ఫుష్ప మూవీతో పోలికలు ఉండవు.. నరకాసుర మూవీ ఓ ఎమోషనల్ డ్రైవ్.. రక్షిత్ అట్లూరి (ఇంటర్వ్యూ)

పలాస సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్న యువ హీరో రక్షిత్ అట్లూరి నటించిన తాజా చిత్రం నరకాసుర. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 3వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు జోష్‌తో ముందుకు సాగుతున్నాయి. ఈ చిత్రంలో అపర్ణ జనార్ధన్, సంకీర్తన విపిన్ హీరోయిన్లుగా నటించగా, నాజర్, చరణ్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సెబాసట్ియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ..

నరకాసుర చిత్రం తమిళనాడు, ఆంధ్రా సరిహద్దులోని కేరళ కాఫీ ఎస్టేట్‌లో జరిగే సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమాలో నేను లారీ డ్రౌవర్‌గా నటించాను. పలాసలో దళిత పాయింట్‌తో తెరకెక్కించినట్టే.. ఈ సినిమాలో హిజ్రాలకు సంబంధించిన ఓ ఎమోషనల్ పాయింట్‌తో సినిమాను రూపొందించాం. అయితే ఈ సినిమా హిజ్రాలు, ట్రాన్స్ జెండర్ల సినిమా కాదు. ఓ ఎమోషనల్ పాయింట్‌గానే తీసుకొన్నాం అని రక్షిత్ అట్లూరి అన్నాడు.

 Palasa fame Rakshit Atluri Interview about Narakasura: Its not related to Pushpa Story

నరకాసుర టైటిల్ చూసి పౌరాణికం నేపథ్యమని అనుకోవద్దు. అలాంటి అంశాలేమీ ఉండవు. ఓ రాక్షసుడిని చంపాలంటే.. మనం కూడా అంతకంటే చెడ్డగా ఉండాలి అనే పాయింట్‌గా టైటిల్ పెట్టాం. తప్పకుండా ఈ సినిమా ప్రతీ ఒక్కరిని ఆలరిస్తుంది. ఈ వారం సినిమాల పోటీ ఉంది. కానీ ఇంతకంటే మంచి రిలీజ్ డేట్ మా సినిమాకు ఉండదని భావిస్తున్నాం అని రక్షిత్ అట్లూరి చెప్పాడు.

 Palasa fame Rakshit Atluri Interview about Narakasura: Its not related to Pushpa Story

పలాస సినిమా తర్వాత నరకాసుర కథ మా వద్దకు వచ్చింది. ఏడాదిలో పూర్తి చేయాలని అనుకొన్నాం. కానీ కరోనా లాక్‌డౌన్, ఆ తర్వాత ఆర్టిస్టుల డేట్స్ వల్ల షూటింగ్‌లో జాప్యం జరిగింది. ఆ తర్వాత మా డైరెక్టర్‌కు మేజర్ యాక్సిడెంట్ జరిగి ఒక చేయి కోల్పోయాడు. కానీ ఆయన కోలుకొని తిరిగి సెట్స్‌కు వచ్చిన తీరు మా అందరికీ స్పూర్తిని కలిగించింది. క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చిత్రీకరించాం అని రక్షిత్ అట్లూరి అన్నాడు.

 Palasa fame Rakshit Atluri Interview about Narakasura: Its not related to Pushpa Story

నరకాసుర సినిమాను చాలా ప్రతికూల పరిస్థితుల మధ్య షూట్ చేశాం. మధ్య ప్రదేశ్‌లో చాలా చలి ఎక్కువ. అలాంటి ప్రాంతంలో లాంగ్ యాక్షన్ సీన్లను షూట్ చేశాం. చలితోపాటు వర్షం ఎఫెక్ట్‌లో ఫైట్ చేశాం. ఇవన్నీ అప్పుడు కష్టం అనిపించినా.. ప్రస్తుతం అవుట్‌పుట్ చూస్తే మంచి ఫీలింగ్ కలుగుతున్నది. లారీ డ్రైవర్ అనగానే ఫుష్ప గుర్తుకు వస్తుంది. కానీ ఆ సినిమాతో పోలీకలు ఉన్నాయా? అంటే లేవనే చెబుతాను అని రక్షిత్ అట్లూరి అన్నాడు.

 Palasa fame Rakshit Atluri Interview about Narakasura: Its not related to Pushpa Story

పలాస సినిమాలో నాకు మంచి నటుడు అనే పేరు వచ్చింది. నటుడిగానే గుర్తింపు పొందుతూ మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని అనుకొంటున్నాను. పలాస ఇచ్చిన గుర్తింపును కాపాడుకొంటూ మంచి సినిమాలు చేస్తాను. పలాస తర్వాత నాకు మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ సినిమాలోని గెటప్ కారణంగా నేను మంచి సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది అని రక్షిత్ అట్లూరి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X