అర్ధరాత్రి హైవేపై ఒంటరిగా.. నాకు అంతటి కెపాసిటీ ఉంది.. పూజా హెగ్డే కామెంట్స్
అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్.. ఇలా హిట్లతో దూసుకుపోతోన్న పూజా హెగ్డేకు కొత్త సంవత్సరంలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. సంక్రాంతి బరిలో దిగి.. నెగ్గిన అల వైకుంఠపురములో చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్‌కు తెచ్చుకుంది. కలెక్షన్లలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న అల వైకుంఠపురములో చిత్ర విజయోత్సవంలో భాగంగా పూజా హెగ్డే నేడు మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో అనేక విషయాలను వెల్లడించింది.

త్రివిక్రమ్ ఎంతో కూల్..
త్రివిక్రమ్ ఎంతో కూల్‌గా ఉంటారని, ఓ వైపు సెట్ తగలబడిపోతోందని అందరూ కంగారు పడుతున్నా.. ఆయన మాత్రం కూల్‌గా ఉంటూ.. సరే ఇంకో వైపుకు వెళ్లి షూట్ చేద్దామనేంత కూల్ అని చెప్పుకొచ్చింది. ఆయనతో పని చేయడం చాలా ఈజీ అనే పేర్కొంది. ప్రతీది విడమర్చి అర్థమయ్యేలా చెబుతారని, ఆయనకు ఈగోలాంటివి అసలు ఉండవని తెలిపింది. మనమేదైనా కరెక్షన్ చెబితే.. ఆయన వింటారని, మార్చుతారని చెప్పుకొచ్చింది.

అలా డబ్బింగ్ మిస్..
అరవింద సమేత సమయంలో డబ్బింగ్ చెబుతానని త్రివిక్రమ్ గారితో అన్నానని చెప్పుకొచ్చింది. అయితే మొదట్లో అందరూ ఇలాగే చివరకు చేతులెత్తేస్తారని త్రివిక్రమ్ అన్నట్టు తెలిపింది. అయితే పట్టుబట్టి మరి చివరకు మళ్లీ అడిగానని, అయితే ఆయన ఒకే చెప్పారని అంది. అప్పటికే దాదాపు ఏడు మందితో ఫుల్ వర్షెన్ చెప్పించారని అందులో బాడీ లేదని, చివరకు తాను చెప్పిన డబ్బింగ్ బాగుందని త్రివిక్రమ్ అన్నట్టు చెప్పుకొచ్చింది. అయితే గద్దల కొండ గణేష్ టైమ్‌లో కూడా డబ్బింగ్ చెబుదామని అనుకున్నా.. చివర్లో తన పార్ట్‌కు సంబంధించిన సీన్స్ షూట్ చేయడం వల్ల, సమయం లేకపోయింది అందుకే ఆ సినిమాకు డబ్బింగ్ చెప్పలేకపోయానని తెలిపింది.

అర్థరాత్రి ఒంటరిగా హైవేపే..
తాను అరవింద సమేత షూటింగ్ చేస్తున్నప్పుడు అదే సమయంలో హౌస్‌ఫుల్ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఉందని తెలిపింది. ఒకసారి అరవింద సమేత షూట్ పూర్తయ్యాక ఇక్కడి నుంచి అహ్మదాబాద్‌కు ఫ్లైట్‌లో వెళ్లానని, అక్కడి నుంచి జైసల్మీర్‌కు డ్రైవ్ చేసుకుంటూ అర్దరాత్రి హైవేపై వెళ్లానని తెలిపింది. ఆ సమయంలో ఇంట్లో వాళ్లు కూడా చాలా బయపడ్డారని, ప్రతీక్షణం వాళ్లకు అప్‌డేట్ ఇస్తూ వెళ్లానని చెప్పుకొచ్చింది.

అందరూ శ్రీదేవీ అన్నారు..
తనకు ఒకే సారి నాలుగు సినిమాలు చేసేంత కెపాసిటీ ఉందని చెప్పుకొచ్చింది. అరవింద సమేత, హౌస్‌ఫుల్, ప్రభాస్, అఖిల్ చిత్రాలు చేశానని తెలిపింది. ఒక రోజు మూడు షిఫ్ట్స్‌లో పని చేశానని, జైపూర్ నుంచి హైద్రాబాద్‌కు, హైద్రాబాద్ నుంచి జైపూర్‌కు ట్రావెల్ చూసి మూడు షిఫ్టుల్లో పని చేశానని చెప్పుకొచ్చింది. అప్పుడు సెట్లో అందరూ శ్రీదేవీలా బిజీ అయిపోయావని అన్నారని గుర్తుకు చేసుకుంది.


Click it and Unblock the Notifications











