సైకో ఎవరో కనిపెడితే.. 1000 మందికి సిల్వర్ కాయిన్స్ గిఫ్ట్.. ఆపరేషన్ రావణ దర్శకుడు ఛాలెంజ్!
రామాయణంలోని కొన్ని పాయింట్లను తీసుకొని రూపొందిన చిత్రం ఆపరేషన్ రావణ. ఈ సినిమాలో గరుడ్మంతుడు, రావణుడు, గుహుడు లాంటి పాత్రల స్పూర్తి, ప్రేరణతో కథను రాసుకొన్నామని దర్శకుడు వెంకట సత్య తెలిపారు. తన కుమారుడు రక్షిత్ అట్లూరి హీరోగా రూపొందిన ఆపరేషన్ రాణ చిత్రం జూలై 26వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో, సంగీర్తన్ విపిన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అవుతున్న క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు వెంకట సత్య మీడియాతో మాట్లాడుతూ..
నేను వ్యాపార రంగం నుంచి వచ్చాను. స్వీట్ బిజినెస్ ఉంది. సినిమా ఆర్ట్ ఫామ్. ఒకరికి నచ్చింది. మరొకరికి నచ్చదు. వ్యాపారంలో సలహాలు, సూచనలు ఇచ్చేవారు ఉంటారు. కానీ సినిమా రంగంలో అలాంటి సపోర్ట్ ఉండదు. ఎవరైనా సపోర్ట్ చేస్తే.. వాళ్లతో ఎలాంటి కష్టాలు ఉంటాయో.. వాళ్లు ఎక్కడికి తీసుకెళ్తారో నా కంటే మీకే బాగా తెలుసు అని ఆయన సెటైర్ వేశారు. సినిమా తీయడం కంటే దాన్ని రిలీజ్ చేయడమే పెద్ద టాస్క్ అని అన్నారు.

పురాణాల్లో మంచి విషయాలు చాలా ఉన్నాయి. మన ఆలోచనలే మన శత్రవులు అనే విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. ఆలోచనలు చెడు మార్గంలో వెళ్లకుండా యోగా, ధ్యానం కంట్రోల్ చేస్తుంటాయి. డ్రగ్స్, భూ కబ్జాలు ఇలాంటి చట్ట వ్యతిరేక పనులను తెరపైన చూపించబోతున్నాం. ఈ సినిమాలోని పాయింట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి అని అభిప్రాయపడ్డారు.
రామయణంలో మనకు తెలిసిన అంశాలను ఆధారంగా ఈ సినిమాను రూపొందించాం. రావణుడు మారు వేషంలో వచ్చి సీతను ఎత్తుకెళ్తాడు. ఆపరేషన్ రావణలో మాస్క్ పెట్టుకొని వస్తాడు. అందుకే ఈ సినిమాకు ఆ పేరు పెట్టాం అని తెలిపారు. ఓ వ్యక్తి సైకోగా ఎందుకు మారుతాడు అనే విషయాన్ని చాలా ఎమోషనల్‌గా చెబుతున్నాం అని అన్నారు.

నా కొడుకు రక్షిత్‌ను డైరెక్ట్ చేయడమనే విషయం నాపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఫైట్స్ చేసేటప్పుడు మాత్రం గాయాలు అవుతాయేమోనని తండ్రిగా భయపడ్డాను. కొన్ని జాగ్రత్తలు చెప్పి ఫైట్స్ చేయించాను. అయితే యాక్షన్ సీన్లు చేసేటప్పుడు ఫైట్ మాస్టర్ నన్ను అక్కడి నుంచి పంపించేశారు అని వెంకట సత్య చెప్పారు.
ఆపరేషన్ రావణను వందల కోట్లతో సినిమా చేసేవారున్నారు. మేము నాలుగైదు కోట్ల రూపాయలతో మూవీ పూర్తి చేశాం. టెక్నికల్‌గా అన్ని క్రాఫ్టులు బాగా వచ్చేలా చూసుకున్నాం. మా సినిమా ప్రారంభమైన గంటలోపు సైకో ఎవరన్నది కనిపెడితే ఆ ప్రేక్షకుడికి సిల్వర్ కాయిన్ ఇస్తామని ప్రకటించాం. అలా వెయ్యిమందికి సిల్వర్ కాయిన్ ఇవ్వబోతున్నాం అని వెంకట సత్య తెలిపారు.


Click it and Unblock the Notifications











