ఆ సమయంలో సూసైడ్ చేసుకోవాలనుకొన్నా.. ఆయనే లేకపోతే.. పవిత్రా లోకేష్
నటుడు వీకే నరేష్‌తో రిలేషన్‌షిప్ కారణంగా పవిత్ర నరేష్‌కు మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. తెర మీద వీరిద్దరి కనిపిస్తే మంచి రెస్సాన్స్ ప్రేక్షకుల్లో కలిగించింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వీకే నరేష్, పవిత్రా లోకేష్ నటించిన మళ్లీ పెళ్లి చిత్రం వస్తుండటంతో మరింత క్రేజీగా మారింది. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 26వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మీ బీట్‌తో మాట్లాడుతూ..
వీకే నరేష్ తీసుకొనే నిర్ణయాల్లో నేను భాగమై ఉన్నాను. ఒక ముందు కూడా ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకొన్నా.. వాటితో ముందుకెళ్తాను. ఆయన కోసం సమయం కేటాయిస్తున్నాను. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకొంటూ సినిమాలు చేస్తాను. మంచి పాత్రలు కోసం ఎదురు చూస్తున్నాను. ఒకరకమైన పాత్రలు చేయకుండా జాగ్రత్తలు తీసుకొంటాను అని పవిత్రా లోకేష్ అన్నారు.

వీకే నరేష్ నాకు చాలా విలువ ఇస్తారు. నా మనోభావాలను గౌరవిస్తారు. ఏదైనా సీరియస్ విషయాన్ని తేలికగా తీసుకొని దానికి పరిష్కారం ఆలోచిస్తారు. ఈ రోజు హ్యాపీగా ఉన్నామా? లేదా అేనేది ముఖ్యం అంటారు. చాలా పాజిటివ్ పర్సన్. ప్రతీ ఒక్కరిని చాలా బాగా చూసుకొంటారు. నన్ను బాగా చూసుకొంటారు. ఒక మహిళగా అంతకంటే ఎక్కువగా ఏం కోరుకొంటాను అని పవిత్రా లోకేష్ చెప్పారు.
నా జీవితంలో జరిగిన సంఘటనల నుంచి బయటపడటానికి చాలా కష్టపడ్డాను. కొంత మంది నా క్యారెక్టర్‌ను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించారు. నాకు ఎదురైన సమస్యల వల్ల సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి పరిస్థితుల వల్ల నేను బయటపడ్డానంటే అందుకు కారణం వీకే నరేష్ అని పవిత్ర లోకేష్ చెప్పారు.

నా జీవితంలో చోటు చేసుకొన్న సమస్యలు చాలా దారుణం. నా జీవితం పూర్తిగా నాశనం అయిపొందని అనుకొన్నాను. పూర్తిగా నాశనమైన జీవితాన్ని సరిద్దిద్దుకొనేందుకు పెద్ద సాహసం చేశాను. మెఅల్లమెల్లగా ఒక్కో పరిస్థితిని మెరుగు పరుచుకొంటూ ఎదుగుతున్న సమయంలో వీకే నరేష్‌తో పరిచయం అయింది. అక్కడ నుంచి నా జీవితం పాజిటివ్‌గా మారిపోయింది అని పవిత్రా లోకేష్ చెప్పారు.
మా జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా మళ్లీ పెళ్లి కథ రాశారనుకొంటే.. మాకు అభ్యంతరం లేదు. దర్శకుడు ఎంఎస్ రాజు కూడా అదే కోరుకొంటున్నారు. ఎవరైనా ఊహించుకొని వచ్చి సినిమా చూసినా.. వారికి సంతృప్తిని కలిగించే అంశాలను ఎంఎస్ రాజు రాసుకొన్నారు. ఎంఎస్ రాజు కంటెంట్‌తో కన్విన్స్ చేసిన విధానం బాగుంది. థియేటర్లలో తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది అని పవిత్రా లోకేష్ చెప్పారు.


Click it and Unblock the Notifications











