బోల్డ్ కంటెంట్‌తో మళ్లీ పెళ్లి.. ఎవరిని టార్గెట్ చేశామా అంటే.. పవిత్రా లోకేష్ (ఇంటర్వ్యూ)
ప్రతిష్టాత్మక విజయ్ కృష్ణ బ్యానర్‌పై వీకే నరేష్ నిర్మాతగా, ప్రముఖ దర్శక, నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ చిత్రంలో పవిత్రా లోకేష్, వీకే నరేష్ కలిసి నటించడం సెన్సేషనల్‌గా మారింది. ఈ సినిమాకు టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో జయసుధ, శరత్ బాబు, అన్నపూర్ణ తదితరులు నటించారు. మే 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నటి పవిత్రా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. .
నాది హీరోయిన్ పాత్రే: కన్నడలో లీడ్ రోల్స్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాను. తెలుగులో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా వర్క్ చేస్తున్నాను. నా వద్దకు వచ్చే, నాకు నచ్చే క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చాను. మంచి పాత్రల కోసమే వెయిట్ చేస్తే ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. నా వద్దకు వచ్చే క్యారెక్టర్లలో నాకు మంచివి అనిపించినవి చేస్తున్నాను. మళ్లీ పెళ్లి సినిమా విషయానికి వస్తే..చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. హీరో, హీరోయిన్లు అనుకొంటే.. నాది హీరోయిన్ పాత్రే అనుకోవచ్చు అని పవిత్రా లోకేష్ అన్నారు.

సమాజంలో జరిగే సంఘటనలతో: మళ్లీ పెళ్లి కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలోని పాత్రలు సమాజంలోని చాలా మంది జీవితానికి దగ్గరగా ఉంటాయి. సమాజంలో అలాంటి సమస్యలతో జీవితం సాగించే వారికి ఈ సినిమాలోని పాత్రలు కనెక్ట్ అవుతాయి. ఈ సినిమా కూడా కనెక్ట్ అవుతుంది. మా జీవితానికి సంబంధించిన బయోపిక్ కాదు. మా జీవితంలో జరిగిన సంఘటనలకు సన్నివేశాలు దగ్గరగా ఉంటాయి. య్యూట్యూబ్‌లో ఉండే విజువల్స్ స్పూర్తిగా ఈ సినిమా రూపొందింది అని పవిత్రా లోకేష్ చెప్పారు.

మళ్లీ పెళ్లి ఎలా సాధ్యమైందంటే?: దర్శకుడు ఎంఎస్ రాజు కథ తీసుకొని మా వద్దకు వచ్చారు. కథ చెప్పినప్పుడు మాకు బాగా నచ్చింది. అయితే మేమిద్దరం (నరేష్, నేను) చేస్తేనే ఈ సినిమా చేస్తానని ఆయన చెప్పారు. మాలో ఏ ఒక్కరు చేయకపోయినా సినిమా చేయనని ఆయన చెప్పారు. ఆయన నిర్మాతగానే నాకు తెలుసు. ఆయన తీసిన డర్టీ హరి సినిమా చూడలేదు. ఈ కథ చెప్పినప్పుడు ఆయన దర్శకుడనే విషయం నాకు తెలిసింది. ఆయన మైండ్ ఎప్పుడూ యూత్‌గా ఉంటుంది. ఆయన ఆలోచనలు ట్రెండింగ్‌గా ఉంటాయి అని పవిత్రా లోకేష్ చెప్పారు.

వాస్తవ సంఘటనలా? కల్పితమా?: ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని సందర్భాల్లో చాలా ధైర్యంగా, నిజాయితీగా నిర్ణయాలు తీసుకొంటారు. ఒక పరిధి దాటి నిర్ణయాలు తీసుకొంటే దానిని కూడా బోల్డ్ అంటారు. అలానే ఈ సినిమాలో కూడా కంటెంట్ చాలా బోల్డ్‌గా ఉంటుంది.
ఈ సినిమా వాస్తవ సంఘటనలా? కల్పితమా అనేది నేను చెప్పలేను. అయితే ప్రతీ ఒక్కరి జీవితంలో సెకండాఫ్ బాగుండాలనే కోరిక ఉంటుంది. అలాంటి కంటెంట్ ఈ సినిమాలో ఉంటుంది. ఈ సినిమా ఒకరిని టార్గెట్ చేయడానికి తీసిన సినిమా కాదు అని పవిత్ర లోకేష్ చెప్పారు.

మా జీవితాల్లో సంఘటనల ఆధారంగా: మా (నరేష్, నా) జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా మళ్లీ పెళ్లి కథ రాశారనుకొంటే.. మాకు అభ్యంతరం లేదు. దర్శకుడు ఎంఎస్ రాజు కూడా అదే కోరుకొంటున్నారు. ఎవరైనా ఊహించుకొని వచ్చి సినిమా చూసినా.. వారికి సంతృప్తిని కలిగించే అంశాలను ఎంఎస్ రాజు రాసుకొన్నారు. ఎంఎస్ రాజు కంటెంట్‌తో కన్విన్స్ చేసిన విధానం బాగుంది. థియేటర్లలో తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది అని పవిత్రా లోకేష్ చెప్పారు.


Click it and Unblock the Notifications











