ఒంటరిగా రావాలని అన్నారు.. భయంతో పారిపోయి వచ్చేశాను.. అంకిత కామెంట్స్
4 లెటర్స్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అంకిత మహారానా.. రెండో ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమైంది. విలక్షణ నటుడు సత్య ప్రకాష్ దర్శకత్వంలో రాబోతోన్న ఊల్లాల ఊల్లాల చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది అంకిత. ఈ మూవీ విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో మీడియాతో ముచ్చటించిన అంకిత పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

కన్నడ ఇండస్ట్రీలో అలా..
తండ్రి ఉద్యోగ రిత్యా పలు రాష్ట్రాలు తిరగాల్సి వచ్చింది. పుట్టింది ఒడిస్సాలో అయినా బెల్గాంలో విద్యాభ్యాసం అయిందని చెప్పుకొచ్చింది. దాదాపు పద్దెనెమిదేళ్లు అక్కడే ఉన్నామని తెలిపింది. అయితే అక్కడ మాత్రం ఒక్క అవకాశం కూడా రాలేదని చెప్పుకొచ్చింది. కన్నడ అమ్మాయిలకు అక్కడ ప్రాధాన్యమిస్తారని పేర్కొంది.

ఒంటరిగా రావాలన్నారు..
అయితే తనకు నటన మీద ఆసక్తి ఉండటంతో.. ఆఫీస్‌ల చుట్టు తిరిగానని చెప్పుకొచ్చింది. ఎక్కడి వెళ్లినా తన నాన్నను తీసుకెళ్లేదాన్ని అని తెలిపింది. ఇలా అందర్నీ తీసుకురావద్దు.. ఒంటరిగా రావాలని అనేవారు.. దీంతో భయమేసి అక్కడి నుంచి పారిపోయి ఇక్కడకు వచ్చానని అంది.

తనను స్టార్‌లా ట్రీట్ చేసేవారు..
టాలీవుడ్ మాత్రం అలా కాదని, ఇక్కడ చాలా బాగుందని చెప్పుకొచ్చింది. సత్య ప్రకాష్ తనను ఓ స్టార్‌లా ట్రీట్ చేసేవారని తెలిపింది. తనను బుజ్జగించేవారని పేర్కొంది. తనకు ఇప్పటి వరకు పూర్తి కథ తెలియదని, తన పాత్ర వరకు తెలుసునని, ఏ అవకాశం వచ్చినా దాన్ని బాగా చేయడమే తనకు తెలుసని చెప్పుకొచ్చింది. ఈ ఫీల్డ్‌లోకి రావాలని డిసైడ్ అయినప్పుడే రొమాంటిక్ సీన్స్ చేయాల్సి వస్తుందని తెలుసని, అయితే ఏది చేసినా అందరూ మెచ్చుకునేలా ఉండాలని తెలిపింది.

అమ్మను వెంటపెట్టుకుని వెళ్లు..
కన్నడలో ఒంటరిగా రావాలని అన్నారు.. కానీ సత్య ప్రకాష్ మాత్రం.. ఎక్కడికి వెళ్లినా ఎవరినో ఒకరిని వెంటబెట్టుకుని వెళ్లమని సలహా ఇచ్చారని అంది. అందుకే తాను ఎక్కడికి వెళ్లినా అమ్మను వెంట బెట్టుకుని వెళ్తానని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











