది. అందుకని, పది రోజులు నిద్రపోకుండా పనిచేశా.

    English summary
    Cinematograper Nizar Shafi's latest movie 7. He become as a director for this movie. Six heroines like Regina, Anisha ambrose, Nandita Shweta, Tridha Chowdary, Aditi Arya playing crucial roles. Havish is the hero. As part of the promotion, Nizar Shafi speaks to media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X