అవినీతి రాజకీయాలపై పవన్ కల్యాణ్ పోరాటానికి హ్యాట్సాఫ్.. ఆ చిక్కుముడి విప్పేందుకే.. వీకే నరేష్ (ఇంటర్వ్యూ)

ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో రాజకీయాలపై విమర్శనాస్త్రం సంధిస్తూ రూపొందిస్తున్న చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. ఓటు విలువ, అర్ధ బలం, అంగబలంతో రాజకీయాలను శాసించే నాయకులపై సెటైర్లు వేస్తూ రూపొందించిన చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, వీకే నరేష్, వెంకటేష్ మహా తదితరుల నటించారు. ఈ సినిమా అక్టోబర్ 26వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వీకే నరేష్ మీడియాతో మాట్లాడుతూ..

మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమవుతున్న పూజా కొల్లూరు మంచి డైరెక్టర్‌ అవుతుంది. నేను ఓ మహిళా డైరెక్టర్ కొడుకును. ఇప్పటి వరకు నేను ఐదుగురు మహిళా డైరెక్టర్లతో పనిచేశాను. మొదట మా అమ్మతో, శ్రీప్రియ, నందిని రెడ్డి, ఎమ్మెస్ నారాయణ కూతురు, ప్రస్తుతం పూజాతో కలిసి పనిచేశాను. పూజాకు నా కంగ్రాట్స్. రానున్న రోజుల్లో తన మార్క్ చూపిస్తుంది అని వీకే నరేష్ చెప్పారు.

MARTIN LUTHER KING Movie

ఏడాదిలో నేను నటించిన 8, 9 సినిమాలు హిట్ అయ్యాయి. గత నెల రోజుల్లో 14 సబ్జెక్ట్స్ విన్నాను. మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో సంపూర్ణేష్ బాబుకు సెకండ్ లైఫ్ లాంటి క్యారెక్టర్. సెకండ్ లీడ్ క్యారెక్టర్లు నేను, వెంకటేష్ మహా చేశాం. ఈ సినిమా ద్వారా 30, 40 మందిని పరిచయం చేశారు.ఈ సినిమా రిలీజ్ తర్వాత చాలా మంది కొత్త నటీనటులు పుట్టుకొస్తారు. నేను కొత్త గెటప్‌లో కనిపిస్తాను. యంగ్ డైరెక్టర్స్ నాకు లైఫ్ ఇస్తున్నారు అని వీకే నరేష్ చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయాలు స్వరూపాలు మారుతున్నాయి. నేను సినిమా, రాజకీయాల్లో ట్రావెల్ అవుతున్నాను. ఒకప్పుడు సిద్దాంతపరంగా అభివృద్ది కోసం రాజకీయాలు ఉండేవి. కానీ ప్రస్తుతం వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పాలిటిక్స్ నడుపుతున్నారు. రాజకీయాలు ఒకరిని మరొకరు అసభ్యకరంగా తిట్టుకొంటున్నారు. పాలిటిక్స్‌లో ఆడవాళ్లు ఆడవాళ్ల మాదిరిగా మాట్లాడం లేదు. నేను రాజకీయనేతలందరిని జనరలైజేషన్ చేయడం లేదు. కొన్ని ప్రాంతాలు అంధకారంలో నెట్టివేయబడుతున్నాయా? ప్రజలు నిర్లక్ష్యానికి గురి అవుతున్నారా? అనే భయాలు నెలకొంటున్నాయి.

Pawan Kalyan political fight is great in Andhra Pradesh to change says VK Naresh

రాజకీయాలపై సినిమా అనేది విమర్శనాస్త్రం. ఎనీఆర్, కృష్ణ సామాజిక అంశాలతో సినిమాలు తీసి ప్రజల్లో చైతన్యాన్ని రగలించారు. ఈనాడు లాంటి సినిమాలను కృష్ణ గారు ధైర్యంగా తీశారు. సినిమా రంగం నుంచి రొనాల్డ్ రీగన్, ఎంజీఆర్, ఎన్టీఆర్ నాయకులు ఉన్నారు. ఇప్పుడు కూడా రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని, స్వచ్చమైన రాజకీయాలకు మార్గం వేయాలని పవన్ కల్యాణ్ పోరాటం చేస్తున్నారు. సినిమా పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వెళ్లి మార్పు తెచ్చిన ప్రతీ ఒక్కరికి హ్యాట్సాఫ్. మార్టిన్ లూథర్ కింగ్ కూడా మార్పు కోరే సినిమా. అలాంటి సినిమాలో భాగం కావడం హ్యాపీగా ఉంది అని వీకే నరేష్ చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా రాజకీయాలతో డబ్బు, బిజినెస్‌కు ముడి పడింది. ఆ ముడి అక్కడి వరకు ఉండే బాగుండేది. కానీ ప్రజల జీవితాలకు రాజకీయాలు చిక్కు ముడిగా మారాయి. ఆ చిక్కు ముడిని విప్పడానికి పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటం గొప్పది. సినిమా పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వెళ్లి అతడు చేస్తున్న పోరాటం చూస్తే గర్వంగా ఉంది అని వీకే నరేష్ అన్నారు.

Pawan Kalyan political fight is great in Andhra Pradesh to change says VK Naresh

ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు చేసిన నియంతలు హిట్లర్, మంచి నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ లాంటి నాయకులను చూశాం. రాజకీయాల్లో మంచి, చెడులు ఉంటాయి. ఇప్పటికీ భారతదేశం గొప్ప దేశమని చెప్పుకొంటాం. ఎన్నో భాషలు, ప్రాంతాలను, ప్రభుత్వ నేతలను నమ్ముకొని భారతీయులమని గట్టిగా చెప్పుకొంటున్నాం. భారతీయ ప్రజాస్వామ్యానికి అంత గొప్ప విలువ ఉంది అని వీకే నరేష్ అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X