పోసాని వల్లే నా జీవితం నాశనం.. మా అమ్మకు గుండెపోటు.. పూనమ్ కౌర్

నటుడు పోసాని కృష్ణ మురళీపై నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ వల్లే నా జీవితం నాశనమైంది. నా పెళ్లి ఆగిపోయింది. నా తల్లి ఆరోగ్యం క్షీణించింది. నా జీవితంలో అన్నీ కోల్పోయాను అంటూ ఎమోషనల్ అయ్యారు. గత కొద్దికాలంగా తనకు అన్యాయం చేసిన వారిపై ఆవేదనతో అనేక విధాలుగా ఆరోపణలు చేస్తున్న ఆమె తాజాగా సిగ్నేచర్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ, రాజకీయ రంగాలు తన జీవితంతో ఎలా ఆడుకొన్నాయనే విషయాన్ని ఆవేదన భరితంగా వెల్లడించారు. పూనమ్ కౌర్ చెప్పిన విషయాల్లో వెళితే..

జర్నలిస్ట్ అంజలితో పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమకు చెందిన ఓ పెద్ద మనిషి నాకు అన్యాయం చేశాడు. ఆయన వద్ద నుంచి భారీగా డబ్బు తీసుకొని రాజీపడ్డానని మీడియా కథనాలు రాసింది. ఈ విషయం గురించి తన తల్లితో కొందరు తప్పుగా మాట్లాడారు. నా తల్లి గురుద్వారా వెళితే.. నీ కూతురును డబ్బు తీసుకొని అమ్మేశావా? అని అడిగారు. నేను ఎవరి వద్ద నుంచి డబ్బులు తీసుకోలేదు. ఆ విషయాన్ని నా బంధువులు కూడా నమ్మలేదు అని పూనమ్ తెలిపారు.

Poonam Kaur alleges Posani Krishna Murali

దర్శకుడు దాసరి నారాయణరావు ఉంటే నాకు ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. నా జీవితాన్ని నాశనం చేయడానికి 15 కోట్లు ఖర్చు చేశారు. ఓ దశలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. ఆ సమయంలో సినిమా, టెలివిజన్ రంగంలో అవకాశాలు చేజారాయి. దాంతో అమెరికాకు వెళ్తే అక్కడ యాక్సిడెంట్ అయింది. ఆ విషయాన్ని మా అమ్మకు చెప్పకుండా దాచిపెట్టాను. మా అమ్మ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నాకు జరిగిన ప్రమాదం గురించి చెప్పలేదు అని ఆమె అన్నారు.

నా జీవితంలో అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి నా స్నేహితుడు ముందుకు వచ్చాడు. ఆ సమయంలో నటుడు పోసాని ప్రెస్ మీట్ పెట్టి నా గురించి తప్పుడుగా, చెడుగా మాట్లాడాడు. నా గురించి అసత్య ఆరోపణలు, కట్టుకథలు చెప్పారు. దాంతో నన్ను పెళ్లి చేసుకొందామని ముందుకు వచ్చిన వ్యక్తి కూడా నాతో మాట్లాడటం మానేశాడు. నాకు దూరమయ్యాడు అని పూనమ్ కౌర్ చెప్పింది.

పోసాని సంఘటన తర్వాత నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక చచ్చిపోయింది. పోసాని ప్రెస్ మీట్ తర్వాత నా జీవితంలో సర్వం కోల్పోయాను. డబ్బు, మ్యారేజ్, వర్క్, హెల్త్, హ్యాప్పీనెస్, హోప్ అన్నీ పోయాను. పోసాని ప్రెస్ మీట్ తర్వాత నా జీవితాన్ని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో అన్ని రకాలుగా నాశనం అయింది. ఆ ప్రెస్ మీట్ తర్వాత మా అమ్మకు గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో నేను కాలేజీ మానేశాను. చాలా రోజులు అమ్మ హాస్పిటల్‌లోనే ఉండి కోలుకొన్నారు అని పూనమ్ చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X