twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bheemla Naik Song: ఎవరీ కిన్నెర మొగిలయ్య? పవన్ కల్యాణ్‌ దృష్టిలో ఎలాపడ్డాడంటే?

    |

    పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు మొగిలయ్య అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ రిలీజ్ తర్వాత మొగిలయ్య పేరు మార్మోగింది. ప్రతీ ఒక్కరు ఇప్పుడు మొగిలయ్య గురించే చర్చిస్తున్నారు. ఆయన వివరాలను సోషల్ మీడియా, ఇంటర్నెట్ మీడియాలో వెతుకున్నారు. అలాంటి మొగిలయ్య మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో ఆయన వివరాలు బయటకు వచ్చాయి. మీడియాతో మొగిలయ్య మాట్లాడుతూ..

    మామిడి హరికృష్ణ వల్లే పవన్ కల్యాణ్ పరిచయం

    మామిడి హరికృష్ణ వల్లే పవన్ కల్యాణ్ పరిచయం

    ఏన్నో ఏళ్గుగా నేను పాటలు పాడుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం నా ప్రతిభను గుర్తించి సన్మానించడంతో నా గురించి అందరికి తెలిసింది. మామిడి హరికృష్ణ గారు నా గురించి చెప్పడంతో భీమ్లా నాయక్ చిత్రంలో పాట పాడే అవకాశం లభించింది. పవన్ కల్యాణ్ అడిగితే మామిడి హరికృష్ణ నా నెంబర్ ఇచ్చారు. దాంతో ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడారు. కారు పంపిస్తే వెళ్లిపాడాను. పవన్ కల్యాణ్ గురించి నాకు తెలియదు. ఆయన కూడా సినిమా యాక్టర్ అనుకొన్నాను. పవన్ కల్యాణ్ నాకు ఫోన్ చేసిన తర్వాతే నా పిల్లలు చెబితే ఆయన గురించి గొప్పగా నాకు తెలిసింది అని మొగిలయ్య తెలిపారు.

    Recommended Video

    Bheemla Nayak పాటతో కిన్నెర మొగిలయ్య స్టార్ స్టేటస్.. ఏంటీ కాంట్రవర్సీ || Filmibeat Telugu
    నా కిన్నెర వాయిద్యాన్ని చూసి

    నా కిన్నెర వాయిద్యాన్ని చూసి

    నా పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యాన్ని చూపించాను. నా చేతిలోని వాయిద్యాన్ని తీసుకొని చూశాడు. నా చేత పాట పాడించాడు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి తమిళనాడుకు తీసుకెళ్లారు. అక్కడ నాతో పాట పాడించాడు. భారీ సెట్ వేసి చాలా మంది పనిచేస్తున్నారు. పవన్ కల్యాణ్ చాలా గొప్ప వ్యక్తి. నాకు మంచి ఫుడ్ పెట్టారు. నన్ను బాగా చూసుకొన్నారు అని మొగిలయ్య చెప్పారు.

     పాట పాడినందుకు రెమ్యునరేషన్ ఎంతంటే

    పాట పాడినందుకు రెమ్యునరేషన్ ఎంతంటే

    నాకు పాటపాడి నందుకు నాకు ఖర్చులు ఇచ్చారు. నాకు డబ్బులు ఇస్తానని, నన్ను ఆదుకొంటానని చెప్పారు. పవన్ కల్యాణ్ నన్ను చూసుకొంటానని చెప్పారు. నేను డబ్బుల కోసం ఆశపడను. నా కళ బయటకు రావాలన్నదే కోరిక. ఒకవేళ నేను డబ్బుల కోసం ఆశపడితే కోట్లు సంపాదించే వాడిని. పేదరికంలో మగ్గినా నేను ఏనాడు డబ్బు కోసం పాకులాడలేదు అని మొగిలయ్య తెలిపారు.

    పవన్ కల్యాణ్ వల్లే నా కళ బయటకు

    పవన్ కల్యాణ్ వల్లే నా కళ బయటకు

    నేను ఇప్పటికీ చాలా పేదరికంతో బాధపడుతున్నాను. ధరించడానికి నాకు బట్టలు కూడా లేవు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారి గారు నాకు ప్రతీసారి బట్టలు తీసుకొస్తాడు. నేను తొడిగే బట్టలు ఆయన ఇస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నా కళను పవన్ కల్యాణ్ బయటకు తెచ్చాడు. నేను ఆయనను డబ్బులు కూడా అడుగలేదు. ముఖ్యమంత్రిని కూడా డబ్బులు అడుగలేదు. పదివేల రూపాయలు ఇస్తే తీసుకొన్నాను. నా పాటను తొమ్మిదో తరగతి సోషల్‌ సబ్జెక్ట్‌లో పాట పెట్టాడు. బేగంపేట బ్రిడ్డిపై అబ్దుల్ కలాం ఫోటో పక్కన నా ఫోటో పెట్టారు. ఎస్‌ఐ పరీక్షల్లో నా పేరుతో ప్రశ్న ఇచ్చి ఒక మార్కు కూడా ఇచ్చారు. అంతకంటే ఏం కావాలి? ఎంత డబ్బు ఇస్తే అలాంటి గుర్తింపు వస్తుంది అని మొగిలయ్యా అన్నారు.

    కూలీగా పనిచేసినా.. నా కళను వదిలిపెట్టలే

    కూలీగా పనిచేసినా.. నా కళను వదిలిపెట్టలే

    పేదరికం కారణంగా కట్టెలు కొట్టి బతికినా.. కూలీ పని చేసినా.. కానీ నా కళను మాత్రం వదిలిపెట్టలేదు. నా కళను మామిడి హరికృష్ణ గుర్తించాడు. మొగిలయ్య లాంటి అద్బుతమైన వాగ్గేయకారుడు ఉన్నాడు. ఆయనతో పాటలు పాడించుకోమని హరికృష్ణ గారు చెప్పారు. ఆయన వల్లే నాకీ గుర్తింపు. అందుకు ఆయనకు నమస్కారం అని అన్నారు.

     ట్రెండింగ్‌గా భీమ్లా నాయక్ సాంగ్

    ట్రెండింగ్‌గా భీమ్లా నాయక్ సాంగ్

    ఇక భీమ్లా నాయక్ సినిమాలోని టైటిల్ పాట సోషల్ మీడియా, యూట్యూబ్‌లో భారీగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే 1 కోటి 20 లక్షల వ్యూస్, సుమారు 900k లైక్స్ వచ్చాయి. య్యూటూబ్‌లో నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతున్నది.

    English summary
    Pawan Kalyan's Bheemla Nayak Title Song trending in social and youtube media. Now Kinnera Modulaiah is debatable in media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X