ఇంకెక్కడి సామాజిక వర్గమండి? రాంచరణ్‌తో నటించడంపై ఎన్టీఆర్.. మహేష్‌తో సినిమా..
వరుస సినిమాలు, విజయాలతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ దూసుకెళ్తున్నారు. వీరిద్దరూ కలిసి దర్శకుడు రాజమౌళి రూపొందించే మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి వివరాలు చెప్పడానికి ఎన్టీఆర్ నిరాకరించారు. అయితే రాజమౌళి సినిమాగా మాత్రం ఉంటుందని చమత్కరించారు. రాంచరణ్‌తో కలిసి నటించే విషయంలో మీ సామాజిక వర్గాల్లో నుంచి క్రేజ్ ఎలా ఉంటుందనుకొంటున్నారనే ప్రశ్నకు ఎన్టీఆర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఎన్టీఆర్ ఏమన్నారంటే..

రాంచరణ్‌తో కలిసి
రాంచరణ్‌తో సినిమా చేయడం చాలా ఉత్సాహంగా ఉంది. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం కొత్త ఒరవడికి తెర లేపుతుందని నా అభిప్రాయం. ఆయనతో బాండింగ్ మాటల్లో చెప్పలేనిది.

సామాజిక వర్గాల గురించి
మేమిద్దరం కలిసి నటిస్తే వచ్చే సామాజిక అంశాలు గురించి పట్టించుకోం. ఇంకా ఏమిటి ఈ సామాజిక వర్గం? సామాజిక వర్గం టాపిక్ అనేది విని బోర్ కొడుతున్నది. మేమిద్దరం కలిసి నటిస్తే వచ్చే క్రేజ్ డిఫరెంట్‌గా ఉండటం సాధారణమే. కానీ సామాజిక వర్గం కారణం కాదు.

చెర్రీతో సినిమాకు రాజమౌళి మార్క్
రాంచరణ్, నేను కలిసి నటించే సినిమా పక్కా రాజమౌళి సినిమాలా ఉంటుందని గ్యారెంటీగా ఉంటుందని చెప్పగలను. ఆ కథ ఏమిటి? ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్లుంది. ఇలాంటి సంగతులు నాకు తెలియదు. రాజమౌళి చెబితేనే బాగుంటుంది. ఏ జోనర్ అని చెప్పడానికి నేను కరెక్ట్ కాదు.

మహేష్, రాంచరణ్‌తో కలిసి నటించాలని
మహేష్, చరణ్, నేను కలిసి ఓ సినిమా చేయాలని మా ముగ్గురికి ఉంది. మా మధ్య అలాంటి చర్చ జరుగుతుంది. కానీ కథ కుదరాలి. మా ముగ్గురిని హ్యాండిల్ చేసే కెప్టెన్ దొరకాలి. ఎవరూ చేస్తారో క్లారిటీ లేనప్పుడు దాని గురించి ఆలోచించడం సరికాదు. అలాంటివి జరగాలంటే ఏదో మ్యాజిక్ జరగాల్సిందే.

ఎస్ఎస్ రాజమౌళి సినిమా తర్వాత
అరవింద సమేత చిత్రం తర్వాత రాజమౌళి సినిమా మాత్రమే చేతిలో ఉంది. ఆ తర్వాత ఏమిటనేది క్లారిటీ లేదు. అశ్వినీదత్‌తో సినిమా చేస్తాను. కానీ ఇంకా దాని గురించి ఎక్కువగా వివరాలు ఇవ్వలేను. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. కానీ ఇంకా ఫైనల్ కాలేదు.

జాతీయస్థాయిలో డిజిటల్ ప్రాజెక్ట్
డిజిటల్ మీడియా ప్రాధాన్యం పెరగడం శుభపరిణామం. జాతీయస్థాయిలో నెటిఫ్లిక్స్ లాంటి సంస్థలు ఏదైనా వెబ్ సిరీస్ ప్రారంభిస్తే నేను అందులో భాగం కావడానికి సిద్ధం. కానీ కథ ఏమిటి? ఎవరు చేస్తారు అనే అంశాలు అలాంటివి చేయడానికి కారణమవుతాయి.


Click it and Unblock the Notifications











