Pooja Hegde అతడితో అలాంటి బాండింగ్.. అందుకే మహేష్‌తో సినిమా చేస్తున్నా.. పూజా హెగ్డే
కొంత మంది దర్శకులు, హీరోలు, ప్రొడక్షన్ సంస్థలతో నాకు ప్రత్యేకంగా అనుబంధం ఉంది. వాళ్లకు నేనంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే వారితో పనిచేసేలా చేస్తున్నది. వారి నుంచి నాకు మంచి ప్రశంసలు, నా వర్క్ గురించి వారికి రెస్పెక్ట్ ఉంది. అలాంటి వారితో నటించడం నాకు మరింత ఇష్టం అని పూజా హెగ్డే అన్నారు. ఒక హీరోయిన్‌ను ఎంపిక చేసుకొని భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నారంటే.. ఆ నిర్మాతకు అండగా ఉండాలి. ఆ నిర్మాతకు పూర్తిగా సహకారం అందించాలి.
అప్పుడు ఏ నిర్మాతకైనా మళ్లీ ఆ హీరోయిన్‌తో చేయాలని ముందుకు వస్తారు. నా విషయంలో కూడా అదే జరిగింది. అందుకే హారిక హాసిని సంస్థతో మూడు సినిమాలు, త్రివిక్రమ్ మూడు సినిమాలు, హరీష్ శంకర్‌తో రెండు సినిమాలు, రెండు సినిమాలు మహేష్ బాబు, అల్లు అర్జున్, దిల్ రాజుతో రెండు సినిమాలు చేశాను అని పూజా హెగ్డే తెలిపారు.

నేను చాలా మంది టాలెంటెడ్ దర్శకులు, నిర్మాతలు, హీరోలతో పనిచేశాను. వారితో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. వారి నుంచి చాలా నేర్చుకొన్నాను. హారిక, హాసిని సంస్థ నాకు చాలా గౌరవం ఇస్తుంది. నేను చాలా బిజీగా ఉన్నప్పటికీ.. మహేష్ సినిమా కోసం అడగ్గానే నేను సరే అని ఒప్పుకొన్నాను. నిర్మాత నాగవంశీ కాల్ చేసి.. డేట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీ పేరు అనౌన్స్ చేస్తున్నామని చెప్పారు. అలాంటి బాండింగ్ వారితో ఉంది అని పూజా హెగ్డే అన్నారు.
ప్రేక్షకులకు మరింత చేరువ కావడానికి నేను పాత్రలను ఎంచుకొంటాను. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కలెక్షన్లు రాబట్టవు అంటే ఒప్పుకొను. అరవింద సమేత చిత్రంలో నా పాత్ర చాలా బలంగా ఉంటుంది. మీరు ఎలాంటి పాత్రలు చేయాలనే ఆ పవర్ మీ చేతుల్లోనే ఉంటుంది. నేను ఎంచుకొనే మార్గానికి అండగా నా తల్లిదండ్రులు ఉన్నారు. అదే నా సక్సెస్‌కు చిరునామా అని పూజా హెగ్డే తెలిపారు.


Click it and Unblock the Notifications











