పవన్ కళ్యాణ్ ఫేవరెట్ హీరోయిన్.. ఆమె తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని పవర్ స్టార్ కోరిక
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ గా చాలా బిజీ అయి పోయారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. జనసేన పార్టీ స్థాపించి దశాబ్దానికి పైగా రాజకీయ కార్యక్రమాలతో ఫుల్ బిజీ అయ్యారు. అయినప్పటికీ తను కమిట్ మెంట్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ ను ప్రస్తుతం ప్రత్యేకమైన టైమ్ కేటాయించి మరీ పూర్తి చేస్తున్నారు. ఇక రీసెంట్ గా హరి హర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే తొలిసారిగా పాన్ ఇండియా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూలై 24న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో సోషల్ మీడియాలో పవన్ కు సంబంధించిన ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. అందులో పవన్ కళ్యాణ్ ఫెవరేట్ హీరోయిన్ గురించి బయట పెట్టడం విశేషం..
ఆ హీరోయిన్ పైనే బాధ్యతలు..
హరి హర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి 5 రోజులు గడించింది. 5 ఏళ్లుగా ఎదురు చూస్తుండగా ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చి సందడి చేస్తోంది. అయితే ఈ చిత్రం ప్రమోషన్స్ లో బాధ్యతలు మొత్తం నిధి అగర్వాల్ కే అప్పించారు. పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ కు హాజరవడాని కంటే ముందే నిధి అగర్వాలే మొత్తంగా ప్రచార కార్యక్రమాల బాధ్యతలను తన భుజంపై వేసుకుంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ ను ప్రత్యేకంగా అభినందించారు.

పవన్ కళ్యాణ్ ఫేవరెట్ హీరోయిన్..
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రం ప్రమోషన్స్ లో తరుచుగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. తొలిసారిగా హరి హర వీరమల్లు చిత్రం కోసం ప్రమోషన్స్ లో ఎక్కువ రోజులు కనిపించారు. వీలైనంత వరకు సినిమాను ప్రచారం చేశారు. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆ చిత్రంలో మీ ఫెవరేట్ హీరోయిన్ ఎవరు? ఎవరితో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారనే ప్రశ్న ఎదురైంది.
టాప్ లో కంగనా.. కానీ
అలియా భట్, దీపికా పదుకొణె, కృతి సనన్, కియారా అద్వానీ, కంగనా రనౌత్, కరీనా కపూర్ హీరోయిన్లతో ఎవరితో వర్క్ చేయాలని ఉంటుందని అడిగారు. ఇందుకు పవన్ కళ్యాణ్ అందరితో పనిచేయాలని ఉంటుందని చెప్పారు. కానీ అందరి కంటే ముందుగా కంగనా రనౌత్ కు ప్రిఫరెన్స్ ఇస్తానని చెప్పుకొచ్చారు. అందుకు కారణం ఆమె ఇందిరా గాంధీ బయోపిక్ లో స్ట్రాంగ్ పెర్ఫామెన్స్ ఇచ్చిందని తనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. ఇక కంగనా రనౌత్ లేదా శ్రీదేవి అని అడిగిన చివరి ప్రశ్నకు శ్రీదేవి అని చెప్పారు. ఫైనల్ గా ఆయన ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి అని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
నెక్ట్స్ చిత్రాలు..
హరి హర వీరమల్లు పార్ట్ 1 మొత్తానికి రిలీజ్ కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల గురి మొత్తం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలపై ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న OG చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేశారు. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలోని ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. నాలుగైదు రోజుల్లో పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ ముగియనుంది. ఇక ఓజీ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉస్తాద్ భగత్ సింగ్ 2026 మార్చిలో విడుదలకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











