సోదరుడు తప్పిపోవడంతో పాయల్ ఇంట్లో విషాదం..

బయటకు ఎంత బాగా కనిపించినా..లోపల ఏదో ఒక విషాదం ఉంటుందని అందరూ అంటుంటారు. అది పాయల్ విషయంలో నిజమనిపిస్తోంది. మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా మంచి పొజిషిన్లో ఉందని అంతా అనుకుంటారు. అయితే తన ఇంట్లో జరిగిన విషాదం గురించి గుర్తు చేసుకుని బాధపడింది పాయల్. ఆర్డీఎక్స్ లవ్ సినిమాతో పలకరించేందుకు సిద్దమైన పాయల్ మీడియాతో ముచ్చటిస్తూ.. ఈ సంఘటన గురించి చెప్పుకొచ్చింది.

తన కుటుంబ నేపథ్యం గురించి చెప్పుకొస్తూ.. తనకు ఓ సోదరుడు ఉండేవాడు కానీ అతను తప్పిపోయాడంటూ చెప్పుకొచ్చింది. తన సోదరుడు మూడేళ్ల క్రితమే ఇంటిని వదిలి వెళ్లిపోయాడని.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేశానని, వెతికి పెట్టమని కోరాను కానీ ఫలితం లేకుండాపోయిందని చెప్పుకొచ్చింది. తన సోదరుడు డ్రగ్స్ లాంటివి తీసుకోవడంతో మెదడు పనిచేయడం మానేసిందని.. ఒత్తిళ్లకు కూడా లోనవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడంటూ గుర్తు చేసుకుంది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాము కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఎదిగిన కొడుకు అలా అయిపోతే తల్లిదండ్రుల పరిస్థతి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

 Payal rajputh Brother Was Left Home And She Feels So Bad

ఇంకా పలు విషయాలు చెప్పుకొస్తూ.. 'నాకు ఇది ఓవర్ నైట్ లో వచ్చిన స్టార్ డమ్ కాదు.. నేను దీని కోసం చాలా కష్టపడ్డాను. దీనంతటి వెనుక ఆరేళ్ల శ్రమ ఉంది. నేను మూడు హిందీ సీరియల్స్ చేశాను. సైరాట్ రీమేక్ ను పంజాబీలో చేశాను. అయితే హీరోయిన్ చాన్సుల కోసం వెళ్లినా.. ప్రతీచోటా నన్ను రిజెక్ట్ చేసేవారు. చివరకు ఆర్ ఎక్స్ 100 సినిమాను చేశాను. ఇక్కడికి నేను కొత్త కాబట్టి ఓవర్ నైట్ ఫేమ్ అనుకుంటారు కానీ అది అబద్దం' అని చెప్పింది.

ఇంకా మాట్లాడుతూ.. 'సౌత్ వాళ్లు నిజంగా మంచివారు. ఇక్కడ ప్రేమిస్తే.. మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు.. వారికోసం ఏదైనా చేస్తారు. నాకు ఇక్కడే బాగా నచ్చింది. ఇక్కడి భాష నేర్చుకుని ఇక్కడే ఉండిపోవాలనుంది. ప్రస్తుతం వెంకీ మామా, డిస్కోరాజా, పోలీసాఫీసర్ పాత్రలో మరో సినిమాను చేస్తున్నాను. వెంకీ మామా మరో పాట మినహా మిగతా షూటింగ్ పూర్తయింది. డిస్కో రాజాకూడా విడుదలకు సిద్దంగా ఉంది. పోలీసాఫీసర్ గా చేస్తున్న మూవీ యాభై శాతం పూర్తయిందనుకుంటా.. జనవరి, ఫిబ్రవరిలో రిలీజయ్యే చాన్స్ ఉంది. నాకు ఇక్కడ ఇంత ఫేమ్ వచ్చాక పంజాబీ ఆఫర్స్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే అక్కడ సినిమా చేయడానికి ఒక్క డేట్ కూడా ఖాళీ లేదు. పాయల్.. పంజాబీని వదిలేసి వెళ్లిపోయింది.. ఇక తిరిగి రాదని అక్కడి ఫ్యాన్స్ అనుకుంటారు. తిరిగి రమ్మని, సినిమా చేయమని, మిస్ యూ అంటూ నా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుంటార'ని మీడియాతో ముచ్చటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X