వేల కోట్ల అవినీతి సొమ్ము ఏం చేసుకొంటారు.. నేను పొలిటిషనైనా నొక్కేస్తా.. విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి, మహానటి, గీత గోవిందం చిత్రాల తర్వాత నోటా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గత సినిమాల వరకు తెలుగుకే పరిమితమైన విజయ్ దేవరకొండ ప్రస్తుతం దక్షిణాదికి విస్తరించాడు. నోటా చిత్రం కేరళ, తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో విడుదలవుతున్నది. తెలంగాణాలో ఎన్నికలు ఉన్నందున నోటా సినిమాను నిలిపివేయాలని రాజకీయ పార్టీలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో విజయ్ దేవరకొండ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. విజయ్ దేవరకొండ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

రాజకీయాలపై నాకు అవగాహన ఉంది

రాజకీయాలపై నాకు అవగాహన ఉంది

నాకు రాజకీయాలపై బేసిక్ అవగాహన ఉంది. పాలిటిక్స్‌పై నాకు ఓ అభిప్రాయం ఉంది. పౌరుడిగా నాకు అన్ని సౌకర్యాలు ఉండాలని కోరుకొంటాను. నేను ప్రయాణించే రోడ్డు బాగుంటుందనుకొంటాను. నీటి సరఫరా బాగా ఉండాలని కోరుకొంటాను. ఇలాంటి వసతులు ప్రభుత్వాలు ప్రజలకు ఇవ్వాలని కోరుకొంటాను. కానీ వేల కోట్ల కుంభకోణం చేసి డబ్బు ఏం చేసుకొంటారు. ఒకవేళ నేను పొలిటిషియన్ అయినా ఎందో కొంత నొక్కేస్తానుకుంటా. కానీ అంత ధనదాహం నాకు ఉండదు.

నోటా సినిమా కథ అదే

నోటా సినిమా కథ అదే

నోటా సినిమా పూర్తిగా కరప్షన్ గురించి ఉండదు. కథలో భాగంగా అవినీతి, అక్రమాలపై కథనం ఉంటుంది. ఇదంతా ఊహజనీతమైన కథ. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న అంశాలను నిజమైన రాజకీయ నేతల తీరును పాత్రల్లో జోప్పించారు. నోటా బటన్ గురించి మాట్లాడటం లేదు. రాజకీయాల్లో అనుభవం లేని ఓ యువకుడిని లాక్కెళ్లి ఎలక్షన్ నిలబడితే ఎలా డీల్ చేశాడన్నదే నోటా కథ. కొన్ని అంశాలు లీడర్, భరత్ అనే నేను సినిమాలతో పోలిక ఉంటాయి.

 కథ చెప్పినప్పుడు కనెక్ట్ అయ్యాను

కథ చెప్పినప్పుడు కనెక్ట్ అయ్యాను

నోటా సినిమా కథ విన్నప్పుడు తమిళ రాజకీయాలు తెలియవు. తెలంగాణలో పాలిటిక్స్ గురించి పట్టించుకోను. కథ విన్నప్పుడు కనెక్ట్ అయ్యాను. సినిమా షూట్ జరుగుతున్నప్పుడు నాకు రాజకీయ వ్యవస్థలోని లోపాలపై నాకు కొంత అవగాహన కలిగింది. జయలలిత డెత్ సీన్లు ఉన్నాయనేది ఓ రూమర్ మాత్రమే. నోటా చిత్రం ఏ భాషకు సంబంధించిన ప్రేక్షకుల కోసం తీసింది కాదు. ఈ సినిమా బీహార్, గుజరాత్, ఇంకా ఏ రాష్ట్రాల్లో రిలీజ్ చేసినా వర్కవుట్ అవుతుంది.

జయలలిత అవినీతి, అక్రమాలు లేవు

జయలలిత అవినీతి, అక్రమాలు లేవు

జయలలిత అవినీతి అక్రమాలు ఈ సినిమాలో చూపించలేదు. అలాంటి వార్తలపై వస్తున్న రూమర్లలో వాస్తవాలు లేవు. రూమర్లను నేను ఎంజాయ్ చేస్తాను. నోటా సినిమాను ముందుగా తెలుగులో చేద్దామనుకొందాం. కథ విన్నప్పుడు నాలుగు భాషల్లో చేయొచ్చు అనిపించింది. కానీ తమిళంలో చేస్తే బాగుంటుందనుకొన్నాం. అందుకే నాజర్, సత్యరాజ్ వాళ్లను యాడ్ చేయడం వల్ల ఇతర భాషలకు కనెక్ట్ అవుతుందని అనుకొని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాం.

 త్వరలో సొంత ప్రొడక్షన్ హౌస్

త్వరలో సొంత ప్రొడక్షన్ హౌస్

స్వయంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకొన్నాం. పెళ్లిచూపులు సమయంలో నేను, తరుణ్ భాస్కర్ కథను పట్టుకొని చాలా తిరిగాం. చాలా రిజెక్షన్‌లను చవిచూశాం. సినిమా రిలీజ్ విషయంలో చాలా కష్టాలు పడ్డాం. అలాంటి కష్టాలు నాలాంటి వాళ్లు పడకూడదని ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం నేను వింటున్న అన్ని కథలు చేయలేం. కొన్ని నచ్చిన కథలను ఔత్సాహిక నటులతో సినిమా తీయాలని అనుకొంటున్నాం. అలాంటి వారు బాధల పడకూడదు అనే ఉద్దేశంతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X