Pooja Hegde ఆ పాత్రలకు పనికిరానని చెప్పారు.. వారికి అలా ఛాలెంజ్ విసిరాను.. పూజా హెగ్డే

అందాల భామ పూజా హెగ్డే వరుస హిట్లను తన ఖాతాలో వేసుకొంటూ దూసుకెళ్తున్నది. డీజే, గద్దల కొండ గణేష్, అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొన్నది. తాజాగా ప్రభాస్‌తో కలిసి రాధే శ్యామ్ చిత్రంలో నటించింది. పిరియాడిక్ నేపథ్యంగా రూపొందిన లవ్ స్టోరిలో తన పాత్ర గురించి, ప్రభాస్‌తో కెమిస్ట్రీ గురించి వివరించింది. పూజా హెగ్డే చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

రాధే శ్యామ్ సినిమా కోసం చాలా రిసెర్చ్ చేశా

రాధే శ్యామ్ సినిమా కోసం చాలా రిసెర్చ్ చేశా

రాధే శ్యామ్ చిత్రంలో నేను ప్రేరణ అనే క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చాలా రకాల వేరియేషన్స్ ఉంటాయి. నాకు మోస్ట్ ఛాలెంజింగ్ రోల్. ఈ పాత్రలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఈ రోల్ కోసం చాలా రీసెర్చ్ చేశాను. చాలా పుస్తకాలు చదివాను. నా కారెక్టర్ సిచ్యుయేషన్ బట్టి ఎలా ఫీల్ అవుతుంది. ఈ సినిమాలో పూజా కొత్తగా కనిపిస్తుంది. నాలుగేళ్లలో నటిగా నాలో మెచ్యురిటీ కనిపిస్తుంది. నటిగా నేను చాలా ఎదిగాను. ఈ సినిమా చూసిన తర్వాత నా ఫెర్ఫార్మెన్స్ గురించి అందరూ గొప్పగా చెప్పుకొంటారు.

ప్రేరణ పాత్ర ప్రభావం ఎంతంటే?

ప్రేరణ పాత్ర ప్రభావం ఎంతంటే?

ప్రేరణ కారెక్టర్ పూజా హెగ్డేపై చాలా ప్రభావం చూపించింది. ప్రేరణ పాత్ర కోసం కంప్లీట్‌గా లుక్స్ మార్చుకొన్నాను. ప్రేరణ పాత్ర పోషించిన తర్వాత నేను ఓ వ్యక్తిగా మానసికంగా మరింత బలంగా తయారయ్యాను. ప్రేరణ హ్యాపీగా ఉంటుంది. కొన్నిసార్లు మొండిగా వ్యవహరిస్తుంది. కొన్నిసార్లు ఫన్నీగా కనిపిస్తుంది. రాధే శ్యామ్ రెగ్యులర్ లవ్ స్టోరి కాదు. ఈ పాత్ర కోసం నేను చాలా రీసెర్చ్ చేశాను. సెట్‌లోకి వెళ్లడానికి ముందే నేను కంప్లీట్‌గా ప్రేరణగా మారిపోయాను. నా కెరీర్‌లో ప్రేరణ మరచిపోలేని పాత్ర అని పూజా హెగ్డే చెప్పారు.

జ్యోతిష్యాన్ని నమ్ముతాను అంటూ

జ్యోతిష్యాన్ని నమ్ముతాను అంటూ

రాధే శ్యామ్ చిత్రం జోతిష్యం నేపథ్యంగా ఉంటుంది. ఈ చిత్రంలో ప్రభాస్ పామిస్ట్‌గా నటించారు. అయితే నేను కూడా నిజ జీవితంలో పామిస్ట్రీని, జాతకాలను, జోతిష్యాన్ని నమ్ముతాను. భారత దేశ సంస్కృతిలో జ్యోతిష్యం ఓ భాగం. మన సమాజంలో సాధువులు, సంతువులు ఎన్నో పుస్తకాలు, ఎన్నో థియరీలు చెప్పారు. శని గ్రహం, ఇతర గ్రహాల ప్రభావం మనిషి జీవితంపై ఉంటుంది. అలాంటి వాటిని నమ్మాల్సిందే అని పూజా హెగ్డే తెలిపారు.

ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఎనర్జీ వేరు..

ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఎనర్జీ వేరు..

నా కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాలు నిరాశపరిచినా నాకు పెద్ద హీరోల పక్కన నటించే అవకాశం లభించింది. హిందీలో హృతిక్ రోషన్, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌తో నటించాను. తారక్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. అల్లు అర్జున్ కూడా ఫుల్ ఎనర్జీతో ఉంటాడు. ప్రభాస్‌తో వర్క్ చేయడం ఫన్‌గా ఉంటుంది. తన తోటి నటీనటులను బాగా చూసుకొంటాడు. ఫుడ్ విషయంలో ఇంట్రెస్ట్‌ ఎక్కువ. ఇటలీలో షూట్ చేస్తున్నప్పుడు టీమ్‌లో కొందరికి కోవిడ్ వచ్చింది. ఆ సమయంలో ఫుడ్ తినడానికి కష్టపడుతుంటే.. నాకు ఫుడ్ చేసి పెట్టాడు అని పూజా హెగ్డే అన్నారు.

Recommended Video

Radhe Shyam కి ఆ మైండ్ సెట్ తో వస్తేనే అంచానాలు అందుకుంటుంది | Prabhas | Filmibeat Telugu
గ్లామర్ పాత్రలకు పనికి రానని..

గ్లామర్ పాత్రలకు పనికి రానని..

ముకుంద సినిమాలో నటించిన తర్వాత గ్లామర్ పాత్రలకు పనికి రానని చెప్పారు. డీజే సినిమాలో గ్లామర్‌‌గా కనిపించిన తర్వాత ఫెర్ఫార్మెన్స్ రోల్‌కు పనికిరానని చెప్పారు. ప్రేక్షకులు, సినీ వర్గాలు ఎప్పటికప్పుడు మనసులో మార్చుకొనేలా చేశాను. ప్రతీసారి సినీ వర్గాలకు ఛాలెంజ్ విసురుతూ నా శైలిలో సినిమాలు చేస్తున్నాను. ప్రతీ సినిమాకు, ప్రతీ పాత్రకు చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఆచార్య సినిమాలో ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నాను. సక్సెస్ ఫెయిల్యూర్ పట్టించుకోకుండా మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. రాధే శ్యామ్‌తో డబుల్ హ్యాట్రిక్ కొడుతాను అని పూజా హెగ్డే తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X