పోర్న్‌స్టార్ అని ట్రోల్.. రాత్రంతా ఏడ్చాను.. పాయల్ రాజ్‌పుత్
ఆర్ ఎక్స్ 100 తరువాత ఏడాది గ్యాప్ తో వస్తున్న నా రెండో చిత్రమిది.. నా కోసం నా ఫ్యాన్స్ ఎంతో మంది ఎదురుచూస్తున్నారు.. నన్ను అందరూ ప్రిన్సెస్ లా చూస్తున్నారు ఆ మూవీ తరువాత.. ఆర్డీఎక్స్ 100 స్క్రిప్ట్ బాగుందని, కథ డిఫరెంట్ గా ఉండటంతో ఒప్పుకున్నా.. బోల్డ్ కంటెంట్.. బోల్డ్ డైలాగ్.. మొదటి సారి విన్నప్పుడే కథ బాగుందని పించింది. ఇాలాంటివి నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని పాయల్ అన్నారు.

ఆర్ ఎక్స్ 100 బాలీవుడ్ రీమేక్లో..
ఆర్ ఎక్స్ 100 బాలీవుడ్ రీమేక్‌లో నన్ను తీసుకోలేదు. ఈ సినిమా ఇంత సక్సెస్ అయ్యాక సాజిద్ నదియావాలా పిలిచాడు. సినిమాలో బాగా నటించావు. అని చెప్పాడు. అయితే నేను మాత్రం అవకాశమివ్వమని అడగలేదు. వారికున్న రిలేషన్ షిప్, కమిట్ మెంట్‌తో తారా సుతారియాను ఎంచుకున్నారు. దాని గురించి నాకు బాధలేదు. మనకు అని రాసి పెట్టి ఉంటే అది మనకే వస్తుంది అని పాయల్ పేర్కొన్నారు.

కరీనా కపూర్‌లా చేసేదాన్ని
నాకు కరీనా కపూర్ అంటే ఇష్టం. బాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఏం వచ్చని అడిగితే కరీనా కపూర్‌లో నటిస్తానని చెప్పేదాన్నంటూ అప్పటి సంగతులను గుర్తుచేసుకుంది. హిందీలో మూడు సీరియల్స్ చేశానని, దాపు ఆరేళ్లు కష్టడ్డానంటూ చెప్పుకొచ్చింది అని పాయల్ చెప్పారు.

హాట్ ఐపీఎస్..
RX 100 వల్ల రొమాంటిక్ పాత్రే చేసినా.. ప్రస్తుతం నేను ఐపీఎస్ ఆఫీసర్‌గా ఓ చిత్రాన్ని చేస్తున్నాను.. అయితే ఆమె హాట్ ఐపీఎస్ ఆఫీసర్ అంటూ చెప్పుకొచ్చింది. ఓ కాలేజ్లో షూటింగ్ జరుగుతుండగా ఎవరో వీడియో తీసి టిక్ టాక్‌లో పెట్టారు.. అది చాలా బాగుంది. అందరూ హాట్ ఐపీఎస్ అంటూ కామెంట్లు పెడుతున్నారని చెప్పింది. ఈ మూవీ కోసం మేకప్ లేకుండా రగ్డ్ లుక్‌లోనే ఉంటున్నాని, మాటలు, చేష్టలన్నీ వేరేలా ఉంటాయని తెలిపింది.

రాత్రంతా ఏడ్చుకుంటూనే ఉన్నా.. పోర్న్ స్టార్ అంటూ కామెంట్లు..
సోషల్ మీడియాలో నాపై బ్యాడ్ కామెంట్సే వస్తుంటాయి. RDX లవ్ టీజర్ రిలీజ్ అయ్యాక అవి మరింత ఎక్కువయ్యాయి. ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే కూర్చున్నా.. సోషల్ మీడియాలో అందరూ నన్ను పోర్న్ స్టార్, సిల్క్ స్మిత అంటూ కామెంట్లు పెట్టారు. నేను అంత పెద్ద తప్పు ఏం చేశానని అనుకున్నానంటూ పాయల్ తన బాధను వెల్లడించింది


Click it and Unblock the Notifications











