Gummadi Narasaiah Biopic: నిష్కళంక నేత గొంతు మూగబోతే.. ఎంత నష్టమో.. ఆ కథే చెప్పబోతున్నాం.. దర్శకుడు పరమేశ్
(ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ)
ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గుమ్మడి నర్సయ్య జీవితం వెండితెరపైన ఆవిష్కరించబోతున్నది. నాలుగు దశాబ్దాల జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పకుండా.. కనీసం సొంత ఆస్తులు కూడబెట్టుకోకుండా జీవించిన ప్రజా నాయకుడి జీవితాన్ని సినిమాగా రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతన్నాయి. ఈ చిత్రాన్ని యువ నటుడు, దర్శకుడు పరమేశ్ రూపొందిస్తన్నారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించిన పలు విషయాలను దర్శకుడు పరమేశ్ పంచుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
నాకు రాజకీయాలపై పెద్దగా అవగాహన లేదు. రాజకీయ నేతల గురించి సరైన ఒపీనియన్ లేదు. అవినీతిమయమైన రాజకీయాలను దేశం నుంచి పాలద్రోలే విషయంపై నేను ఆలోచనల్లో పడ్డాను. అలాంటి పరిస్థితుల్లో దేశ రాజకీయాలను మార్చే కథ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడే ఐదుసార్లు ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గురించి ఆర్టికల్ చదివాను అని దర్శకుడు పరమేశ్ తెలిపారు.

అందుకే పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నేతల చరిత్ర పుస్తకాల్లో నిక్షిప్తమయ్యాయి. కానీ గుమ్మడి నర్సయ్య జీవితాన్ని చరిత్ర పుటల్లోకి ఎక్కించాలనే లక్ష్యంతో ముందుకెళ్లాను. సీపీఎం పార్టీ, ఆయన అనుమతి తీసుకొని ఆయన జీవిత కథ గురించి, ఆయన జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలను శోధించడం మొదలుపెట్టడం మొదలుపెట్టాను అని దర్శకుడు పరమేశ్ తెలిపారు.
1983లో చరిత్రలో నిలిచిపోయే సంఘటనలు చోటుచేసుకొన్నాయి. ఇండియాకు క్రికెట్‌లో వరల్డ్ కప్ వచ్చింది. మహానటుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి హిస్టరీ తిరగరాశారు. ఈ సమయంలో రాష్టమంతటా తెలుగు దేశం ప్రభంజనం వీచినా.. ఇల్లెందు నియోజకవర్గంలో గుమ్మడి నర్సయ్య విజయం సాధించారు. ఆ ప్రాంత ప్రజల గొంతుకను అప్పటి నుంచి వినిపించడం మొదలుపెట్టారు. అలాంటి వ్యక్తి జీవితం గురించి తెలుసుకొంటే ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి.
గుమ్మడి నర్సయ్య లాంటి నాయకుడి జీవితాన్ని ప్రజలకు స్పూర్తిదాయకంగా అందించబోతున్నాం. ఇలాంటి నాయకుడి గురించి ప్రజలకు చెప్పే అవకాశం అందరికి రాదు. ఒక విద్యావంతుడు, ప్రతిభావంతులు మౌనం దాల్చితే దేశానికి ఎంత నష్టం జరుగుతుందో చెప్పాలి. కోట్లాది మంది గురించి ఆలోచించే వ్యక్తి మూగబోతే ఎంత నష్టమో చెప్పబోతున్నాం. ఈ సినిమా ద్వారా మార్పు వస్తుందో లేదో చెప్పలేం కానీ.. ప్రజల్లో ఒకరకమైన ఆలోచనను రేకెత్తించాలనే ప్రయత్నమే గుమ్మడి నర్సయ్య బయోపిక్ అని పరమేశ్ ఎమోషనల్ అయ్యారు.
గుమ్మడి నర్సయ్య గురించి 2 సంవత్సరాలు రిసెర్చ్ చేశాం. ఈ పరిశోధనలో సంచలన విషయాలు తెలుసుకొన్నాం. ఎన్నో ఎమోషనల్ విషయాలు చాలా స్పూర్తిని కలిగించాయి. స్క్రిప్టు అంతా సిద్దంగా ఉంది. త్వరలోనే సినిమా స్టార్ట్ చేస్తాను. దేశంలోనే టాప్ యాక్టర్‌ను సెలెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆయనతో చర్చలు జరుగుతున్నాయి అని దర్శకుడు పరమేశ్ వెల్లడించారు.
గుమ్మడి నర్సయ్య బయోపిక్‌లో ప్రతిభావంతులైన నటీనటులను ఎంపిక చేస్తున్నాం. ఈ సినిమా గురించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం అని పరమేష్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











