పవన్ కల్యాణ్‌ ఆయన మంచి ఫ్రెండ్స్.. వారిని ఏ శక్తి విడదీయలేదు.. వాసుకీ (ఇంటర్వ్యూ)

తొలి ప్రేమలో అన్నా, చెల్లెల్ల అనుబంధాన్ని దర్శకుడు కరుణాకరన్ గొప్పగా తెరకెక్కించారు. తొలి ప్రేమ అనగానే.. పవన్ కల్యాణ్, ఆ సినిమాలో నటించిన చెల్లెలు వాసుకి గుర్తుకు వస్తారు. ఆ సినిమాలో అన్నా, చెల్లెల్ల మధ్య ఉండే బాండింగ్ తొలి ప్రేమను బ్లాక్ బస్టర్‌గా మార్చింది. అలాంటి చెల్లెలు పాత్రను పోషించిన వాసుకి 23 ఏళ్ల తర్వాత మళ్లీ అన్ని మంచి శకునములే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా గురించి వాసుకి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌తో ఉన్న అనుబంధాన్ని తెలియజేసింది. మే 18వ తేదీన అన్ని మంచి శకునములే రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వాసుకి మాట్లాడుతూ..

స్వప్న దత్‌తో నాకు అలా పరిచయం:
స్వప్నదత్‌కు నాకు ఆనంద్ సాయి వల్ల పరిచయం. ఆనంద్ సాయి తండ్రి స్వప్నదత్ తండ్రి అశ్వినీదత్‌తో పనిచేశారు. అశ్వినీదత్‌తో కూడా ఆనంద్ సాయి పనిచేశారు. అలా వాళ్ల ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో రిలేషన్స్ ఉన్నాయి. దాంతో మా మధ్య స్వప్నకు నాకు మంచి స్నేహం ఏర్పడింది. అంతేకాకుండా మేము, స్వప్న ఇరుగుపొరుగు ఇళ్లలో ఉండేవాళ్లం. ఆనంద్ సాయి, స్వప్నదత్ భర్త ప్రసాద్ జిమ్ మేట్స్ అని వాసుకీ తెలిపారు.

Pawan Kalyans friendship with Anand Sai never broken

పవన్ కల్యాణ్, ఆనంద్ సాయి బాండింగ్:
పవన్ కల్యాణ్, ఆనంద్ సాయి మంచి ఫ్రెండ్స్ అనే విషయం అందరికి తెలిసిందే. వారిద్దరి మధ్య స్నేహం ఎప్పటిదో. వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్‌ను ఏ శక్తి విడదీయలేదు. తొలి ప్రేమ సినిమా సమయంలో ఎలా ఉండే వారో.. ఇప్పటికీ అలానే ఉంటారు. ఆయనలో ఏ మాత్రం మార్పు కనిపించదు. పవన్ కల్యాణ్ గ్రోత్ ఊహించలేం. ఆనంద్ చెప్పే విషయాలను బట్టి చూస్తే.. ఎంత ఎత్తుకు ఎదిగినా.. అంతే ఒదిగి ఉంటాడు. నేను రాజకీయాల్లోకి నేను రాను. అలాంటి విషయాలు నాకు నచ్చవు. సినిమాల్లోనైనా, పాలిటిక్స్‌కు అతీతంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని వాసుకీ అన్నారు.

Pawan Kalyans friendship with Anand Sai never broken

అవకాశం వస్తే మళ్లీ పవన్ కల్యాణ్‌ మూవీలో :
పవన్ కల్యాణ్ ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తున్నారు. ఆయన సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తాను. ఆయన అడిగితే నేను నో చెప్పకుండా ఉండలేను. కానీ నాకు నచ్చిన క్యారెక్టర్ అయితే చేస్తాను. నాకు మంచి సినిమా ఆయనతో చేయాలని ఎందుకు ఉండదు. ఆయన సినిమాల్లో నేను చేశాననే తృప్తి కూడా నాకు ఉండేలా ఉంటే తప్పకుండా నటిస్తాను అని వాసుకి చెప్పారు.

Pawan Kalyans friendship with Anand Sai never broken

అన్ని మంచి శకునములే సినిమాలో:
అన్నీ మంచి శకునములే సినిమాలో రాజేంద్ర ప్రసాద్, నరేష్, గౌతమి లాంటి సీనియర్ నటులతో కలిసి నటించే అవకాశం వచ్చింది. కానీ వారిని చూస్తే సీనియర్ ఆర్టిస్టులు అనే ఫీలింగ్ కలుగలేదు. ప్రతీ విషయంలో నాకు చాలా కోఆపరేట్ చేశారు. కో ఆర్డినేషన్ విషయంలో వాళ్లు డాక్టరేట్ ఉన్న వ్యక్తులుగా అనిపించారు. వాళ్ల కారణంగానే నేను నటించడం మరింత ఈజీగా మారింది. కొత్తగా సెట్‌కు వెళ్లాననే ఫీలింగ్ కలుగలేదు అని వాసుకీ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X