నా జీవితంలో అదొక్కటే రిగ్రెట్... సాష్టాంగ నమస్కారం చేసే దాన్ని.. Renu Desai సంచలన వ్యాఖ్యలు

Renu Desai on Hemalatha Lavanam మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఇక ఈ సినిమా క్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్రబృందం... సాంగ్స్, పోస్టర్స్ తో ఆకట్టుకుంటుంది. ఇక పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా... రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యలో పాల్గొంది. ఆ వివరాలు...

Renu Desai on Hemalatha Lavanam టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao Movie) సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను వంశీ దర్శకత్వం వహించారు. కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2ని అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఈ సినిమాలో రేణు దేశాయ్... హేమలత లవణం క్యారెక్టర్ లో నటించింది. ఇక ఈ పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది.

Pawan Kalyan Ex Wife Renu Desai Talk About Her Role Hemalatha Lavanam in Tiger Nageswara Rao Movie

ఇక ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడుతూ.... నాకు తెలుగు వచ్చు.. ఏ ఊరిలో ఉంటే ఆ భాష నేర్చుకోవాలి. ఆ ఇండస్ట్రీలోకి వచ్చి భాష నేర్చుకోను అంటే కరెక్ట్ కాదు.. నాకు బద్రి టైంలోనే అనిపించింది. ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా విషయానికి వస్తే.. నా క్యారెక్టర్ హేమలత లవణం. ఆమె 1930లో పుట్టింది. నాకు ఈ ఆఫర్ వచ్చాక.. నేను గూగుల్ సెర్చ్ చేసి ఆమె గురించి తెలుసుకున్నాను అంటూ చెప్పుకువచ్చింది.

రేణు మాట్లాడుతూ... 1960లో జోగినిల కోసం ఫైట్ చేసి.. ఆమె క్యారెక్టర్ నాకు నచ్చింది. టైగర్ నాగేశ్వరరావు మీద సినిమా చేస్తున్నాం కానీ.. హేమలత లవణం గారు.. అప్పట్లోనే ఫెమినిజం గురించి మాట్లాడారు. ఆమె విధవ కాదు.. కానీ తెల్ల చీర కట్టుకుంటుంది. జోగినిల కోసం చాలా వర్క్ చేసింది. నాకు ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ పాత్ర దొరికిందని వెల్లడించారు.

Pawan Kalyan Ex Wife Renu Desai Talk About Her Role Hemalatha Lavanam in Tiger Nageswara Rao Movie

''వంశీ చాలా టాలెంటెడ్ డైరెక్టర్. రవితేజ గారు హనర్. లవణం గారి గురించి చెప్పాలంటే... గ్రేట్ పర్సన్. నేటి ఆడవాళ్లకు ఆమె స్పూర్తి. 2009లో ఆమె చనిపోయారు.. నేను ఆమెను కలవకపోవడం రిగ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఆమె ఉండి ఉంటే.. ఆమెకు సాష్టంగా నమస్కారం చేసేదాన్ని. నేను ఆమె పాత్రలో నటించడం చాలా సంతోషిస్తున్నారు. లవణం గారి మేనకోడలిని కలిశాను. ఆమె ఫోటోలు, ఆమె ఎలా ఉండేది అని కనుక్కున్నానని'' తెలిపింది.

Pawan Kalyan Ex Wife Renu Desai Talk About Her Role Hemalatha Lavanam in Tiger Nageswara Rao Movie

''నేను ఈ సినిమాలో డైలాగ్స్ చాలా బైహార్డ్ చేసి చెప్పాను. నేను ఆమె ప్లేస్ ను పూర్తి చేయలేదు కానీ... ఆ పాత్రకు మాత్రం పూర్తి న్యాయం చేశాను. ఆ క్యారెక్టర్ నన్ను చాలా ఇప్రెస్ చేసింది. ఆ రోజుల్లో ఏ మీడియా లేదు.. కానీ చాలా సేవ చేసింది. ఫైట్ చేసింది.. నాకు బాగా నచ్చింది ఆ క్యారెక్టర్. నేను కూడా నా పరిధిలో ఎంత చేయాలో అంత సేవలు చేస్తున్నానని'' తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X