Renu Desai: అకీరా హీరో కాడు... తేల్చిచెప్పిన రేణు దేశాయ్.. కానీ అలా చూడాలందంటూ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్.. హీరోగా ఎంట్రీ ఇస్తే బాగుండు అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ వారసుడిగా అకీరాను స్క్రీన్ పై చూడాలని చాలా మంది ఆశపడుతున్నారు. అయితే ఇప్పటికే రేణు దేశాయ్.. తన కుమారుడు హీరో కాడంటూ చెప్పుకువచ్చింది. ఇక తాజగా టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె... తన కుమారుడు అకీరా నందన్ ను అలా చూడాలంటూ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే....

మాస్ మహారాజ రవితేజ హీరోగా తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర రావు. ఇక ఈ సినిమా అక్టోబర్ 20 న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో హేమలత లవణం అనే స్ట్రాంగ్ మహిళ క్యారెక్టర్ లో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టిన మేకర్స్.. ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ.. ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

Pawan Kalyan Ex Wife Renu Desai Comments on Her Son Akira Nandan

ఇక ఈ ఇంటర్వ్యలో తన కుమారుడు అకీరా నందన్ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేశారు. సినిమాల్లోకి హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వనున్నారు అని అడగ్గా.. దానికి రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పటికే రేణు దేశాయ్ తన కుమారుడు అకీరా సినిమాల్లోకి రాడు అంటూ చెప్పుకువచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ ప్రమోషన్స్ లో కూడా తన కుమారుడు అకీరా నందన్ హీరో అవ్వడు అని తేల్చి చెప్పింది. అతనికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు... అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇక అకీరా నందన్ ను మీరు ఎలా చాడాలనుకుంటున్నారు అని మీడియా ప్రతినిధులు అడగ్గా... అకీరాను ఓ పెద్ద స్టేడియంలో కొన్ని వందల మంది ముందు పియానో వాయిస్తుంటే.. చూడాలని ఉందంటూ రేణు దేశాయ్ చెప్పుకువచ్చింది. ఇక తన తల్లి అయినా నాకు నా కొడుకును స్క్రీన్ మీద చూడాలి అని ఉంటుంది. ఎందుకంటే నేను నటినే, అతని తండ్రి నటుడే.. ఇక ఎవరికైనా అతను నటుడు కావాలను కుంటారు. కానీ నేను నటుడు కావాలని ఫోర్స్ చేయను. అతనికి అనిపించాలంటూ చెప్పుకువచ్చింది.

Pawan Kalyan Ex Wife Renu Desai Comments on Her Son Akira Nandan

అకీరా నందన్ ఏం అవ్వాలనుకుంటున్నాడో అతని ఇష్టం.. అకీరా యాక్టర్ అవ్వాలని ఉందని చెప్పినా.. ఇంకేదైనా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను అంటూ వెల్లడించింది. ఇక రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అకీరా నందన్ హీరో అయితే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇక అతను పియానో నేర్చుకుంటున్న విషయం తెలిసిందే. మరి మ్యూజిషియన్ గా సెటిల్ అవుతాడా.. లేదా హీరోగా ఎంట్రీ ఇస్తాడా అనేది కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.

Pawan Kalyan Ex Wife Renu Desai Comments on Her Son Akira Nandan

ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా విషయానికి వస్తే... ఈ సినిమాలో హేమలత లవణం అనే క్యారెక్టర్ లో రేణు దేశాయ్ నటించింది. ఇక ఈ సినిమా అక్టోబర్ 20 న రిలీజ్ కానుంది. ఈ సినిమాను వంశీ దర్శకత్వం వహించారు. కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2ని అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X