twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ram Gopal Varma ప్రాక్టీకల్‌గా ఆ విషయంలో పూర్.. కానీ ఇద్దరం అలా కలిసి.. పూజా భలేకర్ (ఇంటర్వ్యూ)

    |

    మహారాష్ట్రియన్ మిడిల్ క్లాస్ బ్రాహ్మిణ్ కుటుంబానికి చెందిన పూజా భలేకర్ అంతర్జాతీయ స్థాయిలో తైక్వాండో, మార్షల్ ఆర్ట్స్‌లో మెడల్స్ సాధించింది. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లడ్కీ (తెలుగులో అమ్మాయి) చిత్రంలో పూజా యాక్షన్ సీన్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూలై 15వ తేదీన తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, చైనా భాషల్లో విడుదల అవుతుంది. ఈ క్రమంలో సినిమా అనుభవాల గురించి పూజా భలేకర్ మాట్లాడుతూ..

    బ్రూస్ లీని అభిమానించే యువతిగా

    బ్రూస్ లీని అభిమానించే యువతిగా

    లడ్కీ చిత్రంలో నేను పూజా అనే పాత్రలో నటిస్తున్నాను. నా క్యారెక్టర్ విషయానికి వస్తే.. బ్రూస్ లీని విపరీతంగా అభిమానించే యువతిగా కనిపిస్తాను. కొన్ని ఊహించని సంఘటనలు చోటుచేసుకొంటాయి. మార్షల్ ఆర్ట్స్ ఒకవైపు.. మరోవైపు ప్రేమ అనే నా ముందు కఠిన పరీక్షలుగా నిలుస్తాయి. అయితే చివర్లో మార్షల్ ఆర్ట్స్‌ను ఎంచుకోవాలా? లేదా ప్రేమ కోసం మార్షల్ ఆర్ట్స్‌ను వదులుకోవాలా అనే ప్రశ్నలు నా ముందు ఉంటాయి. అయితే అలాంటి ప్రశ్నలకు ఎలా రియాక్ట్ అనేది సినిమా కథ అని పూజా భలేకర్ తెలిపింది

     రాంగోపాల్ వర్మ పిలుపు రాగానే..

    రాంగోపాల్ వర్మ పిలుపు రాగానే..

    నేను చిన్నతనంలోనే మార్షల్ ఆర్ట్స్‌ నేర్చుకొన్నాను. దానినే నేను కెరీర్‌గా మలుచుకొన్నాను. అయితే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆఫీస్ నుంచి పిలుపు రాగానే కొంత నెర్వస్‌గా.. మరికొంత ఎక్సైట్‌మెంట్ కలిగింది. అయితే వారి ఆఫీస్‌కు వెళ్లే వరకు మార్షల్ ఆర్ట్‌పై సినిమా తీస్తున్నారని గానీ. వాళ్లు మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయి కోసం చూస్తున్నారని కానీ తెలియదు. ఒకసారి రాంగోపాల్ వర్మతో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఆయనకు బ్రూస్‌లీపై ఎంత అభిమానం ఉందో నాకు తెలిసింది. బాలీవుడ్ స్థాయిలో సినిమా తీయాలని ఆయన చెప్పడంతో మరింత ఆసక్తి, ఉత్సాహం కలిగింది అని పూజా భలేకర్ తెలిపింది.

    మార్షల్ ఆర్ట్స్ కారణంగానే నాకు అవకాశం

    మార్షల్ ఆర్ట్స్ కారణంగానే నాకు అవకాశం


    నాకు మార్షల్ ఆర్ట్స్ రాకపోతే నేను ఆయన ముందు నిలుచునే అవకాశం లేకపోయేది. మార్షల్ ఆర్ట్స్ కారణంగానే నన్ను కెమెరా ముందు నిలబెట్టారు. ఒకవేళ అమ్మాయే కావాలనుకొంటే.. నాకంటే ప్రతిభ, అందం ఉన్న అమ్మాయిలు ఆయన ముందు ఉండేవారు. ప్రతీ ఒక్క అమ్మాయి, అబ్బాయి హీరో, హీరోయిన్లు కావాలనుకొంటారు. కానీ నాకు సినిమాల్లోకి రావాలనే కోరిక లేదు. నేనెప్పుడూ నాకు ఉన్న టాలెంట్‌తో భారత్ తరఫున ఆడాలని, ఒలంపిక్స్‌కు ఇండియా తరఫున ప్రాతినిథ్యం వహించాలని అనుకొన్నాను అని పూజా భలేకర్ చెప్పింది.

    యాక్టింగ్ గురించి వర్మ సలహాలు అలా

    యాక్టింగ్ గురించి వర్మ సలహాలు అలా


    నాకు ఉన్న స్టామినా, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం కెమెరా ముందు యాక్షన్ సీన్లలో ప్రదర్శించడానికి ఉపయోగపడ్డాయి. ఇక నాకు యాక్టింగ్ స్కిల్స్ లేకపోవడంతో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సలహాలు ఉచ్చారు. ఎలా ఏడ్వాలి? ఎలా ఎమోషన్స్‌తో డైలాగ్స్ చెప్పాలి? ఎలా ఎమోషన్స్ పలికించాలనే విషయాలను నేర్చుకొన్నాను. మార్షల్ ఆర్ట్స్ ప్రతిభతోనే నేను కెమెరా ముందు కాన్ఫిడెన్స్‌గా నిలుచున్నాను అని పూజా భలెకర్ తెలిపింది

    వర్మ థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ

    వర్మ థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ


    రాంగోపాల్ వర్మకు ప్రాక్టీకల్‌గా మార్షల్ ఆర్ట్ గురించి తెలియదు. కానీ ఆయనకు థియరిటికల్‌గా చాలా నాలెడ్జ్ ఉంది. ఆయనకు మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అవగాహన కారణంగా నేను యాక్షన్ సీన్లను డిజైన్ చేసే వెసులుబాటు కలిగింది. అలా ఇద్దరం కలిసి సినిమాకు ఎలాంటి యాక్షన్ సీన్లు కావాలి? యాక్షన్ ఎపిసోడ్ ఎలా ఉండాలనే విషయం గురించి చర్చించుకొన్నాం. అలా మేమిద్దరం యాక్షన్ కొరియోగ్రఫి చేశాం అని పూజా భలేకర్ చెప్పింది.

    English summary
    Martial Art Champion turns Actor Pooja Bhalekar's Ladki movie is release on July 15th. Here is the Interview of Pooja Bhalekar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X