Poorna Interview బాలకృష్ణతో నాకు ఆ టెన్షన్.. ఆయన చూస్తే దేవుడిని చూసినట్టు ఫీలింగ్.. దిష్టి తగులుతుందేమనని భయం
మలయాళంలో షామ్నా కాసీం పేరుతో సుపరిచితులైన హీరోయిన్ పూర్ణ తెలుగులో కూడా అద్బుతంగా రాణిస్తున్నారు. ఢీ రియాలిటీ డ్యాన్స్ షోలో హోస్ట్‌గా మెప్పిస్తూ ముందుకెళ్తున్నారు. తాజాగా 3 రోజేస్ వెబ్ సిరీస్‌తోను, అలాగే దృశ్యం 2 చిత్రంలో నటించి మెప్పించారు. ఇక తాజాగా ఆమె నటించిన అఖండ చిత్రం రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించిన పూర్ణ తన పాత్ర గురించి మాట్లాడుతూ పలు విశేషాలు మీడియాతో పంచుకొన్నారు. పూర్ణ తన పాత్ర గురించి ఏం చెప్పారంటే..

బోయపాటి ఆఫర్‌ను రిజెక్ట్ చేశా
అఖండ చిత్రంలో కీలక పాత్రలో నటించడం చాలా హ్యాపీగా ఉంది. 2008లో సీమ టపాకాయ చిత్రంలో నటించడం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఇంపార్టెంట్ రోల్‌లో నటించడం ఇదే మొదటిసారి. అయితే అవును సినిమా తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీను మంచి ఆఫర్ ఇచ్చారు. కొన్ని పరిస్థితుల కారణంగా నేను ఆయన ఆఫర్ స్వీకరించలేకపోయాను. క్యాస్టూమ్ పరంగా కొన్ని నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. అందుకే ఆ పాత్రను ఒదులుకొన్నాను. ఇంతకాలం బోయపాటి శ్రీనుతో పనిచేయలేకపోవడం కొంత మిస్ అయ్యాననే చెప్పవచ్చు అని హీరోయిన్ పూర్ణ అన్నారు.

నాది నెగిటివ్ పాత్ర కాదు...
అఖండ సినిమాలో నేను చేసిన పాత్రలో వాస్తవానికి వేరే హీరోయిన్ నటించాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ రోల్ నాకు వచ్చింది. బాలకృష్ణ సార్ కాంబినేషన్‌లో నటిస్తున్నాననే విషయం ఎక్సైటింగ్ అనిపించింది. నా క్యారెక్టర్ గురించి దర్శకుడు బోయపాటి చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నా పాత్ర పెద్దగా ఉండదు. కానీ కీలకమైన పాత్ర. ఈ చిత్రంలో నాది నెగిటివ్ పాత్ర కాదు. నా పాత్ర గురించి వివరాలు చెప్పలేను. బోయపాటి సినిమాలో బలమైన ఫీమేల్ క్యారెక్టర్ ఉంటుంది. అలాంటి పాత్ర నాకు లభించింది అని హీరోయిన్ పూర్ణ తెలిపారు.

బాలకృష్ణ నాకు స్వయంగా ఫుడ్..
బాలకృష్ణ సార్‌తో వర్క్ చేయడం ఓ పక్క టెన్షన్‌గా ఉండాలి. బాలయ్యకు వ్యతిరేకంగా డైలాగ్స్ చెప్పాలి. కానీ ఎలా రీసీవ్ చేసుకొంటారో అనే విషయం తెలియదు. ముందుగా నేను భయపడినట్టు కాకుండా సెట్‌లో చాలా కంఫర్ట్‌గా ఉన్నాను. అందుకు కారణం బాలకృష్ణనే. ఓ రోజు బాలయ్య ఏదో తింటున్నారు. అయితే బాలయ్య స్వయంగా నాకు ఆయన తినే ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చారు. వాస్తవనానికి తన అసిస్టెంట్‌తో పంపించవచ్చు. కానీ ఆయన మర్యాదగా నాకు ఇవ్వడంతో ఎగిరి గంతేశాను అని పూర్ణ పేర్కొన్నారు.

అలిసిపోని సింహం అంటే బాలయ్యే..
ఇక యాక్షన్ సీన్లలో బాలకృష్ణ ఎనర్జీ మాటల్లో చెప్పలేం. ఆయన చూస్తే దిష్టి తగులుతుందేమో అనే అంతగా ఫీలింగ్ కలిగింది. ఓ యాక్షన్ సీన్‌లో నాతోపాటు ప్రగ్యా పాల్గొన్నారు. అయితే సెట్‌లో బోయపాటి మినహా అందరూ అలసిపోయారు. కానీ బాలకృష్ణ మాత్రం అలసిపోలేదు. సింహం అంటే బాలయ్యే. ఆ తర్వాత ఆయన వద్దకు వెళ్లి మీ ఫోటో కావాలని అడిగాను. మిమ్మల్ని ఉదయం చూస్తే మాకు ఆ ఎనర్జీ వస్తుందని అన్నాను. ఆయన ఎనర్జీ, నటనపట్ల అంకితభావం కారణంగానే స్టార్ హీరో అయ్యారు అని పూర్ణ తెలిపారు.

దేవుడిని చూసినట్టు అనిపించింది..
బాలకృష్ణ గారు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. ఆ రెండు గెటప్స్‌తో నాకు కాంబినేషన్ సీన్లు ఉన్నాయి. సన్యాసి వేషంలో ఆయనను చూసినప్పుడు దేవుడిని చూసినట్టు అనిపించింది. ఈ సినిమాలో నాకు ఎక్కువగా సీన్లు లేవు కానీ ఉన్నవాటిలో ఓ కీలక సీన్ ఉంది. ఆ సీన్ పట్ల ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొంటారో అనే విషయం కోసం డిసెంబర్ 2 తేదీ కోసం వెయిట్ చేస్తున్నాను అని పూర్ణ వెల్లడించారు.
Recommended Video

దృశ్యం 2లో నా పాత్రకు ప్రశంసలు
నేను నటించే సినిమాల్లో నా రోల్ ఎంత ఉంటుందని పట్టించుకొను. నా పాత్ర ఎంత బలంగా ఉందో చూస్తాను. దృశ్యం 2 చిత్రంలో నా పాత్రకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఒక క్యారెక్టర్ నా వద్దకు వస్తే ఎంత వరకు నా కెరీర్‌కు సపోర్ట్‌గా ఉంటుదో చూసుకొంటాను. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. నాకు డ్యాన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. కానీ ఇప్పటి వరకు నేను డ్యాన్స్ బేస్ట్ సినిమా చేయలేదు. నా కెరీర్‌కు సహకరించిన నా తల్లికి రుణపడి ఉంటాను. నా కెరీర్‌కు ఢీ రియాలిటీ షో ఉపయోగపడింది. నేను తెలుగు నేర్చుకోవడానికి, మాట్లాడానికి చాలా హెల్ప్ అయింది. ఈ సినిమాకు నేను డబ్బింగ్ చెప్పలేదు అని పూర్ణ అన్నారు.


Click it and Unblock the Notifications











