ఆ భయంతో నిద్రపట్టలేదు.. అందుకే పెళ్లికి దూరం.. మ్యారేజ్ గురించి ప్రభాస్

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగస్టు 30న రిలీజ్ కానున్నది. రన్ రాజా రన్ సినిమా దర్శకుడు సుజిత్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి. అత్యున్నత సాంకేతికతతో రూపొందిన ఈ చిత్రంపై అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రభాస్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ.. సాహో మూవీ గురించి, వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలను వెల్లడించారు. ప్రభాస్ చెప్పిన ఆయన మాటల్లోనే..

బాహుబలి తర్వాత సుజిత్

బాహుబలి తర్వాత సుజిత్

బాహుబలి తర్వాత చాలా లైట్‌గా ఉండే సబ్జెక్ట్‌తో ప్రేమ కథ చేయాలనుకొన్నాను. కానీ సుజిత్ చెప్పిన కథలో చాలా వేరియేషన్స్ ఉండటంతో కమిట్ అయ్యాను. రన్ రాజా రన్‌కు ముందు నుంచే సుజిత్‌తో సినిమా చేయాలని అనుకొన్నాను. నాతో సినిమా చేస్తావా అని అడిగితే.. కథ రెడీ చేసుకొని వస్తానని చెప్పాడు. ఆ కాన్ఫిడెన్స్ చూసి ముచ్చటేసింది. ఆ క్రమంలో బాహుబలి1 తర్వాత వచ్చి కథ చెప్పి నన్ను మెప్పించాడు. పెదనాన్న (కృష్ణం రాజు) గారు కూడా కథ విని ఒకే అనడంతో సాహో మొదలైంది అని ప్రభాస్ అన్నారు.

బడ్జెట్ పెరిగినప్పుడల్లా

బడ్జెట్ పెరిగినప్పుడల్లా

సాహో ప్రారంభాలనుకొన్నప్పుడు ఈ రేంజ్, స్కేల్ లేదు. కనీసం రూ.100 కోట్లతో సినిమా చేయాలని అనుకొన్నాం. కానీ కథ, స్క్రిప్టు, పరిస్థితులు డిమాండ్ చేయడంతో దానిని రూ.150 కోట్లకు పెంచాం. అలా కథలో మార్పులు, స్క్రిప్టులు, సాంకేతిక నిపుణుల మార్పుతో బడ్జెట్ పెరిగిపోయింది. బడ్జెట్ పెరిగినప్పుడల్లా నిద్రపట్టలేదు అని ప్రభాస్ చెప్పారు.

 సుజిత్ రెడ్డి టేకింగ్

సుజిత్ రెడ్డి టేకింగ్

దర్శకుడు సుజిత్ అనుభవం, సాహో తీసిన విధానం చూస్తే ఎక్కడా సరితూగదు. వయసుకు మించిన పరిణితి కనిపించింది. మన కథను, ఎమోషన్లను హాలీవుడ్ స్థాయి నిపుణులకు చేరవేసి వాళ్ల నుంచి అవుట్‌పుట్‌ను తీసుకొన్న విధానం గొప్పగా ఉంటుంది. అందరి టెన్షన్‌ను సుజిత్ తీసుకొంటే.. ఆయన టెన్షన్‌ను తాను తీసుకొన్నానని ఓ ప్రశ్నకు ప్రభాస్ సమాధానమిచ్చారు.

యాక్షన్ మూవీ కానీ.. ఎమోషనల్‌గా

యాక్షన్ మూవీ కానీ.. ఎమోషనల్‌గా

సాహో పూర్తి స్థాయి యాక్షన్ మూవీలా కనిపించినా.. చాలా ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంటుంది. శ్రద్ధాకపూర్‌ పాత్రను ఆధారంగా చేసుకొనే కథ ట్రావెల్ అవుతుంది. ఫైట్స్ పెద్దగా ఉండవు. కానీ యాక్షన్ మూమెంట్ కార్లు, బైక్స్ రేసింగ్స్‌తో ఉత్తేజాన్ని కలిగించేలా ఉంటాయి. యాక్షన్‌కు సంబంధించిన కంటెంట్ కొత్తగా డిజైన్ చేశారు. యాక్షన్ సీన్లకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకొన్నాం అని ప్రభాస్ అన్నారు.

 ఆ టెన్షన్ కారణంగానే పెళ్లికి దూరం

ఆ టెన్షన్ కారణంగానే పెళ్లికి దూరం

ఇక మీ టెన్షన్ తీసుకొనే జీవిత భాగస్వామి ఎప్పుడు వస్తుందనే ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. టెన్సన్ తీసుకొంటుందో.. లేక టెన్షన్ ఇస్తుందో అనే భయంతోనే ఇంకా పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను అని ప్రభాస్ చమత్కరించారు. బాహుబలి, సాహో లాంటి సినిమాల వల్ల పెళ్లి ఆలస్యం అవుతున్నది అని ప్రభాస్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X