Balakrishna: బాలకృష్ణలో వచ్చిన ఈ బాడీ లాంగ్వేజీ గుర్తించారా?: పరుచూరి గోపాలకృష్ణ
Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. అయితే ఇటీవలే విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ కు అనూహ్య స్పందన వచ్చింది. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సినీ పెద్దలు కూడా ఈ ట్రైలర్ బాగుందని కితాబు ఇస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రముఖ రైటర్ పరుచూరి గోపాల కృష్ణ.. బాలకృష్ణ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. సినిమా అద్భుతంగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే అర్థం అయిందని అన్నారు.
2 నిమిషాలకు పైగా ఉన్న భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ చూస్తుంటే.. అనిల్ రావిపూడి టాలెంట్ తెలిసిపోతుందని పరుచూరి గోపాల కృష్ణ వెల్లడించారు. ఏ హీరోది అయినా ఓ సినిమా విజయం సాధిస్తే దాని తర్వాత వచ్చే సినిమా గురించి హీరోలు, దర్శకులు చాలా టెన్షన్ పడుతుంటారని.. కానీ ఇక్కడ మాత్రం అటు బాలకృష్ణ కానీ ఇటు అనిల్ రావిపూడి కానీ ఏమాత్రం బెరుకు లేకుండా కనిపించడం సినిమాపై వారికి ఉన్న నమ్మకం అంటూ చెప్పుకొచ్చారు. అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాల తర్వాత రాబోతున్న ఈ భగవంత్ కేసరి కూడా అదే రేంజ్ లో హిట్టయ్యే ఛాన్స్ ఉందన్నారు.

డైలాగ్ డెలివరీతో పాటు బాడీ లాంగ్వేజీలో మార్పు
అఖండ సినిమా తర్వాత నుంచి బాలకృష్ణను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే.. ఆయన బాడీ లాంగ్వేజీలో మార్పు వచ్చినట్లు గమనించవచ్చన్నారు. డైలాగ్ డెలివరీలో కూడా చాలా మార్పు కనిపిస్తుందని పరుచూరి గోపాల కృష్ణ తెలిపారు. భగవంత్ కేసరి బాలకృష్ణకు సరిగ్గా సరిపోయే కథ అని, ట్రైలర్ చూస్తుంటే ఇది తండ్రీ కూతుళ్ల సినిమాలా అనిపిస్తోందన్నారు. కూతురిని కాపాడుకునేందుకు తండ్రి పడే తపనను బాలకృష్ణలో చూపించారన్నారు. అలాగే బిడ్డ ముందు నిలబడితే వంద దేవుళ్ల లెక్క అంటూ చెప్పే డైలాగులు కూడా చాలా బాగున్నాయన్నారు.
అక్టోబర్ 19వ తేదీన విజయ దశమి కానుకగా రాబోతున్న భగవంత్ కేసరి చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రంగా మారుతుందని తాను భావిస్తున్నట్లు పరుచూరి గోపాల కృష్ణ స్పష్టం చేశారు. అలాగే సినిమా సూపర్ డూపర్ హిట్టై బాలయ్య అభిమానులకు పండుగ తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే శ్రీలీల, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారా బడ్జెట్ తో నిర్మిస్తున్న భగవంత్ కేసరి చిత్రంలో నటుడు శరత్ కుమార్ కూడా నటించారు. బాలకృష్ణ సోదరుడి పాత్రలో శరత్ కుమార్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే నార్త్ ఇండియన్ బ్యూటీ పాలక్ లల్వానీకి కూడా ఈ సినిమాలో కీలక పాత్ర దక్కించుకుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











