సాయిధరమ్ తేజ్ ఐఏఎస్‌గా.. నేను ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా.. అన్నయ్య హెల్త్ ఎలా అంటే.. వైష్ణవ్ తేజ్

ఉప్పెన బ్లాక్ బస్టర్ తర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్ రెండో చిత్రంతో ఆకట్టుకొనేందుకు సిద్దమయ్యారు. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న కొండ పొలం సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ మీద జే సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 8న రిలీజైంది. ఈ నేపథ్యంలో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ..

Panja Vaisshnav Tej about his character in Konda Polam

కొండపొలం అనే అంశమే కొత్తది. నేను ఎప్పుడూ వినలేదు. క్రిష్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. కొండపొలం సినిమా కథ క్రిష్ చెప్పినప్పుడు ఉప్పెన విడుదల కాలేదు. ఆయన తీసిన వేదం, గమ్యం నాకు చాలా ఇష్టం. నన్ను క్రిష్ గారు సంప్రదించడంతో ఎంతో సంతోషంగా ఫీలయ్యాను. అందుకే ఈ సినిమా కథను ఓకే చేశాను. మొదటగా క్రిష్ ఫోన్ చేసినప్పుడు సినిమా కోసం కాదని అనుకున్నా. ఏదో విషయం గురించి రమ్మని అన్నారని అనుకున్నా. కానీ సినిమా కథ చెబితే థ్రిల్ అయ్యా. హరిహర వీరమల్లు తర్వాత ఉంటుందేమో అనుకున్నా. కానీ వెంటనే ప్రారంభిస్తున్నామని చెప్పడంతో హ్యాపీగా ఫీలయ్యాను అని వైష్ణవ్ పేర్కొన్నారు.

ఏమీ లేని స్థాయి నుంచి ఎన్నో కష్టాలను దాటుకుని ఎంతో ఎత్తుకు ఎదగడమే కొండపొలం కథ. అడవితో ప్రేమలో పడతాడు. అడవిలాంటి అమ్మాయి ఓబులమ్మ. ఇది చాలా కొత్త కథ. పెద్ద హీరోల సినిమాలు చూసినప్పుడు నాకు కూడా అలాంటి కథలు చేయాలనిపిస్తుంది అని వైష్ణవ్ తేజ్ పేర్కొన్నారు.

కరోనా సమయంలో ఇంట్లోనే ఉండ‌టం వ‌ల్ల వెంట‌నే షూటింగ్ చేయడం మరీ అంత కష్టంగా ఏమీ అనిపించలేదు. కొండలు ఎక్కేవాళ్లం, రెండు మూడు కిలోమీటర్లు నడిచేవాళ్లం. అదేం పెద్ద కష్టంగా అనిపించలేదు అని వైష్ణవ్ తేజ్ తెలిపారు.

కొండపొలంలో అందరూ సీనియర్స్ నటించారు. అందరి దగ్గరి నుంచి చాలా నేర్చుకోవచ్చని అనుకున్నాను. వారు డైలాగ్స్‌ను ఇట్టే చెప్పేసేవారు. నాకు చాలా టెన్షన్‌గా అనిపించేది. కోట గారు ఆ వయసులో వచ్చి నటించడం చాలా గ్రేట్ అనిపించింది. ఆయన వచ్చినప్పుడు మాత్రం అందరం మాస్కులు పెట్టేసుకునేవాళ్లం. సాయి చంద్ గారు ఎప్పుడూ ఎంతో ఎనర్జీగా ఉండేవారు. అంతే ఎనర్జీగా నటించేవారు.

ఎంతో అదృష్టం చేసుకుని ఉంటాను. అందుకే కీరవాణితో పని చేయగలిగాను. ఆయన కుమారుడు కాళ భైరవ నాకు స్నేహితుడు. కీరవాణి గారిని చూసినా, మాట్లాడినా మా కాళ భైరవ గుర్తుకు వస్తాడు. నా రెండో సినిమాకే ఆయనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది.

రిపబ్లిక్ చిత్రంలో అన్నయ్య సాయిధరమ్ తేజ్ ఐఏఎస్‌గా, నేను కొండ పొలం చిత్రంలో ఐఎఫ్ఎస్. కానీ రిపబ్లిక్, కొండపొలం సినిమాకు సంబంధం ఉండదు. అన్నయ్య (సాయి ధరమ్ తేజ్) బాగున్నారు. త్వరగా కోలుకుంటున్నారు. ఇప్పుడు ఫిజియోథెరపీ జరుగుతోంది. తొందర్లనే బయటకు వస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X