‘అరవింద’ డబ్బింగ్ చూసి ఆ హీరోయిన్ షాక్.. అది చూపిస్తే తప్పు లేదు కానీ.. పూజా హెగ్డే కామెంట్స్
అల వైకుంఠపురములో అమూల్య పాత్రలో నటించిన పూజా హెగ్డే.. మేడమ్ సర్ మేడమ్ అంతే అనేట్టుగా కనిపించింది. బుట్టబొమ్మ సాంగ్ తనకోసమే రాశారేమో అనేంత అందంగా ఉన్న పూజా హెగ్డే ఈ మూవీ విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. కలెక్షన్ల సునామిని సృష్టిస్తోన్న అల వైకుంఠపురములో విశేషాలను మీడియాతో చెప్పుకొస్తూ.. అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఆ వీశేషాలేంటో ఓసారి చూద్దాం..

నడుము చూపిస్తే తప్పులేదు కానీ.. అలా చూపిస్తే తప్పనిపించిందా? పూజా హెగ్డే కామెంట్స్
అల వైకుంఠపురములో అమూల్య పాత్రలో నటించిన పూజా హెగ్డే.. మేడమ్ సర్ మేడమ్ అంతే అనేట్టుగా కనిపించింది. బుట్టబొమ్మ సాంగ్ తనకోసమే రాశారేమో అనేంత అందంగా ఉన్న పూజా హెగ్డే ఈ మూవీ విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. కలెక్షన్ల సునామిని సృష్టిస్తోన్న అల వైకుంఠపురములో విశేషాలను మీడియాతో చెప్పుకొస్తూ.. అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఆ వీశేషాలేంటో ఓసారి చూద్దాం..

అరవింద డబ్బింగ్ చూసి షాక్..
అరవింద సమేతలో తానే డబ్బింగ్ చెప్పానని, అయితే ఆ విషయం ఎక్కువగా ఎవ్వరికీ తెలియదని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఓ హీరోయిన్ (పేరు మాత్రం వెల్లడించలేదు) ఫోన్ చేసి.. ‘నీ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరు.. మాక్కూడా చెప్పు.. మా పాత్రలకు కూడా ఆమెతో చెప్పించాలి'అని అడిగారంటూ నాటి సంఘటనను గుర్తుకు చేసుకుంది. అయితే డబ్బింగ్ చెప్పింది తానేనని చెప్పడంతో షాక్ అయిందని తెలిపింది.

కాళ్లపై ఫోకస్..
అల వైకుంఠపురములో చిత్రంలో పూజా హెగ్డే కాళ్లపై బాగానే ఫోకస్ పెట్టారు. ఆమె పొట్టి బట్టలు వేసుకుని కనబడటం, కాళ్లను ఎక్స్‌పోజ్ చేయడం, హీరో కూడా వాటిని చూడటం, వాటిపైనే ఓ పాట రావడం ఇలాంటి వాటికి సంబంధించిన ప్రశ్నలపై పూజా హెగ్డే తనదైన శైలిలో స్పందించింది. తన కాళ్లను చాలా పోయెటిక్‌గా చూపించారు. అందులో నాకు అసభ్యమేమి కనిపించలేదు.

నడకను వివరిస్తూ పాట..
అల వైకుంఠపురంలో నా కాళ్లను ఎక్స్‌పోజ్ చేసి చూపించలేదని తెలిపింది. అయినా ఆ పాటలో కూడా తన నడకను పొగిడారని చెప్పుకొచ్చింది. సామజవరగమన అంటే ఏనుగు నడకను పొగుడుతూ రాసిన పాట అని వివరించింది. ఈ సాంగ్‌లోని ప్రతీ లైన్‌ను త్రివిక్రమ్ తనకు వివరించాడని, అందుకే తాను ఇంత బాగా చెప్పగలుగుతున్నానని తెలిపింది. నాకు మంచి పాత్రను ఇచ్చినందుకు త్రివిక్రమ్‌కు థ్యాంక్స్ అని పూజా హెగ్డే అన్నారు.

నడుమును చూపిస్తే తప్పులేదు..
అయినా కాళ్లను అలా చూపించడంలో తప్పేముందని ప్రశ్నించింది. ఈ చిత్రంలో వాటిని వల్గర్‌గా చూపించలేదని, పొయెటిక్‌గా చెప్పారని అంది. తన కాళ్లను చూసే ప్రతీ ఒక్కరికీ క్లాస్‌లు పీకుతూ ఉండలేనని చెప్పుకొచ్చింది. నడుమును ఎక్స్‌పోజ్ చేసి చూపించినప్పుడు కనబడని తప్పు.. కాళ్లను చూపిస్తే ఏమవుతుందని ప్రశ్నించింది. ఏదైనా అవతలి వ్యక్తి చూసే ధోరణి, పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుందని తెలిపింది. కాళ్లు కనబడేలా డ్రెస్ వేసుకున్నా.. తనకు తెలిసిన వారు, ఫ్రెండ్స్ మామూలుగానే చూస్తారని, అందులో ఏం తప్పుందని కౌంటర్ వేసింది.


Click it and Unblock the Notifications











