ఆ సినిమా కోసం హద్దులన్నీ చెరిపేశా.. 40 రోజులు నరకం చూశా
ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా తెలుగు నాట సంచలనంగా మారిపోయింది పాయల్ రాజ్ పుత్. ఇందు పాత్రలో జీవించేసిన పాయల్.. అందర్నీ ఆకట్టుకుంది. కుర్రకారు గుండెల్లో మాత్రం కార్చిచ్చును రేపింది. ఇందు చేసిన మాయను ఇంకా మరిచిపోక ముందే.. మరో సినిమాతో కుర్ర హదయాలను కొల్లగొట్టేందుకు వస్తోంది. ఆర్డీఎక్స్ లవ్ సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతోన్న పాయల్.. మీడియాతో ముచ్చటిస్తూ.. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

వాళ్లకు ఎంత కావాలో అంత ఉంటుంది..
సినిమా అంటే అందులో అన్ని ఉంటాయి. రొమాన్స్ కూడా ఓ పార్టే. టీజర్, పోస్టర్లో చూసింది కొంతే.. అలాంటివన్ని సినిమాలో ఓ పార్ట్. నా ఫ్యాన్స్ ఎంత కోరకుంటారో.. ఈ సినిమాలో అంత ఉంటుంది. ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. రొమాంటిక్, యాక్షన్ ఇలా అన్నీ ఉన్నాయి. నేను ఫస్ట్ టైమ్ యాక్షన్ కూడా చేశాను..

హద్దులన్నీ చెరిపేశాను.. చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశాను..
ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు నా వేలికి కూడా గాయమైంది. నేను ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను. ఈ మూవీ కోసం నా బౌండరీస్ అన్నీ చెరిపేశాను. ఈ సినిమాకు చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశాను. ఆర్ ఎక్స్ 100 కంటే ఎక్కువగానే కష్టపడ్డాను.

ఊరికోసం నిలబడే అమ్మాయి..
ఈ సినిమాలో నా పాత్ర పేరు అలివేలు. ఓ సామాజిక కార్యకర్తను. పాపికొండలు గ్రామం కోసం పనిచేసేందుకు అక్కడికి వెళ్తాను అక్కడ ఎదురైన సమస్యలు.. ఆ ఊరి కోసం నిలబడే, పోరాడే వ్యక్తిగా నేను కనిపిస్తాను. ఊరి మంచి కోసం ఎంతదూరమైనా ఎవరితోనైనా తలబడే పాత్రను పోషిస్తున్నాన్ను.

40 రోజులు నరకం చూశా..
నేను పుట్టి పెరిగిందంతా ఢిల్లీలోనే. నాకు సిటీ వాతావరణమే తెలుసు. అయితే ఈ మూవీ షూటింగ్ కోపం పాపికొండల్లో నలభై రోజులు షూటింగ్ చేశాం. అక్కడున్నన్ని రోజులు నాకు నరకం కనిపించింది. లగ్జరీ హోటల్స్ లేవు, తినడానికి, పడుకోడానికి కూడా చాలా కష్టపడ్డాను. అయితే అది కూడా ఓ మంచి ఎక్స్ పీరియెన్సే. అక్కడి వాతావరణం, సహజమైన ఫుడ్ ఇలా ప్రతీది ఆస్వాధించా. మళ్లీ మళ్లీ అలాంటి చాన్స్ రాదు కదా. ఈ వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











