twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్‌ను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నా.. అంతగా అభిమానించాను..

    |

    Recommended Video

    Lovers Day Heroine Noorin Shereef Exclusive Interview With Filmibeat Telugu

    లవ్, రొమాన్స్, ఫ్రెండ్‌షిప్ లాంటి అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవర్స్ డే సినిమా ( మలయాళంలో ఓరు ఆడార్ లవ్ )కు అన్నివర్గాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తున్నది. మంచి వసూళ్లతో ఈ సినిమా మూడోవారంలోకి ప్రవేశించనున్నది. ఈ చిత్రంలో నటించిన రోషన్, ప్రియా వారియర్, నూరిన్ షరీఫ్ పాత్రలకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. సినిమా విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నూరీన్ షరీష్ తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే...

    ఈ రెస్పాన్స్‌ను ఊహించలేదని

    ఈ రెస్పాన్స్‌ను ఊహించలేదని

    లవర్స్ డే సినిమా (మలయాళంలో ఓరు ఆడార్ లవ్) చిత్రానికి ఇంత మంచి రెస్సాన్స్ వస్తుందని అనుకోలేదు. మలయాళంలో ఈ సినిమాకు మంచి స్పందన వస్తున్నది. నా తొలి సినిమాకు అన్ని భాషల్లో ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. చిత్ర యూనిట్ అందరికీ మంచి పేరు రావడం మరింత ఆనందం కలిగిస్తున్నది.

    ప్రశంసలు కురిపిస్తూ సందేశాలు

    ప్రశంసలు కురిపిస్తూ సందేశాలు

    లవర్స్ డే సినిమా చూసిన తర్వాత గాధా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. నా పాత్రపై ప్రశంసలు కురిపిస్తూ మెసేజ్ పంపిస్తున్నారు. రివ్యూలు చాలా బాగా వచ్చాయి. గాధా పాత్ర గురించి మంచిగా మాట్లాడుకోవడం ఆనందంగా ఉంది. నన్ను ప్రోత్సాహించిన ప్రతీ ఒక్కరికి నా థ్యాంక్స్. ఈ ఉత్సాహంతో మరిన్ని మంచి సినిమాలు చేస్తాను.

    పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను

    పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను

    లవర్స్ డే ఆడియో ఫంక్షన్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా రావడంతో హ్యాపీగా ఫీలయ్యాను. నా చిన్నతనంలో మలయాళంలోకి డబ్బింగ్ అయిన అల్లు అర్జున్ సినిమాలు బన్నీ, హ్యాపీ బీ హ్యాపీ చూశాను. చిన్నతనంలో తెర మీద అల్లు అర్జున్‌ను చూసి పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. ఆయనను అంతగా అభిమానించాను.

    అల్లు అర్జున్ కలుసుకోవడం గురించి

    అల్లు అర్జున్ కలుసుకోవడం గురించి

    నేను అమితంగా ప్రేమించే అల్లు అర్జున్‌ను నా తొలి సినిమా విడుదలకు ముందే కలుసుకోవడం ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఆడియో రిలీజ్ తర్వాత అల్లు అర్జున్‌ను కలిశాను. ఆయన పక్కన నిలుచుంటే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆయనతో ఫోటో కూడా దిగాను.

    నిర్మాత గురురాజ్ ఇచ్చిన అతిథ్యానికి ఫిదా

    నిర్మాత గురురాజ్ ఇచ్చిన అతిథ్యానికి ఫిదా

    లవర్స్ డే సినిమా ప్రమోషన్ కోసం నేను తొలిసారి హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ నిర్మాత గురురాజ్, ఆయన కుటుంబం ఇచ్చిన ఆతిథ్యం చాలా ఆకట్టుకొన్నది. తెలుగు వారంతా మమల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకొన్నారు. వారు కురిపించిన ప్రేమ ఎప్పటికీ గుర్తుంటుంది అని నూరీన్ షరీఫ్ అన్నారు.

    English summary
    Many pointed out that Priya Prakash Varrier is not the heroine of Oru Adaar Love, but Noorin Shereef is. She had more screen time and a well-rounded character than Priya Prakash Varrier. Noorin revealed that her character was sidelined after Priya Prakash Varrier's wink became viral, even though she was signed as the heroine of Oru Adaar Love.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X